E-Paper
Advertisement

Podarillu Today Episode : కూతురు కోసం ప్రతాప్ కన్నీళ్లు.. చక్రీకి షాకిచ్చిన కేశవ.. ప్రతాప్,నారాయణ సిట్టింగ్..

Podarillu Today Episode : కూతురు కోసం ప్రతాప్ కన్నీళ్లు.. చక్రీకి షాకిచ్చిన కేశవ.. ప్రతాప్,నారాయణ సిట్టింగ్..
Advertisement

Podarillu Today Episode May 6th : మహా మీ నాన్నగారు వస్తే బాగుంటుంది. ఆయనని ఒంటరిగా వదిలేసి వెళ్తే ఆయన తాగడానికి హద్దు అదుపు లేకుండా వెళ్ళిపోతుంది. వంట కూడా చేసుకోవడం చేతకాదు కదా మరి ఆయన చాలా ఇబ్బందులు పడతారు అని మహాలక్ష్మి అంటుంది.. నేను ఆల్రెడీ పిలిచాను అమ్మ కానీ ఆయన రాలేను అన్నాడు అని మాధవ్ అంటాడు. అందరూ కూడా తమ లగేజ్ లు తీసుకొని బయటికి వచ్చేస్తారు. నారాయణ లేకపోవడం చూసి ఎక్కడికి వెళ్లాడా అని అనుకుంటారు. ఎదురుగా కారు వచ్చి ఆగడంతో నారాయణ అదిరిపోయే గెటప్ లో ఎంట్రీ ఇస్తాడు. అది చూసి అందరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు.. ఇక అందరూ కలిసి ట్రిప్ కి బయలుదేరుతారు..

మహా కోసం ప్రతాప్ కన్నీళ్లు.. 

 రిసార్ట్ లో అందరిని చూస్తూ సంతోషంగా ఫీల్ అయినా ప్రతాప్.. నా కూతురు తనని వదిలేసి పోయింది అని చాలా బాధగా ఉంటాడు. ఇన్నేళ్లు అల్లరి ముద్దుగా పెంచుకున్న కూతురు ఒక్కసారిగా తనకి దూరం అవడంతో బాధ పడిపోతూ ఉంటాడు. అందరూ ప్రతాప్ దగ్గరికి వచ్చి ఏంటి నాన్న మీరు ఇంకా బాధపడుతున్నారా అని అడుగుతారు. మీరు బాధపడుతున్నారని ఇక్కడికి తీసుకొని వచ్చాను. అయితే మీరు ఇక్కడ కూడా ఇలా బాధపడుతూ ఉంటే నేనేం చేయలేను నాన్న అని ఆది అంటాడు.. అది పరువు తీసిపోయింది దాన్ని ఎలా మర్చిపోవాలి అని ప్రతాప్ అంటాడు. ఇక్కడ సంతోషంగా ఉందామని మనం వచ్చాము కానీ మీరు ఇక్కడ కూడా ఇలానే ఉంటే ఏం చేయలేము అని లలిత అంటుంది..

Advertisement

చక్రీ మాస్టర్ ప్లాన్ సక్సెస్..

 అక్కడ ఉన్న లొకేషన్ అన్నీ తిరిగి మహాలక్ష్మి కన్నా ఇద్దరూ ఫోటోలు దిగాలని అనుకుంటారు.. ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఫోటోలు దిగుతూ ఉండగా కేశవ వెళ్లి రూములు తీసుకోవా అని అడుగుతాడు.. చక్రి రూమ్ తీసుకోడానికని అక్కడికి వెళ్తాడు. అయితే రెండు రూములు కావాలి అంటే అక్కడ ఉన్న రిసెప్షన్ లిస్టు మాస్టర్ బెడ్ రూమ్ తీసుకోండి అని అంటుంది.. అయితే ఆధార్ కార్డు ఇవ్వండి అని ఆవిడ అనగానే చక్రి మహాలక్ష్మి ఆధార్ కార్డు లేదు కదా ఇరికించాలని ప్లాన్ చేస్తాడు. అయితే మహాలక్ష్మి నా దగ్గర ఆధార్ కార్డు లేదు కదా అంటే ఒక ఫోటో దిగి వాళ్లకి చూపించాలి అండి అని చక్రి ప్లాన్ చేస్తాడు.. మొత్తానికి సక్సెస్ అవుతాడు.

చక్రీని ఇరికించిన కేశవ.. 

