E-Paper
Advertisement

Rithu Chowdary – Pavan: పవన్‌కు ముద్దు పెట్టిన రీతూ…  స్టేజ్‌పైన ఏంట్రా ఆ పనులు?

Rithu Chowdary – Pavan: పవన్‌కు ముద్దు పెట్టిన రీతూ…  స్టేజ్‌పైన ఏంట్రా ఆ పనులు?
Advertisement

RithuChowdary – Pavan: రీతూ చౌదరి పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ యాంకర్ గా కూడా పలు కార్యక్రమాలలో నటించి మెప్పించారు. ఇక బుల్లితెర సీరియల్స్ లో కూడా సందడి చేశారు. ఇలా ఇండస్ట్రీలో కెరియర్ పరంగా బిజీగా ఉన్న రీతూ చౌదరి(Rithu Chowdary) ఇటీవల బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9 Telugu)తెలుగు రియాలిటీ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా మరింత పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలో దాదాపు 13 వారాలపాటు కొనసాగిన ఈమె ఈ కార్యక్రమం ద్వారా మరింత ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈసారి బిగ్ బాస్ 9 కార్యక్రమంలో సెలబ్రిటీలతోపాటు కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా పలువురు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా కామన్ మ్యాన్ గా వెళ్లిన కళ్యాణ్ విజేతగా బయటకు వచ్చారు.

రీతూ పవన్ లవ్ ట్రాక్..

ఇలా కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా హౌస్ లోకి అడుగు పెట్టిన వారిలో డిమోన్ పవన్(Pavan) కూడా ఒకరు. పవన్ హౌస్ లోకి వెళ్ళిన మొదటి రోజు నుంచి రీతు ఎలిమినేట్ అయ్యే వరకు ఆమెతో చాలా సన్నిహితంగా ఉంటూ కాస్త పులిహోర కలిపారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ కొనసాగుతుంది అంటూ ఎన్నో రకాల వార్తలు బయట హల్చల్ చేశాయి. ఇక ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ బయట కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ వార్తలు నిజమేనని అందరూ భావించారు.

టాప్ త్రీ కంటెంట్ గా పవన్..

Advertisement

ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో సందడి చేసిన సెలబ్రిటీలు ఆదివారం విత్ స్టార్ మా పరివారం (Aadivaram with Star maa Parivaaram) కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీముఖి బిగ్ బాస్ కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడుతూ వారిని ఆట పట్టించారు. ఈ నేపథ్యంలోనే పవన్ వద్దకు వెళ్లి పవన్ అసలు కామనర్ గా నువ్వు హౌస్ లోకి వెళ్లి, ఫినాలే వరకు ఉండి టాప్ త్రీ కంటెంట్ గా సూట్కేస్ తో బయటకు వచ్చావు ఎలా అనిపించింది అంటూ ప్రశ్నించారు.

Advertisement

ఇక పవన్ మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ రీతూ చౌదరి అంటూ మాట్లాడటంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ కేకలు వేశారు. దీంతో రీతూ చౌదరి నా మోస్ట్ ఇంపార్టెంట్, నా బుజ్జి బంగారం పవన్ అంటూ ఏకంగా స్టేజ్ పైనే అందరూ చూస్తుండగానే రీతూ తనకు ముద్దు పెట్టడంతో ఈ ప్రోమో వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు అసలు ఏంట్రా ఇది ఏకంగా స్టేజ్ పైనే ముద్దు పెట్టడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఈ ఘటన ద్వారా మరోసారి వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారనే వార్తకు మరింత బలం చేకూరింది. మరి బిగ్ బాస్ 9 కంటెస్టెంట్లు ఈ కార్యక్రమంలో ఎలాంటి హంగామా చేశారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాలి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×