E-Paper
Advertisement

Rajeev Kanakala: సుమాకు స్పెషల్ బర్తడే విషెస్ చెప్పిన రాజీవ్ కనకాల.. వందేళ్లు కాదు 130ఏళ్లు అంటూ!

Rajeev Kanakala: సుమాకు స్పెషల్ బర్తడే విషెస్ చెప్పిన రాజీవ్ కనకాల.. వందేళ్లు కాదు 130ఏళ్లు అంటూ!
Advertisement

Rajeev Kanakala: సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి విమర్శలకు చోటు ఇవ్వకుండా ఆదర్శ దంపతులుగా కొనసాగుతున్న ఎన్నో జంటలు మనకు తారసపడుతూ ఉంటాయి. అయితే ఆ జంటల గురించి ప్రస్తావన వస్తే చాలా సమయమే పడుతుంది కానీ బుల్లితెర ఇండస్ట్రీలో ఆదర్శ దంపతులు అనగానే టక్కున గుర్తొచ్చే జంట రాజీవ్ కనకాల (Rajeev Kanakala), సుమా కనకాల (Suma Kanakala) ఇద్దరూ ఇండస్ట్రీ కి చెందిన నటీనటులే కానీ ఆ ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకొని తమ దాంపత్య జీవితంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇకపోతే ఈరోజు సుమ కనకాల పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆమె భర్త ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల తన భార్యకు స్పెషల్గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వందేళ్లు కాదు 130 ఏళ్లు నువ్వు హ్యాపీగా ఉండాలి అంటూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు

వందేళ్లు కాదు 130 ఏళ్లు సంతోషంగా ఉండాలి..

ఈ మేరకు రాజీవ్ కనకాల తన ట్విట్టర్ ఖాతా ద్వారా..”శుభజన్మదినం తుభ్యం
శుభజన్మదినం తుభ్యం
శుభజన్మదినే తవ హే
సకలం సఫలం భూయాత్
సకలం చ శుభం భూయాత్ ” అంటూ తెలుగులో ఇలా వేద మంత్రాన్ని రాస్తూ నిండు నూరేళ్లు.. కాదు కాదు ఒక 120 – 130 ఏళ్లు మీ మనవలు , మనవరాళ్లతో హ్యాపీగా ఉండాలని దీవిస్తున్నాను. హ్యాపీ బర్తడే సుమ కనకాల అంటూ సుమాకు ప్రత్యేకంగా స్పెషల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఆమె ఫోటోలను పంచుకున్నారు రాజీవ్ కనకాల. ఇక ప్రస్తుతం సుమాకు చెప్పిన ఈ స్పెషల్ విషెస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. భార్యపై తన ప్రేమను చాటుకున్నారు రాజీవ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ.. సుమాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రాజీవ్ కనకాల , సుమా కనకాల ప్రేమ, పెళ్లి:

Advertisement

రాజీవ్ కనకాల , సుమా కనకాల ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే.. ఒక స్టూడియోలో సుమని చూశాను . చూసిన వెంటనే నేను ఆమెకు ఆకర్షితుడయ్యాను. ఆమె నాకు పరిచయమైన తర్వాత మేఘమాల, మాధురి , జీవనరాగం వంటి సీరియల్స్ చేసింది. దీంతో మా మధ్య స్నేహం , సాన్నిహిత్యం మరింత పెరిగింది. అప్పుడే నేను సుమను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అయితే ప్రపోజ్ చేస్తే నో అంటుందని భయపడ్డాను. ఎందుకంటే నేను ప్రేమిస్తున్న విషయం ఆమెకు ముందే తెలిసిపోయింది. అయినా సరే ధైర్యం చేసి ఆమెకు ప్రపోజ్ చేశాను.. ఇక ప్రపోజ్ చేసిన మూడు రోజుల్లోనే ఆమె నన్ను ఇష్టపడేలా చేశాను. ఇక అప్పట్లో అమ్మాయిల విషయంలో నేను చాలా ఫాస్ట్ గా ఉండేవాన్ని.. అందరిలాగా కాకుండా రూటు మార్చి నా స్టైల్ లో ఆమెను నా ప్రేమ ఒప్పుకునేలా చేశాను.. ఇకపోతే మా ఇద్దరి మధ్య కొంతకాలం బ్రేక్ వచ్చింది. కానీ అవన్నీ తొలగిపోయి 1998 చివర్లో ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకొని దగ్గరయ్యాము. ఇంకా గ్యాప్ ఇస్తే మళ్లీ విడిపోతామేమో అనే భయంతో నెల రోజుల తర్వాత 1999 ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్నాము. అప్పటినుంచి ఇప్పటివరకు మా దాంపత్య జీవితం సాఫీగా సాగుతోంది అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు రాజీవ్ కనకాల.

 

Advertisement

also read:Soniya Singh: గంటల తరబడి బాత్రూంలోనే.. అబ్బాయిలందరికీ సోనియా ఝలక్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×