E-Paper
Advertisement

Podarillu Today Episode : గాయత్రిని చూసి మాధవ్ ఎమోషనల్.. చక్రిని ఇరికించిన మహా.. ఇదేం ట్విస్ట్ సామి..

Podarillu Today Episode : గాయత్రిని చూసి మాధవ్ ఎమోషనల్.. చక్రిని ఇరికించిన మహా.. ఇదేం ట్విస్ట్ సామి..
Advertisement

Podarillu Today Episode May 13th : గాయత్రి మాధవ్ వాళ్ళ ఇంటికి వెళ్లాలని ఇంట్లో చెప్తుంది. తాయారు అలాగే పురుషోత్తం ఎంత వద్దని చెప్తున్న సరే వినకుండా బావ వాళ్ళ ఇంటికి కలిసి వస్తాను అని అంటుంది. మీరు చెప్పినట్టే తలవంచి తాళి కట్టించుకున్నాను కదా ఇంకా మీరు ఎందుకు భయపడుతున్నారు అని గాయత్రి మాధవ్ వాళ్ళింటికి వస్తుంది. అయితే గాయత్రీ ని చూసిన మాధవ్ ఎమోషనల్ అవుతాడు. గాయత్రి నాకు పెళ్లయింది ఇప్పుడు నన్ను వినోద్ భార్య అంటున్నారు బావ అని అనగానే కాస్త బాధపడతాడు మాధవ్.. అందరూ మాట్లాడుకోవడం చూసిన కన్న చక్రి వాళ్ళకి చెప్తాడు.. చక్రీ అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటాడు..

గాయత్రి వచ్చిందని టెన్షన్..

గాయత్రి ఇంటికి వచ్చిందంటే మా అన్నయ్య ఎలా మారిపోతాడో ఏంటో అర్థం కావడం లేదు.. పెళ్లయిన తర్వాత ఇంటికి వచ్చింది అంటే మా అన్నయ్యకు సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అవకాశం ఇస్తుందో ఏంటో అర్థం కావడం లేదు అని చక్రి టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఒకేసారి అక్కడికి రావడంతో గాయత్రి ఇంట్లోనే ఉందా అని టెన్షన్ పడిపోతూ ఉంటారు.. ఇప్పటివరకు ఉందో లేదో తెలియలేదు అన్నయ్య అని కన్నా అనడంతో అందరూ కూడా ఏం చేస్తుంది లోపల అని అనుకుంటారు.. అందరూ మీలాంటి మంచి వాళ్ళు ఉండరు కదా అని మహాలక్ష్మి చక్రి గురించి నిజం చెప్పబోతుంది.. మీలాగా స్టిక్కర్లు అంటించుకోవడం వాళ్లకి రాదులేండి అని మహాలక్ష్మి అనడంతో స్టిక్కర్ ఏంటి అని అందరూ అడుగుతారు. చక్రి మీరు ఆపండి అని మహాలక్ష్మిని బతిమలాడుతాడు..

మాధవ్ నిజం చెప్తాడా..?

Advertisement

బయట అందరూ ఒకేసారి వచ్చి ఉండడంతో మాధవ్ ఏంటి మీరందరూ వచ్చేసారా..? సర్టిఫికెట్లు వచ్చాయి అమ్మ మహాలక్ష్మి అని అడుగుతాడు మాధవ్.. వచ్చాయి పెద్ది ఇదిగోండి అని అనడంతో చాలా సంతోషంగా ఉందమ్మా.. రోజులు నువ్వు కష్టపడ్డావు బాధపడ్డావు నువ్వు సంతోషంగా ఉండే రోజులు వచ్చేసాయి అని చెప్పలేదు. అయితే ఈ ఇంటికి ఎవరు వచ్చారు అని కేశవ అడుగుతాడు. గాయత్రి వచ్చింది రా అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. తన భర్తని తీసుకొని భోజనానికి రమ్మని చెప్పాను అని అనగానే అందరూ అనుకుంటారు.. అయితే వాళ్లందరూ కూడా భోజనానికి గాయత్రి అని పిలిస్తే వీళ్ళ సంగతి తెలిసిపోతుందేమో అని అనుకుంటారు.

వంటలతో అదరగొట్టిన మాధవ్..

