E-Paper
Advertisement

Satyabhama Serial Today Episode : ఇంట్లో రచ్చ చేసిన నందిని.. సత్య పుట్టినరోజు కనుక్కున్న క్రిష్.. శోభనంకు రెడీ..

Satyabhama Serial Today Episode : ఇంట్లో రచ్చ చేసిన నందిని.. సత్య పుట్టినరోజు కనుక్కున్న క్రిష్.. శోభనంకు రెడీ..
Advertisement

Satyabhama Serial Today Episode : గత ఎపిసోడ్ విషయానికొస్తే.. ఈ సత్య వల్ల నా పెత్తనం పోయింది. పనిమనిషి దగ్గర అధికారం కూడా పోయింది. ఇక లాభం లేదు ఆ సత్య దగ్గర నుంచి నా పెత్తనం లాక్కుంటాను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తానంటుంది. శోభనం కోసం క్రిష్ పడే పాట్లు మాములుగా ఉండవు. శోభనం కోసం భార్య చెప్పిన పనికి తలాడిస్తాడు. ఇక నందిని నాకు చెప్పావు సరే నీ మనుమడికి కూడా చెప్పాలిగా అప్పుడే బాగుంటుంది అని అంటుంది. రేణుక సీమంతం వేడుకల కోసం ప్లాన్ చేస్తారు. ఇక మైత్రి ని నందిని మా ఇంట్లో నువ్వు పూజ చెయ్యడం అందరు సపోర్ట్ చెయ్యడం ఏంటి అంటుంది. హర్ష నువ్వు పూజ చేస్తుంటే ఎవరు వద్దని అనలేదు అంటాడు.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నందిని మైత్రి తనకన్నా ముందే పూజ చెయ్యడంతో కోపంతో రగిలి పోతుంది. భర్త బాగు కోసం పూజ చేస్తారు. ఇక్కడ నీకోసం పూజ చేసేవాళ్ళు చాలా మందే నేనెందుకు అని అంటుంది. హర్ష నువ్వు ఇప్పుడు పూజ చేస్తుంటే ఎవరు వద్దని అనరు చేసుకో అంటాడు. నందిని కోపంతో తలకు చుట్టుకున్న టవల్ ను విసిరికొట్టి వెళ్ళిపోతుంది. ఇక క్రిష్ తన శోభనం కోసం సత్య పెట్టిన కండిషన్స్ తలచుకొని బాధపడుతుంటారు. తెలుగు మాసాలు, ఇంగ్లిష్ మాసాలు అని ఎవరు పెట్టారు. ఈ తెలుగు మాసాలా గురించి ఎవరిని అడగాలి అని అనుకుంటాడు. అప్పుడే ఎదురుగా బామ్మ ఉంటుంది. ఈ ముసలిదానికి అన్ని తెలుసు.. దీన్ని అడుగుతే శోభనం జరుగుతుందని వెళ్తాడు. బామ్మ ఏంటి ఎందుకు అంత కోపంగా ఉన్నావ్ అని అడుగుతాడు. నీకేం కావాలో చెప్పు అంటుంది.

Advertisement

బామ్మ నీకు తెలుగు సమాసాలా గురించి నీకు తెలుసు కదా.. అవి తెలుగు సమోసాలు, మిర్చి బజ్జీ కాదురా తెలుగు మాసాలు అంటుంది. అదే తెలుసు కదా అవును తెలుసు అంటుంది. అయితే అర్జునుడు పుట్టిన మాసం ఏదో తెలుసా అంటాడు. బాగా తెలుసు.. ఈ ప్రశ్న నిన్ను ఎవరు అడిగారు చెప్పు అంటుంది. సత్య అని చెబుతాడు. అదా సంగతి.. అర్జునుడుకు మరో పేరు పాల్గుణ అంటే మార్చి నెల అంటుంది. అబ్బా ఏమి చెప్పావు థ్యాంక్యూ అని సంతోషంగా సత్య దగ్గరకు వెళ్తాడు. సత్య ను కేకలు వేసి మరి పిలుస్తాడు. కనిపెట్టాను నీ పుట్టినరోజు మార్చిలో అంటాడు. ఇక శోభనంకు రెడీ అంటాడు. అవును రెడీ కానీ తేదీ చెప్పలేదు అంటుంది. అదొక్కటే పెండింగ్ అది చెబితే మన శోభనం అంటుంది. అదొక్కటి ఉంది కదా.. ఆ ఒక్కటే ఉంది. వెళ్లి కనుక్కో అంటుంది. దానికి క్రిష్ నీకు పాపం తగులుతుంది అంటాడు. ముందు వెళ్లి కనుక్కొని రా అంటుంది. అయితే ఏదోకటి క్లూ ఇస్తావ్ గా ఇప్పుడు ఇవ్వవా అని అంటాడు.

అప్పుడే సత్య ఒక ఫోటోను చూస్తుంది. ఆ ఫోటోను క్రిష్ కు చూపించింది. దానికి క్రిష్ కత్తిలా ఉంది. అంటే తాను నా ఫ్రెండ్.. భద్రకాళి హాస్టల్ లో ఉంటుంది. తన పేరును చెప్పను తన హాస్టల్ రూమ్ గది నెంబర్ నా బర్త్ డే డేట్… అని అంటుంది. ఇక క్రిష్ రేపు కనుక్కొని వస్తాను రేపు ఇక శోభనం జరిగిపోవాలి అంటాడు. ఇక అప్పుడు తన ఫ్రెండ్ తో కలిసి హాస్టల్ దగ్గరకు వెళ్తాడు.. అక్కడ వాచ్ మెన్ వాళ్లను హాస్టల్ లోకి వెళ్లనివ్వడు.. అప్పుడు జరిగే కన్వర్జేషన్ కాస్త కామెడీగా ఉంటుంది. ఇక మైత్రి ఫోన్ తీసుకొని హర్ష ఫోన్ మాట్లాడుతాడు. ఇక సత్య భైరవి, రేణుక శారీస్ కొనడానికి చూస్తారు. అప్పుడు సత్య మహాదేవయ్యకు చురకులు అంటిస్తుంది. అందరు డౌట్ గా చూస్తారు. ఇక అంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో సత్య పుట్టినరోజు డేట్ ను కనుక్కొని వస్తాడు క్రిష్.. ఇక శోభనం జరుగుతుంది.. రేపు ఏం జరుగుతుందో చూడాలి..

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×