E-Paper
Advertisement

పవన్‌తో రీతూ పెళ్లి.. మొత్తానికి బయటపెట్టేశారు, ట్విస్ట్ ఏమిటంటే?

పవన్‌తో రీతూ పెళ్లి.. మొత్తానికి బయటపెట్టేశారు, ట్విస్ట్ ఏమిటంటే?
Advertisement

Rithu Chowdary, demon Pawan, Bigg Boss, music album : బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్ మీడియా ఫాలోవర్లకు బాగా పరిచయమున్న జోడీ రీతూ చౌదరి (Rithu Chowdary), డెమోన్ పవన్(Demon Pawan). బిగ్‌బాస్ హౌస్‌లో మొదలైన వీరి స్నేహం అక్కడే ప్రేమకు దారి తీసింది అనే కామెంట్లు కూడా వ్యక్తమయ్యాయి. పైగా షో ముగిసిన తర్వాత కూడా వీరి బంధం అలాగే కొనసాగింది. నిత్యం ఈవెంట్లు, షోలలో కలిసి కనిపించడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో వీరు పెళ్లి బట్టల్లో కనిపించి అందరికీ పెద్ద షాకే ఇచ్చారు.

బిగ్‌బాస్‌లో మొదలైన బంధం:

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో డెమోన్ పవన్, రీతూ చౌదరిల జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హౌస్‌లో సెలబ్రిటీ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ, రీతూ మాత్రం పవన్‌కు బాగా క్లోజ్ అయింది. పవన్ కూడా ప్రతి విషయంలో రీతూకు సపోర్ట్‌గా ఉండేవాడు. ఇక రీతూ ఎలిమినేట్ అయిన తర్వాత కూడా బయట ఉండి పవన్ గెలుపు కోసం తన పీఆర్ టీమ్‌ను వాడి ఓటింగ్ చేయించిందనే ప్రచారం జరిగింది. బయటకు వచ్చాక కూడా ఇద్దరి మధ్య ఏదో ఉందనే రూమర్లు బాగా నడిచాయి.

పెళ్లి దండలతో వైరల్ పిక్స్:

Advertisement

ఇటీవల కాలంలో పలు టీవీ షోలు, ఈవెంట్లలో వీరిద్దరి పెళ్లిపై రకరకాల జోకులు వేయడం, ప్రోమోలు వదలడంతో అభిమానులు నిజంగానే వీరిద్దరూ ఒకటి కాబోతున్నారని భావించారు. దానికి బలం చేకూరుస్తూ తాజాగా వీరిద్దరూ సాంప్రదాయ పెళ్లి దుస్తుల్లో, చేతిలో పూలదండలు పట్టుకుని, క్యూట్‌గా ఒకరి చేతిని ఒకరు పట్టుకున్న ఫొటోలు సోషల్ మీడియాను ఊపేసాయి. “మొత్తానికి పవన్‌తో రీతూ పెళ్లి ఫిక్స్ అయిపోయింది, అంతా బయటపెట్టేశారు” అని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు.

also read:రెండో పెళ్లిపై మనసులో మాట బయటపెట్టిన సురేఖ వాణి!

అస్సలు ఊహించని ట్విస్ట్:

Advertisement

అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ దాగి ఉంది! అభిమానులు అనుకున్నట్లుగా ఇది నిజమైన పెళ్లి కానే కాదు. వీరిద్దరూ కలిసి నటించిన కొత్త ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ ‘బంగారం’ ప్రమోషన్స్ కోసం వేసిన గెటప్ ఇది. అఫ్రోజ్ అలీ క్రియేషన్స్, డీపీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సాంగ్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. అందులోనే వీరిద్దరూ నూతన దంపతుల గెటప్‌లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు.

వీక్షకులను అలరించనున్న ‘బంగారం’:

విజ్జు ముదిరాజ్ దర్శకత్వం వహించిన ఈ ‘బంగారం’ పాటను అఫ్రోజ్ అలీ, సమీర భరద్వాజ్ పాడగా, రంజిత్ రెడ్డి సంగీతం అందించారు. “మా కాంబోలో వస్తున్న ఈ సాంగ్ మీ ప్లేలిస్ట్‌లను రూల్ చేస్తుంది” అంటూ వీరు సోషల్ మీడియాలో పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక పెళ్లి వార్త నిజం కాదని తెలిసినప్పటికీ, తమ అభిమాన జంటను ఇలా ఒకే ఫ్రేమ్‌లో స్క్రీన్‌పై చూడటానికి ఫ్యాన్స్ సిద్ధమైపోతున్నారు.

మొత్తానికి పెళ్లి డ్రెస్‌తో అందరినీ కంగారు పెట్టిన రీతూ చౌదరి, డీమాన్ పవన్ జోడీ.. అదంతా ఓ ఆల్బమ్ కోసమని తేల్చేసి ఆసక్తికర ట్విస్ట్ ఇచ్చారు. బిగ్‌బాస్ నుంచి జోరు మీదున్న ఈ కెమిస్ట్రీ, ఇప్పుడు రాబోయే ‘బంగారం’ పాటతో ఏ స్థాయిలో హిట్ అవుతుందో వేచి చూడాలి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×