E-Paper
Advertisement

పెళ్లి గురించి బిగ్ బాస్ ఫేమ్ సంజన చెప్పింది వింటే షాక్ అవుతారు..

పెళ్లి గురించి బిగ్ బాస్ ఫేమ్ సంజన చెప్పింది వింటే షాక్ అవుతారు..
Advertisement

Sanjana Galrani: తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో ద్వారా మరింత దగ్గరైన నటి సంజన గల్రానీ, ఇటీవల ఒక ప్రముఖ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా పెళ్లి, సరైన భాగస్వామి ఎంపిక, జీవితంలో ఎదురయ్యే కష్టాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read also-Illu Illalu Pillalu Today Episodes: రామారాజుకు ప్రేమ పై అనుమానం.. వేధవతికి టెన్షన్.. సుకన్యకు చందు స్ట్రాంగ్ వార్నింగ్..

కర్మ సిద్ధాంతంపై అచంచల విశ్వాసం

Advertisement

సంజన తన ఇంటర్వ్యూలో ‘కర్మ’ గురించి మాట్లాడుతూ చాలా లోతైన విశ్లేషణ చేశారు. “మనం చేసే పాపపుణ్యాలను బట్టే మన కర్మ డిసైడ్ అవుతుంది. నేను ప్యూర్ కర్మను నమ్ముతాను” అని ఆమె పేర్కొన్నారు. మనం సరైన మార్గంలో వెళ్తే అంతా మంచే జరుగుతుందని, కానీ ఒకరికి 10% కీడు తలపెట్టినా, అది 10 వేల రెట్లు ఎక్కువగా తిరిగి వచ్చి మనల్ని నాశనం చేస్తుందని ఆమె హెచ్చరించారు. తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను కూడా ఆమె ఈ కర్మ సిద్ధాంతంతోనే పోల్చుకున్నారు.

భాగస్వామి ఎంపికపై కీలక సూచనలు

పెళ్లి గురించి మాట్లాడుతూ, భాగస్వామి కేవలం తోడుగా ఉండటమే కాకుండా, మన కష్టసుఖాల్లో అండగా నిలబడే వ్యక్తి అయి ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న మహిళలకు వారి వృత్తిని గౌరవించే మరియు ప్రోత్సహించే భాగస్వామి దొరకడం చాలా ముఖ్యమని చెప్పారు. తన భర్త తనకెంతో మద్దతుగా నిలుస్తున్నారని, అందుకే తాను మళ్ళీ వృత్తిపరంగా రాణించగలుగుతున్నానని ఆమె పేర్కొన్నారు. పెళ్లి చేసుకునే వారితో కుదిరితే కొన్ని రోజులు ట్రావెల్ చెయ్యాలని ఆమె చెప్పుకొచ్చారు.

Advertisement

Read also-తీరని కోరికల వల్ల పుట్టిన సీక్రెట్ ఎఫైర్… రిటైర్డ్ అయినా తప్పని తిప్పలు… బాబోయ్ పిచ్చెక్కిస్తున్న సీన్లు

ప్రస్తుతం సంజన ‘ఏ దేవి వరమో నీవు’ అనే సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అరుంధతి సినిమాలో జేజమ్మ లాంటి పవర్‌ఫుల్ ఉమెన్ సెంట్రిక్ పాత్రలు చేయాలనేది తన చిరకాల కోరిక అని ఆమె వెల్లడించారు. షూటింగ్ లొకేషన్‌లో తాను చాలా క్రమశిక్షణతో ఉంటానని, ఎదురుగా ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నా తన కాన్ఫిడెన్స్ తగ్గదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాలని, మన ప్రవర్తనే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని సంజన గల్రానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా సందేశాన్ని ఇచ్చారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×