// // Podarillu Today Episode : నిజాన్ని బయటపెట్టిన కేశవ.. సర్టిఫికెట్స్ కోసం -->
E-Paper
Advertisement

Podarillu Today Episode : నిజాన్ని బయటపెట్టిన కేశవ.. సర్టిఫికెట్స్ కోసం వెళ్లిన మహా.. డ్రైవర్ మెడ మీద కత్తి పెట్టిన నారాయణ..

Podarillu Today Episode : నిజాన్ని బయటపెట్టిన కేశవ.. సర్టిఫికెట్స్ కోసం వెళ్లిన మహా.. డ్రైవర్ మెడ మీద కత్తి పెట్టిన నారాయణ..
Advertisement

Podarillu Today Episode March 27th : నిన్నటి ఎపిసోడ్ లో.. మహా కన్న ఇద్దరు కూడా చదువుల్లో బిజీగా ఉంటే అప్పుడే అక్కడున్న ఫోన్ కి ఫోన్ వస్తుంది. ఈ ముంగిసడు ఇంట్లో ఫోన్ పెట్టేసాడు అంటున్నాడు కచ్చితంగా విని ఇరికించాలి అని వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లు నమ్మిస్తుంది శైలు. అది విన్న మహాలక్ష్మి ఇంత మౌనంగా ఉంటాడు మీ అన్నయ్య కూడా ఇలా చేస్తున్నాడంటే అస్సలు నమ్మలేకపోతున్నాను అని అంటుంది.. కేశవ ఫోను ఇంట్లో పెట్టిన విషయం తెలుసుకొని మళ్లీ అక్కడికి వచ్చి ఫోన్ తీసుకుంటాడు.. ఆ ఫోన్ తీసుకోగానే శైలు ఫోన్ చేసిందేమో అని చెక్ చేస్తాడు కానీ అందులో లేకపోయినా సరే ఒకసారి తనకి కాల్ చేసి కనుక్కోవాలని కేశవా అనుకుంటాడు..

శైలు కి కాల్ చేయగానే నేను ఏమి చెప్పలేదు. నాకు ఏమీ తెలియదు అని అంటుంది కానీ కేశవ కి మాత్రం అనుమానం మొదలవుతుంది.. మహాలక్ష్మి కన్నా ఇద్దరూ కూడా కేశవ ఏం మాట్లాడుతున్నారో అని వింటారు. అయితే శైలు నీ కేశవ బుస్సు అనడంతో దాన్ని నోట్ చేసుకుంటారు. ఇక శైలు ముంగిస అనడంతో ముంగిస అన్నావంటే మొహం పగలగొడతానని కేశవ్ అంటారు. అయితే వీరిద్దరి కన్వర్జేషన్ విన్న మహాలక్ష్మి కన్నా ఇద్దరు కూడా కేశవ అని ఒక ఆట ఆడుకోవాలని అనుకుంటారు.. రాత్రి అవ్వగానే అందరూ భోజనానికి కూర్చుంటారు. మాధవ్ వేస్తున్న పోపు బుసని సౌండ్ వస్తుంది అని మహాలక్ష్మి అంటుంది.. ఆ మాట వినగానే కేశవ కి డౌట్ వస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కేశవ శైలు కి ఫోన్ చేసి మా ఇంట్లో వాళ్ళ దగ్గర నువ్వు ఏం చెప్పావే అని సీరియస్గా అడుగుతాడు.. శైలు అసలు నిజం చెప్పడంతో కేశవ నన్ను అడ్డంగా ఇరికిస్తావా? నీ పని చెప్తాను చూడు అని అంటాడు.. ఇక తర్వాత మహాలక్ష్మి దగ్గరికి చక్రీ వచ్చి నేను మీకు తోడుగా వస్తాను అని ఇదంతా చెప్పినా సరే.. మహా మాత్రం ఎవ్వరు తోడు అవసరం లేదు అని అంటుంది.. కన్నా అందరు పడుకున్న తర్వాత బస్సు అని సౌండ్ చేస్తాడు దాంతో పాము వచ్చిందని అందరూ కంగారు పడతారు. అయితే ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఈ పాము గోల ఏంట్రా అసలు ఏం జరుగుతుంది రా అని అడుగుతారు.. ఏంటి ఏం జరిగింది అసలు ఏంటి గోల నాకేం అర్థం కావడం లేదు రా అనేసి మాధవ్ అంటాడు. తప్పించుకోవడానికి ఏదేదో మాట్లాడుతున్నారు అని కేశవ అని అడ్డంగా ఇరికిచ్చేస్తుంది మహా..

