E-Paper
Advertisement

Podarillu Today Episode : కన్నా కోసం టెన్షన్ పడ్డ మహా.. నారాయణకు గుణపాఠం.. అయ్యో.. పాపం మాధవ్…

Podarillu Today Episode : కన్నా కోసం టెన్షన్ పడ్డ మహా.. నారాయణకు గుణపాఠం.. అయ్యో.. పాపం మాధవ్…
Advertisement

Podarillu Today Episode May 2nd : కన్నా ఎక్కడ చూసినా లేడు. పొద్దున్నే వాడు ఒక్కడే ఎక్కడికి వెళ్ళాడు.. బయట ఉన్నాడేమో అని ఇల్లంతా వెతికి చూస్తారు. కానీ కన్నా బయట ఎక్కడ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లారని టెన్షన్ పడిపోతూ అందరూ వెతకడానికి బయటకు వెళ్లిపోతారు.. కన్నా కోసం ఊరంతా జల్లెడ పట్టి వెతుకుతారు. మాధవ్ అనవసరంగా వాడికి నిజం చెప్పాము అని బాధ పడిపోతూ ఉంటాడు.. అసలు కన్నా ఎక్కడికి వెళ్లాడు అని మహాలక్ష్మి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది..

ఊరంతా వెతుకుతున్న అన్నలు..

చక్రి కేశవ ఉదయం నుంచి ఊరు మొత్తం తిరుగుతూ ఉంటారు. కన్నా గురించి అడుగుతూ ఎక్కడ కనిపించలేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. మాధవ్ మాత్రం కన్నా తోకడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తన కొడుకే తనకి దూరమయ్యాడు అని కన్నీరు పెట్టుకుంటాడు. నువ్వేం బాధపడకు అన్నయ్య కన్నా ఎక్కడికి వెళ్ళడు ఇక్కడే ఉంటాడు దొరుకుతాడు అని చక్రి అంటాడు. ఇక ఊరంతా తిరుగుతున్న కన్నా జాడ మాత్రం ఎక్కడా కనిపించదు. కన్నాకి నిజం చెప్పకుండా ఉన్న బాగుండేది. ఎక్కడికి వెళ్ళాడో ఏమో అని మాధవ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.

టెన్షన్ పడుతున్న మహా..

Advertisement

ఉదయం అనగా కన్నాను వెతకడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ కూడా ఇంతవరకు రాలేదు. కన్న ఎక్కడికి వెళ్లి ఉంటాడు? ఎక్కడున్నావ్ రా కన్నా నువ్వు ఇంటికి రా అని మహాలక్ష్మి తనలో తానే అనుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది. కన్న గురించి ఏమైందో అని మహాలక్ష్మి చక్రి కి ఫోన్ చేస్తుంది చక్రి కన్నా ఇంటికి వచ్చాడా అని అడుగుతాడు. లేదండి మీరు ఎక్కడైనా కనిపించాడేమో తెలుసుకుందామని మీకు ఫోన్ చేశాను అని మహాలక్ష్మి అంటుంది. మీరు ఫోన్ చేస్తే సరికి వాడి ఇంటికి వచ్చాడేమో అని అనుకున్నాము అని చక్రి అంటాడు వెతుకుతూనే ఉన్నామండి కానీ ఎక్కడా కనిపించలేదు అని చక్రి అంటాడు.

నారాయణకు దిమ్మతిరిగే షాక్..

కొడుకు ఇంట్లోంచి వెళ్లిపోయాడు అన్న బాధ కూడా లేకుండా నారాయణ జాలీగా ఇంటికి వస్తాడు. మీరు కొంచమైనా మనిషిలాగ ఆలోచిస్తున్నారా మీకు కన్నా కొడుకు కనిపించడం లేదని మీ ముగ్గురు కొడుకులు ఉదయం నుంచి వెతుకుతూనే ఉన్నారు. కనీసం మీకు కొంచెం కూడా లేదా అని మహాలక్ష్మి అడుగుతుంది. ఆ లిల్లీపుట్టి గాడు ఎక్కడికి పొడువు? ఎక్కడున్నా కాసేపట్లో వస్తాడు.. ఈ ముగ్గురు ఎక్కడికి వెళ్లారు నిన్నొక్కదాని ఇంట్లో వదిలేసి అని నారాయణ అంటాడు.. వాళ్లతో నీకేం పని లేదమ్మా నీకోసం చేపల పులుసు తీసుకొచ్చాను అని నారాయణ ఇవ్వగానే మహాలక్ష్మి కొడుకు వెళ్ళిపోయాడు అన్న బాధ కూడా లేకుండా ఇది తీసుకొని వచ్చారని విసిరి కొడుతుంది..

మహా మాట విన్న నారాయణ..

Advertisement

మీరు చెప్పిన నిజం వల్లే వాడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇంతవరకు ఇంట్లోకి రాలేదు అంటే వాడికి ఏదైనా అయ్యిందా? ఎక్కడున్నాడు అని వెతకాల్సిన బాధ్యత మీకు లేదా అని నారాయణ ను తిడుతుంది మహాలక్ష్మి. మహాలక్ష్మి తిడుతుంటే నారాయణ నవ్వుతాడు. నేను తిడుతుంటే నువ్వు నవ్వుతున్నావ్ ఏంటి అని మహాలక్ష్మి అంటుంది. 20 ఏళ్ల క్రితం ఇలా ఒక ఆడ మనిషి దబాయించేది. ఇప్పుడు ఇంట్లో మనుషుల గురించి ఒక ఆడ మనిషి ఆలోచిస్తుంది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చెప్పావు కదమ్మా నేను వెళ్లి ఊరంతా జల్లేరు పట్టేలా సరే వాడిని తీసుకొని వస్తాను అని నారాయణ అంటాడు.. చెప్పావుగా నీ మాట కోసమైనా సరే.. నేను వెతకడానికి వెళ్తున్నాను వాడు దొరికిన తర్వాత నేను మళ్ళీ ఇంటికి వస్తాను అని నారాయణ అంటాడు..

మాధవ్ కేశవ చక్రి ముగ్గురు కూడా పిచ్చి వాళ్ళ లాగా తమ తమ్ముడికి ఎక్కడికి వెళ్లాడో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు.. ఊర్లో కనిపించిన వాళ్లందర్నీ అడుగుతారు. ఎవరు చూడలేదని అనడంతో అంతా కంగారు పడిపోతూ ఉంటారు. అయితే కన్నతో గడిపిన క్షణాలని మహాలక్ష్మి గుర్తు చేసుకుంటుంది.. మహాలక్ష్మికి కన్నా ఒకసారి తన ఫేవరెట్ ప్లేస్ ఇది అని చెప్పడంతో అది గుర్తు చేసుకున్న మహా వెంటనే చక్రికి అడ్రస్ ని చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. మరి అక్కడ కన్న ఉంటాడా లేదా అన్నది తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ నేను మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Also Read :Intinti Ramayanam Today Episode: భరత్ ను రెచ్చగొట్టిన పల్లవి.. పల్లవి పై ప్రణతికి అనుమానం.. రాజేశ్వరి ప్లాన్ ఏంటి..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×