E-Paper
Advertisement

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ హైలెట్ టీఆర్పీ రేటింగ్.. జూలై హైలెట్ ఎపిసోడ్స్..

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ హైలెట్ టీఆర్పీ రేటింగ్.. జూలై హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Podarillu TRP Rating : తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్న పొదరిల్లు సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. గత ఏడాది డిసెంబర్ లో ప్రారంభమైన ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ సీరియల్స్ తో పోటీ పడుతుందంటే ఇది మామూలు విషయం కాదు.. ఐదుగురు మగాళ్లు ఉన్న ఇంటికి ఒక ఆడపిల్ల వెళితే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది.. అసలు ఆ ఇంట్లో వాళ్ళ ఆమెకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్న స్టోరీతో ఈ సీరియల్ మొదలైంది.. ఈ సీరియల్ రిలీజ్ కి ముందు ప్రోమో లు కూడా ఇలానే వచ్చాయి.. దాంతో సీరియల్ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఎక్కువ మంది జనాలు చూస్తున్నారు.. అలా సీరియల్ ప్రతి నెల కూడా టిఆర్పి రేట్ ని పెంచుకుంటూ పోతుంది.. జూలై నెల కూడా టీఆర్పి రేటింగ్ మామూలుగా పెరగడంతో పాటుగా కొన్ని హైలెట్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. జూలై నెలలో హైలెట్ ఎపిసోడ్స్ ఒకసారి తెలుసుకుందాం..

జూలై నెలలో హైలెట్ ఎపిసోడ్స్..

గత నెలతో కొలిస్తే ఈ నెలలో కొన్ని ఎపిసోడ్లు హైలైట్ గా నిలిచాయి. తెలుగు ఆడియస్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న పొదిరిల్లు సీరియల్ రోజురోజుకీ మంచి క్రేజ్ని సంపాదించుకుంటూ దూసుకుపోతుంది.. గత నెలతో పోలిస్తే టీఆర్పీ రేటింగ్ కూడా బాగా పెరిగింది.. 10.35 రేటింగ్ ను నమోదు చేసుకుంది..జులై నెలలో మహాలక్ష్మిని తన సొంతం చేసుకునేందుకు చక్రీ చేసిన ప్రయత్నం దారుణంగా ఫెయిల్ అవుతుంది.. గారేశ్వర్ అలాగే నారాయణ చెప్పిన విధంగా చక్రి తన భార్య అని ఫిక్స్ అయిపోతాడు. అంతేకాదు తనపై అన్ని అధికారాలు ఉన్నాయి అంటూ ఒకే గదిలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. ఇక అందరూ కలిసి చక్రిని దూరం పెట్టేస్తారు.. ఇక మహాలక్ష్మి కూడా ఇంట్లో ఉండలేను అని వెళ్ళిపోతుంది.. చివరికి ఆ ఇంట్లో వాళ్ళ సూటిపోటి మాటలతో మళ్ళీ అదే ఇంటికి రావాలి అని అనుకుంటుంది.. ఇక మహాలక్ష్మి తిరిగి మళ్లీ ఆ ఇంటికి రావడంతో చాలా సంతోషంగా ఉంటారు. ఇక మహాలక్ష్మి పుట్టినరోజు రావడంతో వేడుకలను చాలా గ్రాండ్ గా జరపాలి అని చక్రి అనుకుంటారు.. అంతేకాదు తనకి బర్త్డే సర్ప్రైజ్ కూడా ఇవ్వాలని అనుకుంటాడు. కానీ మహాలక్ష్మి పోలీస్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి చక్రీ వల్ల ఇదంతా జరుగుతుందని తెలుసుకొని షాక్ అవుతుంది. ఆ విషయం గురించి చక్రిని అడిగితే నాకే సంబంధం లేదు అని చెప్తాడు.. ఇక శైలు కేశవ లవ్ మేటర్ ఇంట్లో తెలిసిపోతుంది. వీళ్ళతో పాటుగా అటు వరాలు తన కూతురికి ఒక మెకానిక్ ని ఇవ్వడం ఇష్టం లేక పెద్ద రచ్చ చేస్తుంది.. ఎపిసోడ్కి ఇదే హైలైట్ గా నిలుస్తుంది..

ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే..

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న ‘పొదరిల్లు’ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ప్రస్తుతం ఈ సీరియల్స్ స్టోరీ విషయానికి వస్తే శైలు కేశవ పెళ్లి జరుగుతుందని తెలుస్తుంది.. మహాలక్ష్మిని కామెంట్ చేసినందుకు సురేష్ ని కొడతారు అన్నదమ్ములు.. తన కొడుకుని కొడతారా అంటూ వరాలు పెద్ద రచ్చ చేస్తుంది. ఇంటి మీదికి పోలీసులు కూడా తీసుకుని వచ్చి చెప్తుంది.. కానీ మహాలక్ష్మి తో పాటుగా శైలు అలాగే గాయత్రి కూడా తోడై ఆ ఇంటికి సపోర్ట్ గా నిలుస్తారు. ఇక సురేష్ వాళ్ళ నాన్న నా కొడుకువే తప్పు అని అక్కడినుంచి తీసుకొని వెళ్ళిపోతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇవాళ ఎపిసోడ్లు మాతో కూడా ముగ్గురు దేవకన్యలుగా కనిపిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది మిస్ అవ్వకుండా ఎపిసోడ్లో చూడాల్సిందే..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×