గాయత్రి వినోద్ ఇద్దరూ మధ్యాహ్నం భోజనానికి రాబోతున్నారు అని చాలా సంతోషంగా వంటలు చేయాలి అని అనుకుంటారు. పెద్ది మీద నాకు నమ్మకముంది కాబట్టి అతను అలాంటివాడు కాదు అందరూ కూడా కలిసి వంట చేద్దాం పదండి అని మహాలక్ష్మి అంటారు. ఇక కన్నా పెద్ది మీద లేనిపోనివి చెప్పి అనుమానం పెంచుతావా అని మహాలక్ష్మి సీరియస్ అవుతుంది.. మాధవ్ గాయత్రీ తన భర్తతో కలిసి వస్తున్నాడని సంతోషంతో అదిరిపోయే వంటల్ని వండుతాడు..

చక్రీ పై కేశవ సెటైర్స్..

Advertisement

ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది అని చాలామంది బాధపడతారు. లేదంటే ప్రేమించిన అమ్మాయి పెళ్లిని చెడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు.. కానీ ఇలా ప్రేమించిన అమ్మాయి తన భర్తతో వస్తుంది అంటే భోజనం వడ్డించాలి అని ఆశపడే వ్యక్తిని అన్నయ్య మాత్రమే చూస్తున్నాను అని చక్రి అంటాడు. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చెడగొట్టాలని చూసే వాడిని చూశాను అని అన్నావు కదరా అవును నేను కూడా చూశాను అని కేశవ అంటాడు.. ఎవర్రా అని చక్రి అడిగితే నువ్వే అని కేశవ్ అంటాడు. ఆ పిల్లకోడితో మహాలక్ష్మి పెళ్లి జరగకుండా ఆపాలని చాలా ప్రయత్నాలు చేశావు అని అనగానే.. ఆగరా వినిందంటే నన్ను చంపి ముక్కలు చేసి బిర్యానీ వండి పెడుతుంది అని చక్రి భయపడతాడు..

నారాయణ సీరియస్..

ఇంట్లో అదిరిపోయే వంటలు గుమగుమలాడుతున్నాయి.. పెద్దోడు ఏదో వంట చేస్తున్నాడు వాసనే అతడు కొడుతుంది అని నారాయణ లోపలికి వెళ్ళగానే అక్కడ ఎవరి కోసం రా ఇన్ని వంటలు చేస్తున్నావు అని అడుగుతాడు.. గాయత్రి వాళ్ళ ఆయన తీసుకొని భోజనానికి వస్తుందని చేస్తున్న నాన్న అని మాధవ్ అంటాడు.. మాట వినగానే నారాయణ ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. నిన్ను కాదని పెళ్లి చేసుకుని అతని ఇంటికి తీసుకొని వస్తానంటే నువ్వు వంట చేసి పెడతావా నేను అసలు ఒప్పుకోను అని నారాయణ మాట్లాడతాడు. నా ఇంట్లో నాకు ఇష్టమైన అమ్మాయికి వండి పెట్టే స్వేచ్ఛ కూడా నాకు లేదా అని మాధవ్ సీరియస్ అవ్వడంతో ఎవరు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. అయితే అందరూ కూడా మాధవ్ని ఏమీ అనకుండా మౌనంగా ఉంటారు..

భర్తను తీసుకొచ్చిన గాయత్రి..

గాయత్రి మాధవి ఇంటికి వెళ్లి వచ్చింది అని తాయారు కంగారు పడిపోతూ ఉంటుంది.. నేను మీ అల్లుడుగారు బయటకు వెళ్లాలనుకుంటున్నాము అని చెప్పగానే ఎక్కడికి వెళ్తున్నారని ఆతృతగా అడుగుతుంది తాయారు.. మాధవ్ బావ ఇంటికి భోజనానికి వెళ్తున్నాము అని చెప్పగానే ముందు ఒప్పుకొని తాయారు నిజాన్ని బయటపెడతాను అని చెప్పడంతో ఒప్పుకుంటుంది. అయితే వినోద్ ని తీసుకొని గాయత్రి పెరటి గుమ్మం నుంచి ఇంట్లోకి రావడంతో అందరూ నీకు ఇప్పుడు పెళ్లి అయింది కదే మెయిన్ డోర్ నుంచి రా అని చెప్తారు. ఇక వాళ్ళు రాగానే వినోద్ కి మర్యాదలు చేస్తారు.. వినోద్ మాధవ్ గురించి చాలా గొప్పగా చెప్తాడు.. అందరూ గాయత్రి వినోద్ కి మర్యాద ఇస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: డబ్బుల కోసం అక్షయ్ టెన్షన్.. పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రణతికి టెన్షన్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×