Advertisement

 ఇక అందరూ కలిసి భోజనం చేయడానికి వస్తారు.. అయితే అందరూ కలిసి మంచి భోజనం తినాలని అనుకుంటారు. అక్కడికి వచ్చిన తర్వాత పక్క టేబుల్ లో ఉన్న ప్రతాప్ వాళ్ళ ఫ్యామిలీని మహాలక్ష్మి వాళ్ళు చూడలేరు.. ఇక మీకు కావలసిన భోజనాన్ని ఆర్డర్ చేసుకోండి మొహమాట పడకుండా అని చక్రి అంటాడు. చక్రి అన్న మాటతో కేశవ రెచ్చిపోతాడు.. ఎలాగైనా సరే వీడికి దూల తీర్చాలి అని కేశవ మెనులో ఉన్నవని ఆర్డర్ చేస్తాడు.. అదేవిధంగా కన్నా కూడా ఆర్డర్ చేయడంతో అరే ఏంట్రా మొత్తం ఆర్డర్ చేస్తున్నారు అని చక్రి అంటాడు. ఇక చివరికి చక్రి 2 ఇడ్లీ అని అనగానే మాధవ్ నీకేం కావాలో ఆర్డర్ చేసుకోరా నేను కూడా బిల్లు కడతాను అని అంటాడు. అందరూ కలిసి బిర్యానీ తింటూ ఉంటారు. కానీ నారాయణ మాత్రం ప్లేట్లో ముగ్గులు వేస్తూ కనిపించడంతో మహాలక్ష్మి ఏం కావాలని అడుగుతుంది. రెండు పెగ్గులు తాగొస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నారాయణ.

ఫ్రెండ్స్ అయిన నారాయణ, ప్రతాప్.. 

 ప్రతాప్ భోజనం చేయకుండా బాధపడుతూ ఉండడం చూసిన ఆది పక్కనే భారం కిచెన్ ఉంది మీరు అక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లి రిలాక్స్ అవ్వండి అని అంటాడు. నారాయణ కూడా రెండు పెగ్గులు తాగి వస్తానని పోతాడు.. అయితే బార్ లోకి వెళ్ళగానే అక్కడ బ్రాందీ కావాలని అడుగుతాడు.. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బ్రాందీని అడుగుతున్నారు సార్ అందుకే స్టాక్ లేదు అని అక్కడ ఉన్న మేనేజర్ చెప్తారు… ఇక నారాయణ చివరి బాటిల్ తీసుకున్నాడు అని చెప్పగానే ప్రతాప్ సరే నేను వెళ్ళిపోతాను లేండి అని అంటాడు.. కానీ నారాయణ మాత్రం ఇంత బాటిల్ నేను తాగలేను మీరు కంపెనీ ఇవ్వండి సార్ పర్వాలేదు అని అంటాడు.. ఇక ఇద్దరు కూడా తమ బాధల్ని పంచుకుంటూ మందు ఫ్రెండ్స్ గా మారిపోతారు.. చుట్ట కలిపిన చుట్టరీకంగా చాలా సరదాగా ఉంటారు.. అప్పుడే ఆది అక్కడికి వచ్చి మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని అంటాడు..

సిగ్గుపడ్డ చక్రీ..మహా షాక్..

 తర్వాత రోజు ఉదయం మహాలక్ష్మి చక్రి ఇద్దరు నడుచుకుంటూ వస్తారు… మీకు ఒక విషయం చెప్పాలి మహాలక్ష్మి గారు అని చక్రి అడుగుతాడు. ఏంటండీ చెప్పండి అని మహా అంటుంది. మీతో చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉందండి అని తెగ సిగ్గు పడిపోతూ ఉంటాడు చక్రి. ఏంటో సిగ్గుపడకుండా చెప్పండి అని మహా అంటుంది. నా భార్య ని ముద్దు పేరుతో పిలవాలని నాకు కోరిక ఉంటుంది. అయితే మీ పేరుని మహాలక్ష్మి కదా మహా అని పిలవచ్చా అని అడుగుతాడు. నేను మీ భార్యనా ఏంటి? ఎందుకలా అన్నారు అని అడ్డంగా దొరికిపోతాడు చక్రి. ఇక ఒక ఆట ఆడుకుంటుంది మహాలక్ష్మి. జస్ట్ మిస్ అయిపోతాడు చక్రి. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లు మహాలక్ష్మి ప్రతాప్ కి ఎదురు పడుతుందా లేదా చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: తమ్ముడు మాటతో అవని కన్నీళ్లు..రాజేశ్వరి ఇంటికి ప్రణతి, భరత్.. పల్లవి ప్లాన్ సక్సెస్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×