E-Paper
Advertisement

Kissik Talks: ప్రతి అమ్మాయికి ఆ సపోర్టు ఉండాలి – ప్రియా శెట్టి

Kissik Talks: ప్రతి అమ్మాయికి ఆ సపోర్టు ఉండాలి – ప్రియా శెట్టి
Advertisement

Kissik Talks:బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి అగ్ని పరీక్ష ద్వారా అడుగుపెట్టి మూడు వారాలపాటు కొనసాగి అప్పుడే ఎలిమినేట్ అయిన ప్రియా శెట్టి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో , అందంతో గయ్యాళితనంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. స్వతహాగా తన వాయిస్ ఎక్కువ అని కాకపోతే తను మాట్లాడినా అరిచినట్టు ఉంటుందని, అందుకే తనపై చాలామంది నెగటివ్ కామెంట్లు చేశారు అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపోతే తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన ఈమె రీసెంట్ గా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో సందడి చేసింది.

ప్రతి అమ్మాయికి ఆ తోడు కావాలి -ప్రియా శెట్టి

ప్రతి అమ్మాయికి తండ్రి సపోర్టు చాలా ఉండాలి అంటూ ఆమె తెలిపింది. ఇదే విషయంపై ప్రియా శెట్టి మాట్లాడుతూ.. అబ్బాయిలు అమ్మతో క్లోజ్ ఉంటారు. అమ్మాయిలు నాన్నతో క్లోజ్ ఉంటారు. ఇక నేను మా నాన్నతో చాలా క్లోజ్ గా ఉంటాను. నేను నాన్న కూచీని. మా నాన్న లేకుంటే నేను లేను. ముఖ్యంగా ప్రతి అమ్మాయికి నాన్న సపోర్టు చాలా ముఖ్యం. ఫాదర్ తో పెరిగిన అమ్మాయిలు ఒకలా ఉంటారు. ఫాదర్ లేకుండా పెరిగిన అమ్మాయిలు ఇంకోలా ఉంటారు. ఇక ఫాదర్ లేకుండా పెరిగిన అమ్మాయిలకు ఏదో తెలియని బాధ ఉంటుంది. ఆ బాధను పూడ్చుకోవడానికి నాన్న ప్రేమను స్నేహితుల దగ్గర ,బాయ్ ఫ్రెండ్ దగ్గర లేక కట్టుకున్నవాడి దగ్గర వెతుక్కుంటారు. ఇక కుటుంబాలను వదిలేసి కొంతమంది ఫాదర్స్ వెళ్లిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే కచ్చితంగా మీరు మీ కుటుంబాన్ని చూసుకోవాలి. మీరు ఉన్నారనే మీ కుటుంబం మీ వెంట వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళను మీరు మోసం చేసి వెళ్లిపోవడం ఎంతవరకు కరెక్ట్ ..మీ పిల్లలకు మీరు ఉన్నారు అనే భరోసా కల్పించాలి అంటూ కాస్త ఎమోషనల్ గా మాట్లాడింది ప్రియా శెట్టి.

Advertisement

also read:Kissik Talks: వెన్నుపోటు పొడిచారు.. ఆ నరకాన్ని తట్టుకోలేకపోయా – ప్రియా శెట్టి

మరో శ్రీ లీల కావాలనుకున్న ప్రియా శెట్టి..

ఇక అలాగే ఇండస్ట్రీ లైఫ్ గురించి కూడా ఆమె మాట్లాడుతూ.. నాకు ఇండస్ట్రీలోనే ఉండాలని ఉంది. కాకపోతే నేను నా చదువును నెగ్లెట్ చేయడం లేదు. రీసెంట్గా ఎగ్జామ్స్ కూడా రాసాను. ఒకవైపు నా చదువుకొని కొనసాగిస్తూనే మరొకవైపు ఇండస్ట్రీలో కూడా నిలదొక్కుకోవాలని చూస్తున్నాను. ఒకవేళ నాకు అవకాశాలు లేకపోతే నా చదువే నాకు అన్నం పెట్టగలగాలి. అందుకే నేను రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అంటూ ప్రియా శెట్టి తెలిపింది. ఇక మరో శ్రీ లీలా కావాలనుకుంటున్నారా అని వర్షం అడగగా.. సరదాగా నవ్వేసింది ఈ ముద్దగుమ్మ.

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×