E-Paper
Advertisement

Rithu Chowdary: ఒక అమ్మాయిని ఇంకో అమ్మాయే నాశనం చేస్తుంది.. రీతూ చౌదరి సంచలన పోస్ట్!

Rithu Chowdary: ఒక అమ్మాయిని ఇంకో అమ్మాయే నాశనం చేస్తుంది.. రీతూ చౌదరి  సంచలన పోస్ట్!
Advertisement

Rithu Chowdary: ఒకప్పుడు ‘గోరింటాకు’ వంటి సీరియల్స్ లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగుపెట్టిన రీతూ చౌదరి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇక బిగ్ బాస్ ద్వారా మరింత ఫేమ్ తెచ్చుకున్న ఈమె.. ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా కొనసాగుతోంది. గతంలో రెండేళ్ల క్రితం శ్రీకాంత్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్టు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు స్వయంగా అధికారికంగా ప్రకటించింది. కానీ ఏమైందో తెలియదు కానీ మళ్ళీ వారిద్దరూ విడిపోయారు. అంతేకాదు తాను శ్రీకాంత్ అనే వ్యక్తి నుండి విడిపోయినట్లు రీతూ చౌదరి కూడా వెల్లడించింది.

రీతూ చౌదరి ఎమోషనల్ పోస్ట్…

ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కామన్ మ్యాన్ క్యాటగిరిలో అడుగుపెట్టిన డిమోన్ పవన్ తో డేటింగ్ చేస్తోందని వార్తలు వచ్చాయి. కానీ దీనిపై రీతూ స్పందించలేదు. ఇక ఇద్దరూ క్లోజ్ గానే తిరుగుతున్నారు. పైగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. అంతేకాదు టీవీ షోలలో కలసి సందడి చేస్తున్నారు. ఇక అంతా బాగుంది అనుకునే లోపే తాజాగా రీతూ చౌదరి తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఒక అమ్మాయి జీవితాన్ని మరో అమ్మాయి నాశనం చేస్తుంది అనేలా ఆమె పెట్టిన కామెంట్ ఇప్పుడు పలు అనుమానాలకు తెరలేపింది.

బ్రేకప్ స్టోరీ..

Advertisement

ఇకపోతే రీతూ చౌదరి తన ఇన్స్టా స్టోరీలో.. “ఈ సమాజం అమ్మాయిలను చాలా ఈజీగా జడ్జ్ చేస్తుంది. కానీ ఆమెకి గతంలో ఏం జరిగిందో ఎవరూ అడగరు. తను నిజంగానే ప్రేమించింది. కేర్ తీసుకుంది. నిజాయితీగా ఉంది. కానీ తానే బాధపడింది. ప్రేమ కోసం అడుక్కుంది. కానీ చివరికి మోసపోయింది. రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడంతో డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయింది. తన ఫేస్ మీద స్మైల్ తో ఫ్యామిలీ కోసం కెరియర్ కోసం ఆమె ముందుకు నడుస్తోంది. కానీ ఆమె బాధని ఈ సమాజం చూడదు. రూమర్స్, ఆరోపణలు, నిజం కానీ కథలే అందరూ చూస్తారు. ముఖ్యంగా నిజం ఏంటో తెలియకుండా ఒక అమ్మాయిని చాలా సులభంగా జడ్జ్ చేస్తారు. ఒకవేళ తను అమాయకురాలైతే ఎందుకు సైలెంట్ గా ఉంది అంటారు. ఒకవేళ ఫైట్ చేస్తే ఆమె తెగించేసింది అంటారు.

also read:Peddi Movie: పెద్ది సినిమాని అంతమంది రిజెక్ట్ చేశారా?

అమ్మాయే అమ్మాయిని మోసం చేసింది..

Advertisement

ఇక అందుకే మాట్లాడే మాటలు అలసిపోయినప్పుడు నిశ్శబ్దం మాత్రమే ఆమె బలం అవుతుంది. అమ్మాయి హృదయాన్ని ముక్కలు చేసి ఆ అబ్బాయి మూవ్ ఆన్ అయిపోయాడు. ఒకప్పుడు ఫ్రెండ్ అని పిలిచిన అమ్మాయితోనే వెళ్లిపోయాడు. అన్నీ చూస్తున్నా.. అన్నీ తెలిసినా సైలెంట్ గానే ఉంది. ఆ అమ్మాయి స్నేహం కూడా ఆయుధంగా మారింది. ఒక అమ్మాయి డబ్బు కోసం, చీప్ అటెన్షన్ కోసం ఇంకో అమ్మాయి పై ఆరోపణలు చేసింది. అటు అమ్మాయిని సమాజం ముందు కూడా బ్యాడ్ చేసింది. తను అంతలా ఆలోచించలేదు. ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని ఇలా నాశనం చేస్తుందని అనుకోలేదు. అయినా సరే ఆ అమ్మాయి మాత్రం సైలెంట్ గానే ఉంది. తను బలహీనంగా ఉంది అని కాదు.. తన కర్మను, దేవుడినీ నమ్ముతుంది. అందుకే సమాజం తనను జడ్జ్ చేస్తున్నా సైలెంట్ గా బాధను భరిస్తూ బయటకు నవ్వుతూ ఉంది” అంటూ రీతూ చౌదరి ఒక లాంగ్ పోస్టు షేర్ చేసింది. ఇక రీతూ చౌదరి అలా ఈ పోస్ట్ పెట్టిందో లేదో.. రీతూ చౌదరి చెప్పిన ఆ అమ్మాయి తనేనా? ఆ అబ్బాయి ఎవరు? శ్రీకాంత్ యేనా ? తనను నెగిటివ్ చేసిన ఆ అమ్మాయి ఎవరు? ఇలా పలు కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.. ఏది ఏమైనా రీతూ చౌదరి షేర్ చేసిన ఈ ఎమోషనల్ స్టోరీ.. ఈ బ్రేకప్ స్టోరీ ఏ అమ్మాయిది అనే విషయం చర్చగా మారింది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×