E-Paper
Advertisement

అలాంటి జబ్బుతో బాధపడుతున్న యాంకర్ రష్మీ.. ఏదీ శాశ్వతం కాదంటూ!

అలాంటి జబ్బుతో బాధపడుతున్న యాంకర్ రష్మీ.. ఏదీ శాశ్వతం కాదంటూ!
Advertisement

Rashmi Gautam:ప్రముఖ యాంకర్ రష్మీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో, చలాకీతనంతో అందరినీ ఆకట్టుకునే ఈమె.. అటు సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కువగా ఒకే తరహా పాత్రలు రావడం, ఆ పాత్రలతో పెద్దగా గుర్తింపు లభించకపోవడంతో ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసి.. బుల్లితెర పైనే జబర్దస్త్ , ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ యాంకర్ గా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. ఇక ఈ మధ్య జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

బరువు పెరగడంపై రష్మీ కామెంట్..

ఇకపోతే అప్పుడప్పుడు సమాజంలో జరిగే పలు అంశాలపై స్పందించే రష్మీ సడన్గా తనకు అలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అందుకే తాను బరువు పెరగాల్సి వచ్చిందని చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచింది. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ది టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ అనే ఒక టాలెంట్ హంట్ షో కి యాంకర్ గా వ్యవహరిస్తోంది రష్మి.. ఈ కార్యక్రమానికి జడ్జెస్ గా మంచు లక్ష్మి, వైవా హర్ష తో పాటు రష్మీ కూడా జ్యూరీగా వ్యవహరిస్తోంది. ఈ షో ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈమె తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చింది.

Advertisement

also read:రేటు తగ్గించమన్న స్టూడెంట్స్.. దిమ్మతిరిగే సమాధానమిచ్చిన విష్ణు ప్రియ!

త్వరలోనే అలా కనిపిస్తా అంటూ రష్మీ హామీ..

బరువు పెరగడంపై వచ్చిన కామెంట్స్ గురించి రష్మీ మాట్లాడుతూ ఎవరూ ఊహించని సమాధానాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఈ ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా ఈ మధ్యకాలంలో మీరు కాస్త బొద్దుగా కనిపిస్తున్నారు అని అడగగా రష్మీ మాట్లాడుతూ.. నిజానికి నాకు కూడా ఇలా బొద్దుగా కనిపించడం అసలు ఇష్టం లేదు. కెమెరా ముందు కనిపించే లుక్ వాస్తవానికి చాలా భిన్నంగా ఉంటుంది. కెమెరాల వల్ల కొంతమంది రియల్ కంటే ఇంకా లావుగా కనిపిస్తారు. అయితే నేను కూడా ఇలా కనిపించడానికి నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల వల్లే నా శరీరంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకే ఇప్పుడు కాస్త నేను బొద్దుగా కనిపిస్తున్నాను. అయితే ఈ పరిస్థితి ఎప్పటికీ శాశ్వతం కాదు. ప్రస్తుతం ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టిన నేను త్వరలోనే ఆరోగ్య సమస్యల నుంచి కోలుకొని ఫిట్ గా , స్లిమ్ గా కనిపిస్తాను అంటూ అభిమానులకు హామీ ఇచ్చింది.

20 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను – రష్మీ

Advertisement

ఇదే ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ..” గత 20 సంవత్సరాలుగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. అయినప్పటికీ ప్రతి అనుభవం నాకు ఒక కొత్త పాటమే నేర్పింది. అందుకే జీవితంలో ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవడం అలవాటు పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది రష్మీ. ఇకపోతే రష్మీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అసలు రష్మీకి వచ్చిన ఆ ఆరోగ్య సమస్యలు ఏమిటి? అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. మరి మునుముందు అయినా రష్మీ తనకు వచ్చిన ఆ ఆరోగ్య సమస్యలు ఏమిటో అభిమానులతో పంచుకుంటుందేమో చూడాలి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×