E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ మామూలోడు కాదు..కన్నీళ్లు పెట్టుకున్న మహా.. గాయత్రిని చూసి కన్నా షాక్..

Podarillu Today Episode : చక్రీ మామూలోడు కాదు..కన్నీళ్లు పెట్టుకున్న మహా.. గాయత్రిని చూసి కన్నా షాక్..
Advertisement

Podarillu Today Episode May 12th :మహా ఒంటరిగా కూర్చుని బాధ పడిపోతూ ఉంటుంది. అయితే ప్రతాప్ లలిత వల్ల రిసార్ట్ ని కాళీ చేసి వెళ్లిపోతూ ఉండగా మహాలక్ష్మి ఎదురుగా కనిపించడంతో ఎక్కడికి వెళ్లినా ఎదురుగానే కనిపిస్తుంది. వెళ్లేటప్పుడు అయినా కనీసం ప్రశాంతంగా వెళ్లాలని అనుకున్నాను అని ప్రతాప్ అంటాడు. ఆ మాట వినగానే మహా ఫీల్ అవుతుంది. హారిక ఆదివాలు వస్తున్నదా హారికతో మాట్లాడడానికి మహా ప్రయత్నిస్తుంది కానీ ఆది వల్ల ఆగిపోతుంది. కనీసం సిరి తో కూడా మాట్లాడిన ఇవ్వకపోవడంతో మహాలక్ష్మి ఫీల్ అవుతుంది. ఇక మనమందరం ఇంటికి వెళ్ళాలి పదండి అని చక్రి వచ్చి మహాలక్ష్మి దగ్గర చెప్తాడు. ఎంతో సంతోషంగా గడపాలని అనుకున్న ఆ కుటుంబానికి విషాదం మిగలడంతో అందరూ బాధ పడతారు..

చక్రీని చూసి కేశవ సెటైర్..

 ఉదయం లేవగానే చక్రి అద్దం వదలకుండా చక్రి దువ్వుతూనే ఉంటాడు. ఏంట్రా పొద్దున్నే లేవగానే దువ్విన తలనే మళ్లీమళ్లీ దిగుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావ్ ఏంటి అని కేశవ అడుగుతాడు.. కాలేజీకి వెళ్ళాలి కదరా అని కేశవ తో చక్రి అంటాడు. ఈ వయసులో కాలేజీకి వెళ్తావా ఏం మాట్లాడుతున్నావ్ రా అని కేశవ కూడా వెటకారంగా మాట్లాడతాడు. మహాలక్ష్మి సర్టిఫికెట్లు వచ్చాయి కదరా తను నన్ను తీసుకొని యూనివర్సిటీకి వెళుతుంది.. ఏంటి నిన్నే పిలుస్తుందని గ్యారెంటీ ఉందా? వస్తుందో లేదో చూడు నువ్వే అని చక్రితో అంటాడు. నన్ను తీసుకెళ్లడం మాత్రమే కాదు చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తుంది అది గుర్తుపెట్టుకో.. మనిద్దరి మధ్య పందెం రా నిన్ను చేయి పెట్టుకొని లాక్కుని వెళ్తుందా లేదా అన్నది చూద్దామని కేశవ్ అంటాడు.

చక్రీ మామూలోడు కాదురా బాబు..

Advertisement

 చక్రి మహాలక్ష్మి రావడం చూస్తాడు.. దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటుంది.. దగ్గరికి వస్తుందా అన్నావ్ కదరా మరి దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటుంది ఏంటి అని కేశవ అంటాడు.. దేవుడి దగ్గర దండం పెట్టుకొని పెద్దితో మాట్లాడుతుంది. అరేయ్ పెద్ది అని పిలుస్తుంది ఏంట్రా నువ్వెప్పుడు పేరు మార్చుకున్నావ్ ఏంటి రా అని కేశవ అంటాడు. ఆ తర్వాత ఏవండీ అటుగారు అని పిలుస్తుంది. చెప్పండి ఈట్టు గారు మనం ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్ళాలి కదా మీరు రెడీనా అని అడుగుతుంది. నేను రెడీనే వెళ్దామాకండి క్రాప్ కొంచెం చెరిగినట్లుంది దువ్వుకుని వస్తానని లోపలికి వెళ్తాడు చక్రి. మహాలక్ష్మి టైం అవుతుంది ఇంకా ఎంతసేపు అని అడుగుతుంది.

చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్లిన మహా.. 

