E-Paper
Advertisement

Podarillu Today Episode : గుండెలు పగిలే నిజం.. కన్నీళ్లు పెట్టుకున్న అన్నదమ్ములు.. ఇంట్లోంచి వెళ్లిపోయిన కన్నా..?

Podarillu Today Episode : గుండెలు పగిలే నిజం.. కన్నీళ్లు పెట్టుకున్న అన్నదమ్ములు.. ఇంట్లోంచి వెళ్లిపోయిన కన్నా..?
Advertisement

Podarillu Today Episode May 1st : కన్నా ని ఎత్తుకొని ఒక ఆవిడ ఫోటో కనిపించడంతో అది చూసినా మహా నార్త్ ఇండియన్ అమ్మాయిలాగా ఉంది అని చెప్పగానే.. కన్నా ఏంటి ఈవిడ నన్ను ఎత్తుకుని ఏంటి అని నారాయణను కాలర్ పట్టుకుని అడుగుతాడు.. ఈవిడ నీ కన్నతల్లి రాని చెప్పగానే ఏంటి వీళ్ళ తల్లి వేరు నా తల్లి వేరా అని కన్నా బాధపడిపోతూ ఉంటాడు. కన్నా మీ సొంత తమ్ముడ్ని కాదా అని ఎమోషనల్ అయిపోతాడు.. నిన్ను వేరుగా ఏ రోజు చూడలేదు రా నా సొంత బిడ్డ లాగా చూసుకున్నాను రా అని మాధవ్ ఎమోషనల్ అవుతాడు.. మొత్తానికి అందరూ కలిసి ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించేస్తారు..

బాధపడ్డ కన్నా..

మీ తల్లి వేరు నా తల్లి వేరా అని కన్నా కన్నీళ్లు పెట్టుకుంటాడు. మీరు ఎందుకు నాకు ఇన్ని రోజులు ఈ నిజం చెప్పలేదు అని చాలా బాధపడతాడు. అమ్మ ఉందా పోయిందా? అసలు మా అమ్మాయి ఎక్కడుంది మీరు ఎందుకు నాకు ఈ నిజం ఎన్ని రోజులు చెప్పలేదు నన్ను మోసం చేశారని కన్నా గుండెలు పగిలేలా ఏడుస్తాడు. తన బాధపడుతుండడం చూసినా మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు. అరేయ్ నిన్ను ఏ రోజు మేము తక్కువ చేసి చూడలేదు రా.. నువ్వు మేము వేరని ఎప్పుడూ అనుకోలేదు.. మనమంతా ఒకే తండ్రి బిడ్డలమని ఎంత చెప్తున్నా సరే కన్నా మాత్రం బాధపడిపోతూ ఉంటాడు..

సెంటిమెంట్ సీన్ తో కన్నీళ్లు పెట్టించేశారు..

Advertisement

బాధపడుతున్న కన్నాని మాధవ్ కేశవ బయటికి తీసుకుని వస్తారు. ఎందుకురా ఇంత బాధపడుతున్నావు ఏరోజైనా నిన్ను మేము తక్కువ చేసే మాట్లాడామా అని మాధవ్ అంటాడు. కేశవ కూడా నువ్వు ఎప్పుడు వేరు కాదురా మనమంతా నలుగురం ఒక్కటే అని ఎంత చెప్తున్నా సరే కన్నా మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు. తల్లి మాత్రమే వేరు రా తండ్రి ఆ నారాయణే.. మనమందరం ఒకే తండ్రి రక్తం పంచుకొని పుట్టాము. ఏ రోజు నిన్ను వేరుగా చూడలేదు కదా అని మాధవ్ కేశవ ఇద్దరు కూడా కన్నాని ఓదారుస్తారు. కన్న ఎప్పుడు వేరు కాదు అని ముగ్గురు అన్నదమ్ములు కూడా తనని పట్టుకొని ఏడ్చేస్తారు. ఈ ఎపిసోడ్ కి ఇదే సెంటిమెంటల్ సీన్. అన్నదమ్ముల అనుబంధాన్ని గుర్తుచేస్తూ వచ్చిన ఈ సీను అందరిని ఏడిపించేస్తుంది.

కన్నీళ్లు పెట్టుకున్న మహా..

ఇంటి పత్రాలు కోసం నేను వెతికిస్తే ఇంటి గుట్టే బయటపడింది కదా అని మహాలక్ష్మి అంటుంది.. ఇన్నేళ్లు దాగిన నిజం నా వల్లే బయటపడింది అని మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ ముగ్గురిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కన్నాని చాలా బాధ పెట్టేసాను నేను ఇవాళ నావల్ల ఇదంతా జరిగింది అని చక్రితో చెప్తూ మహాలక్ష్మి ఏటి చేస్తుంది. అందరికీ ఈ సీను కంటతడి పెట్టిస్తుంది.

ఇంట్లోంచి వెళ్లిపోయిన కన్నా..

Advertisement

అరే కన్నా నువ్వు మనసులో ఎటువంటి బాధ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు రా నిన్ను ఏ రోజు మేము వేరు చేయము. తల్లి పాలిస్తుంది ఆ ఒక్కటి తప్ప మిగతా విషయాలలో తల్లి కన్న ఎక్కువగా నేను చూసుకున్నాను కదా అని మాధవ్ అంటాడు. అందరూ కలిసి పడుకుంటారు.. అందరూ నిద్రపోతారు. కన్నా కి మాత్రం తన తండ్రి చెప్పిన నిజమే పదేపదే గుర్తుకొస్తుంది. మహాలక్ష్మి అన్న మాటలను కూడా తలుచుకొని కన్నా తన తల్లి కోసం వెతకడానికని వెళ్లిపోతాడు.. అందరినీ ఒక్కసారిగా చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ కన్నా బయటికి వెళ్లిపోతాడు. ఉదయం కన్నాని లేపితే కనిపించలేదు అని చక్రి లేచి చూసి కన్నా కనిపించలేదు అని అంటాడు.

కన్నా కోసం వెతుకుతున్న అన్నలు..

కన్నా ఎక్కడ చూసినా లేడు. పొద్దున్నే వాడు ఒక్కడే ఎక్కడికి వెళ్ళాడు.. బయట ఉన్నాడేమో అని ఇల్లంతా వెతికి చూస్తారు. కానీ కన్నా బయట ఎక్కడ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లారని టెన్షన్ పడిపోతూ అందరూ వెతకడానికి బయటకు వెళ్లిపోతారు.. కన్నా కోసం ఊరంతా జల్లెడ పట్టి వెతుకుతారు. మాధవ్ అనవసరంగా వాడికి నిజం చెప్పాము అని బాధ పడిపోతూ ఉంటాడు.. అసలు కన్నా ఎక్కడికి వెళ్లాడు అని మహాలక్ష్మి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం ప్రేమ నిర్ణయం.. సాగర్, నర్మద ల మధ్య గొడవ.. వేదవతిని అడ్డంగా ఇరికించిన వల్లి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×