E-Paper
Advertisement

Podarillu Today Episode : నడుం విరగొట్టుకున్న చక్రీ.. కేశవ, చక్రీకి మహా వార్నింగ్..కన్నీళ్లు తెప్పించే సీన్..

Podarillu Today Episode : నడుం విరగొట్టుకున్న చక్రీ.. కేశవ, చక్రీకి మహా వార్నింగ్..కన్నీళ్లు తెప్పించే సీన్..
Advertisement

Podarillu Today Episode May 7th : ఆ తర్వాత రోజు ఉదయం మహాలక్ష్మి చక్రి ఇద్దరు నడుచుకుంటూ వస్తారు.. మీకు ఒక విషయం చెప్పాలి మహాలక్ష్మి గారు అని చక్రి అడుగుతాడు. ఏంటండీ చెప్పండి అని మహా అంటుంది. మీతో చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉందండి అని తెగ సిగ్గు పడిపోతూ ఉంటాడు చక్రి. ఏంటో సిగ్గుపడకుండా చెప్పండి అని మహా అంటుంది. నా భార్య ని ముద్దు పేరుతో పిలవాలని నాకు కోరిక ఉంటుంది. అయితే మీ పేరుని మహాలక్ష్మి కదా మహా అని పిలవచ్చా అని అడుగుతాడు. నేను మీ భార్యనా ఏంటి? ఎందుకలా అన్నారు అని అడ్డంగా దొరికిపోతాడు చక్రి. ఇక ఒక ఆట ఆడుకుంటుంది మహాలక్ష్మి. జస్ట్ మిస్ అయిపోతాడు చక్రి..

నడుం విరగొట్టుకున్న చక్రీ..

చక్రి మహా ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ అలా రిసార్ట్లో తిరుగుతుంటారు. అయితే ఒక గ్రౌండ్ దగ్గరికి చక్రీ తీసుకొని వెళ్తాడు.. ఇది గ్రౌండ్ కదా ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు అని చక్రిని మహా అడుగుతుంది.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుందామని అని చక్రి అంటాడు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి అని మహాలక్ష్మి అంటుంది. కానీ చక్రి మాత్రం నాకు లాంగ్ జంప్ అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పుడు నేను దాంట్లో ఎప్పుడు ఫస్ట్ ఉండే వాడిని.. ఇప్పుడు కూడా నేను ఒకసారి లాంగ్ జంప్ చేస్తాను అని చక్రి అంటాడు.. మహాలక్ష్మి ఎంత చెప్తున్నా వినకుండా చక్రి లాంగ్ జంప్ చేసి నడుము విరగ కొట్టుకుంటాడు. చక్రి కింద పడిపోవడం చూసిన మహా ఒక్కసారిగా నవ్వుతుంది.

చక్రికీ నారాయణ షాక్…

Advertisement

చక్రి నడుము విరిగిందని బాధ పడిపోతూ మహాలక్ష్మి తన మీద పడిపోయినట్టు కలలు కంటాడు.. కల నిజమైతే ఎంత బాగుంటుందో అని చక్రి అనుకుంటాడు. అయితే మీరు దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు కింద పడిపోతే లేపాలి అని కూడా మీకు లేదు అని మహాలక్ష్మిని అడుగుతాడు. దాంతో మహా సరే లేపుతాను అని అంటుంది అంతలోపే నారాయణ వచ్చి చెయ్యి పట్టుకుంటాడు. చక్రి కళ్ళు మూసుకొని మహాలక్ష్మి ఎంత లాగినా ఇంక మీద పడడేంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కళ్ళు తెరిచి చూడగానే నారాయణ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు.. బర్రె లాగా ఉన్నావ్ అమ్మాయి నిన్నెక్క లేపుతుంది నేను లేపుత పట్టు అని నారాయణ లేపుతాడు.

చక్రీ, కేశవకు పనిష్మెంట్..

