E-Paper
Advertisement

Podarillu Today Episode May 24th : మహా తండ్రి వచ్చాడు..సాయంత్ర

Podarillu Today Episode May 24th : మహా తండ్రి వచ్చాడు..సాయంత్ర
Advertisement

Podarillu Today Episode May 24th : మహా తండ్రి వచ్చాడు..సాయంత్ర అవ్వగానే చక్రి అలాగే కేశవ ఇంటికి వస్తారు. అయితే ఇంటి దగ్గర కారు ఉండడం చూసి ఎవరిది కారు అని ఆలోచిస్తూ ఉంటారు. నారాయణని కొత్తగా ఎవరు వచ్చారు మన ఇంటికి అని కేశవ అడుగుతాడు.. నా వియ్యంకుడు వచ్చాడు రా అని చెప్పగానే కేశవ ఏంటి ఎవరితో ఏ గొడవలు పెట్టుకొని వచ్చావో ఏం మాట్లాడుతున్నావు తాగింది ఇంకా దిగలేదా అని అంటాడు. నా కోడలు వాళ్ళ నాన్నగారు వచ్చారు అని చెప్పగానే చక్రి కేశవ ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ప్రతాప్ వచ్చాడు అంటే మహాలక్ష్మిని తీసుకుని వెళ్తాడేమో అని చక్రి కంగారు పడతాడు..

ప్రతాప్ ను చూసి చక్రీ షాక్..

సాయంత్రం అవ్వగానే చక్రి ఇంటికి వచ్చి  చక్రి ఏం జరిగింది అని అడగ్గానే అక్కడ ప్రతాప్ రండి అల్లుడు గారు అని పిలుస్తాడు.. ఆ మాట వినగానే చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నేను వచ్చాడంటే కచ్చితంగా మహాలక్ష్మిని తీసుకుని వెళ్లడానికి ప్లాన్ చేస్తున్న ఉన్నాడు నాకు అర్థం అయిపోయింది.. మొన్నటివరకు ఇప్పుడు ప్రేమగా కూతుర్ని పలకరిస్తున్నాడు అంటే కచ్చితంగా మహాలక్ష్మి నుంచి దూరం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అని చక్రి భయపడి పోతాడు. కేశవ నిజంగానే మహాలక్ష్మి వాళ్ళ నాన్న వచ్చాడు అంటే కచ్చితంగా తనని తీసుకుని వెళ్లడానికి వచ్చాడు అని అనుకుంటాడు..

పెద్ది వంటల గుమగుమలు..

Advertisement

మాధవ్ మహాలక్ష్మి వాళ్ళ నాన్న వచ్చాడు మహాలక్ష్మి చాలా సంతోషంగా ఉంది.. వీళ్ళు ఇంకాస్త చాలా సంతోషంగా ఉండడానికి నేను ఇంకా మంచిగా వంట చేయాలి అని నాన్ వెజ్ తో బిర్యాని చేయడానికి అంత సిద్ధం చేస్తాడు. లోపలికి వచ్చిన చక్రి ఏంటి అన్నయ్య నువ్వు ఆయన కోసం వంట చేస్తున్నావా? ఆయన అసలు ఎన్ని మాటలు అన్నాడో తెలుసు కదా మళ్లీ నువ్వు ఇప్పుడు ఆయనని ఇంట్లో కూర్చోబెట్టి వంట పెట్టాలి అనుకుంటున్నావా అని చక్రి అడుగుతాడు.. మహాలక్ష్మి వాళ్ళ నాన్న అంటే సీరియస్ అవుతారు. అయినా ఇలాంటి వాడు నీకు తెలిస్తే మీరు ఆయనకి వండి పెట్టడు అని అంటారు. కానీ మాధవ్ మాత్రం ఏమీ తెలియకుండానే అతని కోసం బిర్యాని వండి పెడతాడు..

మహాను తీసుకొని వస్తాను..

 ప్రతాప్ రూమ్ లోకి వెళ్లి ఆది కి ఫోన్ చేసి కచ్చితంగా నేను మహాలక్ష్మిని తీసుకుని ఇంటికి వస్తాను అని అంటాడు.. ఇలాంటి కొంపలు మహాలక్ష్మి ఉంచడం అంతసేపు కాదు.. ఇన్ని రోజులు నేను చాలా పొరపాటు చేశాను ఎలాగైనా సరే మహాలక్ష్మిని ఇంటికి తీసుకొని వస్తాను అని ప్రతాప్ ఆదితో అంటాడు. నేను ఇన్ని మెట్లు దిగాను అంటే అది కేవలం మన మహాలక్ష్మి కోసమే అని ప్రతాప్ అంటాడు. అయితే ప్రతాప్ మాట విన్న లలిత మహాలక్ష్మి వస్తుంది అని చాలా సంతోషంగా ఉంటుంది.. జైలు నుంచి మహాలక్ష్మి విడుదల చేసి తీసుకొని వస్తాను నా ప్లాన్ సక్సెస్ అవుతుంది అని ప్రతాప్చా లా ధీమాగా చెప్తాడు. ప్రతాప్ నిజంగానే తన మీద ప్రేమతో వచ్చాడు అని మహాలక్ష్మి చాలా సంతోషంగా ఉంటుంది..

మాధవ్ వంటను పొగిడిన ప్రతాప్..

Advertisement

 సాయంత్రం అవ్వగానే అందరూ కలిసి కూర్చుంటారు.. సరదాగా భోజనం చేయాలని అనుకుంటారు.. చెప్పకూడదు కానీ మా పెద్ది వంట అద్దరు కొట్టేస్తాడు నాన్న అని మహాలక్ష్మి మాధవ్ వంటపై పొగడ్తల వర్షం కురిపిస్తుంది.. ఒక్కసారి గనుక మీరు తింటే మళ్ళీ మళ్ళీ ఈ వెంటనే తింటారు అని చెప్పగానే ఇదేమైనా హోటల్ మళ్లీ మళ్లీ తినడానికి అని ప్రతాప్ మనసులో అనుకుంటారు. ఇక నిజంగా మహాలక్ష్మి పై ప్రేమ ఉందని చెప్పడానికి తన కన్నతండ్రి అందరి ముందర గొప్పగా మహాలక్ష్మికి పిలిపించి గోరుముద్దలతో తనని మరోసారి ఆకట్టుకునేలా చేసుకుంటాడు..

అల్లుడు, కూతురును ఇంటికి తీసుకొని వెళ్తాను..

 ఇక అందరూ భోజనం చేసిన తర్వాత ప్రతాప్ నేను మీకు ఒక విషయం చెప్పాలి అందుకే ఇంత దూరం వచ్చాను అని అంటాడు. నేను ఇంత దూరం రావడానికి ఒక కారణం ఉంది ఎన్ని రోజులైనా నా కూతురికి నేను దూరంగా ఉంటాను అందుకే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను అని అంటారు ప్రతాప్. ఇన్ని రోజులు నా కూతుర్నే అల్లుడిని దూరం చేసుకున్నాను.. ఇప్పుడు వీళ్ళిద్దరిని నేను మా ఇంటికి తీసుకుని వెళ్తాను కొద్ది రోజుల తర్వాత వీళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు అని ప్రతాప్ అంటాడు.. ఆ మాట వినగానే చక్రి షాక్ అవుతాడు. తన కూతుర్ని మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేసినట్టు ఉన్నాడు అని కేశవ్ అనుకుంటాడు.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి మరో షాక్.. రాజేశ్వరి పై అనుమానం.. కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×