 లోపలికి వెళ్ళిన చక్రి ఎంతసేపటికి రాకపోవడంతో మహాలక్ష్మి ఎంతసేపు దువ్వుతారు ఈ రోజు మీరు చాలానే బాగున్నారు అని అంటుంది.. మీరు ఇంకా దువ్వుతూనే ఉంటారా టైం అవుతుంది రండి వెళ్ళిపోదామని మహాలక్ష్మి చాలా ఆతృతగా అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. చక్రీ ప్లాన్ ప్రకారం మహాలక్ష్మి చేయి పట్టుకొని తీసుకొని బయటికి రావడం చూసి కేశవ షాక్ అవుతాడు.. అది చూసిన కేశవ వీడు మామూలోడు కాదు రా బాబు ఏదైనా సాధిస్తాడు అని అనుకుంటాడు.

సర్టిఫికెట్స్ చూసి మహా ఎమోషనల్..

Advertisement

మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా సర్టిఫికెట్ల కోసమని యూనివర్సిటీకి వెళ్తారు. అయితే అక్కడ ఆ మేడం చక్రిని చాలా ప్రేమగా మాట్లాడడంతో మహాలక్ష్మి కూడా కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత సర్టిఫికెట్లు ఎప్పుడు మీరు పోగొట్టుకోకండి. వీటి కోసం చక్రి చాలా కష్టపడ్డాడు రోజు యూనివర్సిటీకి వచ్చి కనుక్కునేవాడు అని ఆమె చెప్పి ఆ సర్టిఫికెట్లను చేతికిస్తుంది. వాటిని చూసిన మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తనని అవమానించిన తన పుట్టింటి వాళ్ళని గురించి గుర్తుచేసుకొని మరీ బాధ పడిపోతూ ఉంటుంది. తాను చేసిన ఛాలెంజ్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది..

చక్రీ పై మహాకు అనుమానం..

 ఆ మేడం చక్రి తో మాట్లాడాలి ఒకసారి ఇలా వస్తావా అని బయటికి తీసుకుని వెళుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత చక్రీకి మొన్న ట్రిప్ డబ్బులు ఇవ్వాలి కదా అని తన చేతిలో డబ్బులు పెడుతుంది.. మీరు ఇంత సాయం చేశారు కదా.. ఇప్పుడు డబ్బులు వద్దులేండి మేడం అని ఎంత చెప్తున్నా సరే ఆవిడ బలవంతంగా చేతిలో పెడుతుంది. మళ్లీ ఎల్లుండి ట్రిప్ ఉంది మిమ్మల్ని పిలుస్తాను అని చక్రిత అంటుంది. ఆ తర్వాత వెనక్కి తిరగని చక్రి ఎదురుగా రావడంతో ఒక్కసారిగా షాక్అయ్యి ఇద్దరు గుద్దుకుంటారు.. ఆ టైంలో చక్రికి ఆ బొట్టు అంటుకుంటుంది. ఇంటికి వచ్చిన మహాలక్ష్మి చెక్కరిని చూసి ఆ బొట్టు ఎలా అంటుకునిందో అని ఆలోచిస్తూ ఉంటుంది. చక్రిని అడిగితే చక్రి చెప్పిన సమాధానం విని మహా షాక్ అవుతుంది.

మాధవ్ ను కలవడానికి వచ్చిన గాయత్రి..

 గాయత్రి మాధవ్ వాళ్ళ ఇంటికి వెళ్లాలని ఇంట్లో చెప్తుంది. తాయారు అలాగే పురుషోత్తం ఎంత వద్దని చెప్తున్న సరే వినకుండా బావ వాళ్ళ ఇంటికి కలిసి వస్తాను అని అంటుంది. మీరు చెప్పినట్టే తలవంచి తాళి కట్టించుకున్నాను కదా ఇంకా మీరు ఎందుకు భయపడుతున్నారు అని గాయత్రి మాధవ్ వాళ్ళింటికి వస్తుంది. అయితే గాయత్రీ ని చూసిన మాధవ్ ఎమోషనల్ అవుతాడు. గాయత్రి నాకు పెళ్లయింది ఇప్పుడు నన్ను వినోద్ భార్య అంటున్నారు బావ అని అనగానే కాస్త బాధపడతాడు మాధవ్.. అందరూ మాట్లాడుకోవడం చూసిన కన్న చక్రి వాళ్ళకి చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: డబ్బుల కోసం అక్షయ్ టెన్షన్.. శ్రీయను రెచ్చగొట్టిన పల్లవి.. అవనికి ఘోర అవమానం..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×