రిసార్ట్లో ఉన్నట్లు అసలు టైమే తెలియడం లేదు అలా గడిచిపోతుంది అని కేశవ కన్నా ఇద్దరు చాలా సంతోషంగా చెబుతూ ఉంటారు.. మీకు అలా గడిచిపోతుంది కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది అని మహాలక్ష్మి అంటుంది. ఎందుకండీ అలా బాధపడుతున్నారు ఏమైంది అని అడుగుతారు.. నలుగురు ఉన్నారు మీలో మీరు మాట్లాడుకుంటూ టైం గడిపేస్తారు కానీ నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా బోర్ కొడుతుంది అని మహాలక్ష్మి అంటుంది. అయితే మనమే వదిన రూమ్ కి వెళ్దామా అని కన్నా అంటాడు.. కానీ మనం అక్కడికి వెళ్ళడం కాదు మన రూమ్ కి ఏం మహాలక్ష్మి రమ్మని చెబుదామని మాధవ్ అంటాడు. రూమ్ తలుపు తీయగానే పెద్దగా కేకలు పెడుతూ నారాయణ నిద్రపోతూ ఉంటాడు.. మహాలక్ష్మి దీన్ని మొత్తం మీరిద్దరూ సద్దాలి అని కేశవ చక్రికి ఇద్దరికీ పనిష్మెంట్ ఇస్తుంది. కన్నా మహా ఇద్దరు కూల్ డ్రింక్స్ కోసమని బయటకు వస్తారు.

సిరిని చూసి మహా ఎమోషనల్..

Advertisement

మహాలక్ష్మి వాళ్ళ అన్న కూతురు సిరి అక్కడ ఆడుకుంటూ ఉంటుంది. హారిక కు ఫోన్ రావడం నువ్వు ఇక్కడ ఆడుకో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్తుంది. బాలు బయటపడడంతో సిరి అటుగా వస్తుంది అక్కడ మహాలక్ష్మిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక తన అన్న కూతుర్ని చూడగానే మహా చాలా సంతోషంగా ఉంటుంది. నేను తనని ఎలా చూస్తానని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు తనని చూడ్డం నాకు చాలా సంతోషంగా ఉందని కన్నాతో చాలా హ్యాపీగా చెప్తూ ఉంటుంది. సిరి ఎక్కడికి వెళ్లిందా అని హారిక లలిత ఇద్దరు వెతుక్కుంటూ వస్తారో మహాలక్ష్మి దగ్గర ఉండడం చూసి లాక్కొని వెళ్ళిపోతారు. అది చూసిన మహా బాధపడుతుంది.

చక్రికీ ఆది వార్నింగ్..

మహాలక్ష్మి వాళ్ళ నాన్న ని చూసి ఎమోషనల్ అవుతుంది. తన కన్న తండ్రి అన్న మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంది. సర్టిఫికెట్ కాల్ చేసినప్పుడే నువ్వు కూడా చచ్చిపోయావు అని అన్నారు కదా.. అందుకే నాకు బాధగా ఉంది అని కన్నాతో అంటుంది. కానీ కన్న తండ్రి నీ చూసి మహా ఉండలేక పోతుంది.. అన్నా నీ ప్రేమగా పిలిస్తే ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని పిలవకూడదు అని ప్రతాప్ మహాలక్ష్మికి షాక్ ఇస్తాడు. నువ్వు మమ్మల్ని వదిలిపెట్టవా అని లలిత కూడా మహాలక్ష్మిని బాధపెడుతుంది.. అటు మాధవ్ చక్రి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఆది చక్రిని డాష్ కొడతాడు.. చక్రీను చూసి ఇద్దరు ఒకరు ఒకరి మీద ఒకరు మాటలు యుద్ధం చేస్తారు.

రిస్టార్ట్ లో పోటీ..

మనము వచ్చిన రిసార్ట్కే వాళ్ళు వచ్చారు కదా ఇది నా ఫ్రెండ్ రిసార్టు వాడిని అడిగిన తెలుసుకుంటాను అని ఆది అంటాడు. వాళ్లు వచ్చారని మన సంతోషాన్ని ఎందుకు వదిలేసుకుని వెళ్ళాలి. మనం ఇక్కడ సంతోషంగా ఉండడానికి వచ్చాం కదా అని అటువాళ్లు ఇటు వీళ్ళు అనుకుంటారు. మహాలక్ష్మి కూడా మన సంతోషంగా ఉండడానికి ఇక్కడికి వచ్చాము అని అంటుంది. ఈ ఇద్దరు ఫ్యామిలీలు ఇక్కడే ఉంటే ఎపిసోడ్లో ట్రస్టులు మామూలుగా ఉండవు అని అర్థమవుతుంది.. చక్రిని మహా దారుణంగా అవమానిస్తుంది.. కానీ చక్రి మాత్రం నన్ను మీరు అర్థం చేసుకునేది ఇంతేనా అని బాధపడిపోతూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో చక్రి ఫ్యామిలీకి ఆది ఫ్యామిలీకి గట్టి పోటీ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అవనికి దిమ్మతిరిగే షాకిచ్చిన పల్లవి.. కొడుకు కోసం మీనాక్షి వెయిటింగ్.. నిజం చెప్పబోతున్న అవని..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×