E-Paper
Advertisement

BMW Film: ఓటీటీలోకి వచ్చిందో లేదో అప్పుడే టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైన రవితేజ సినిమా.. ఎప్పుడంటే?

BMW Film: ఓటీటీలోకి వచ్చిందో లేదో అప్పుడే టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైన రవితేజ సినిమా.. ఎప్పుడంటే?
Advertisement

BMW Film: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bharta Mahasayaluklu Vigyapthi). కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 13వ తేదీ థియేటర్లలో విడుదల అయింది. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో కాకపోయినా పరవాలేదు అనిపించుకుంది. భార్య, మాజీ ప్రియురాలు మధ్య నలిగిపోయే భర్తగా రవితేజ (Raviteja) ఈ సినిమాలో కనిపించారు. ఇందులో రవితేజకు జోడిగా ఆశికా రంగనాథ్ డింపుల్ హైయతి నటించిన సంగతి తెలిసిందే.

ఆలస్యంగా ఓటీటీలోకి రవితేజ సినిమా..

Advertisement

ఇలా థియేటర్లలో అనుకున్న స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో మరోసారి రవితేజ అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలలకు డిజిటల్ మీడియాలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఈ సినిమా ఓటీటీ విడుదల ఆలస్యమైంది. మార్చి 13వ తేదీ ఈ సినిమా జీ 5 ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఇలా డిజిటల్ మీడియాలోకి వచ్చి రెండు రోజులు కూడా కాకుండానే అప్పుడే ఈ సినిమా టీవీ ప్రీమియర్ కు కూడా సిద్ధం కాబోతున్న నేపథ్యంలో అభిమానులు షాక్ అవుతున్నారు.

జీ తెలుగులో భర్త మహాశయులకు విజ్ఞప్తి..

తాజాగా జీ తెలుగు ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కి సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు. ఒక ప్రోమోని విడుదల చేస్తూ ఈ సినిమా జీ తెలుగులో మార్చి 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతున్నట్లు తెలియజేశారు. ఇలా ఓటీటీలోకి వచ్చి పది రోజులు కూడా గడవకుండానే ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కాబోతుండడం విశేషం. థియేటర్లలో ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీ, టెలివిజన్ లో ప్రసారమవుతూ ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది.

Advertisement

ఇరుముడి పనులలో బిజీగా రవితేజ..

ఇక ఈ సినిమా తర్వాత రవితేజ తన తదుపరి సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇరుముడి(Irumudi) అనే పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ పనులలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రవితేజకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయగా ఈ పోస్టర్ సినిమా పట్ల మంచి అంచనాలని పెంచేస్తుంది. ఈ సినిమా తండ్రి కూతురి మధ్య అనుబంధం నేపథ్యంలో కొనసాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రవితేజకు జోడిగా ప్రియా భవాని శంకర్ కావేరి అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే హీరోయిన్ పస్ట్ లు పోస్టర్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక రవితేజ అభిమానులు అందరూ కూడా ఈ సినిమా పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా రవితేజకు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Rashmika Mandanna: మరిది పుట్టినరోజు..మిస్ అవుతున్నాం అంటూ రష్మిక స్పెషల్ విషెస్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×