ఏంట్రా ఏం మాట్లాడుతున్నావ్ రా ఏం జరుగుతుంది ఎవరు ఆ అమ్మాయి అని కేశవ్ని మాధవ్ అడుగుతాడు. అదొక బ్రహ్మ రాక్షసి అని అనగానే ఏంటి బ్రహ్మ రాక్షసి నా ఏం మాట్లాడుతున్నావ్ రా అని మాధవి అడుగుతాడు.. పట్టుకుంటే వదలకపోతే దాన్ని ఏమంటారు బ్రహ్మ రాక్షసి అని అంటారు.. మీ తమ్ముడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అని మహాలక్ష్మి అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా బుస్సు ముంగిస అని మాట్లాడుకుంటున్నారు అని అంటుంది. తను నన్ను ముంగిస అంటుంది అందుకే నేను బస్సు అంటున్నాను అని మాధవ్ తో కేశవ అంటాడు.. అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు అని మాధవ్ చెక్రి ఇద్దరు కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు.. కేశవ మాత్రం మీకు అసలు నిజం చెప్తాను అని అంటాడు..

Advertisement

నా కస్టమర్ బైక్ ని తీసుకుని వెళుతుండగా స్కూటీతో వచ్చి గుద్దేసింది అన్నయ్య దానికి 20,000 బొక్క పడింది.. అయితే దాన్ని నాకు ఇవ్వమని అడిగితే తనివ్వకుండా నన్ను పదిమందిలో ఇరిగించేసి నాటకాలు ఆడుతుంది.. దాన్ని మాటలతో మాయ చేసి ఫోన్ కొట్టేసాను. ఆ ఫోనే ఇది వాళ్ళ నాన్న ఫోన్ నుంచి చేసింది. వాళ్ళ నాన్న ఫోన్ నెంబరు మై లవ్ అని ఫీడ్ చేసుకుంది అని కేశవ అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు.. అంతేనా ఇంకేమైనా ఉందా అని అందరూ అడుగుతారు.. ఇంకేమీ లేదు అంతే అని అనగానే చక్రి నాకు మాత్రం డౌట్ గానే ఉంది నేను ఎంక్వయిరీ చేస్తాను అని అంటాడు..

సరే ఇంక అందరూ వదిలేసి వెళ్లి పడుకోండి అని మాధవ్ అంటాడు.. ఉదయం లేవగానే మహాలక్ష్మి దేవుడికి దండం పెట్టుకొని కాలేజీకి వెళ్లాలని రెడీ అవుతుంది. అయితే అందరూ కూడా మహాలక్ష్మి ఒంటరిగా పంపించడానికి కంగారు పడిపోతూ ఉంటారు. అక్కడ ఏదైనా జరుగుతుందేమో అని మహాలక్ష్మిని వంటరిగా పంపించడానికి ఒప్పుకోరు. కానీ మహాలక్ష్మి నేనేం చిన్న పిల్లని కాదు పోయినసారి జరిగినట్లు ఈసారి జరగదులే నాకు నేను సేఫ్టీగా చూసుకోగలను అని అందరికీ ధైర్యం చెబుతుంది.. కేశవ మాత్రం ఒంటరిగా పంపించడానికి అసలు ఒప్పుకోడు.. కనీసం కారైన బుక్ చెయ్ రాని కేశవ చక్రితో అంటాడు..

Also Read : ప్రేమకు షాకిచ్చిన ధీరజ్.. వల్లికి చుక్కలు చూపించిన ప్రేమ.. నర్మద మాస్టర్ ప్లాన్..

చక్రి కారేశ్వర్ తో మాట్లాడి ఎలాగోలాగా బురిడీ కొట్టించి ఒక కారుని బుక్ చేస్తాడు.. మహాలక్ష్మిని అందరూ ఒంటరిగా పంపించడం ఇష్టం లేకపోయినా సరే సర్టిఫికెట్ల కోసమని అనగానే పంపిస్తారు. కార్ రాగానే అందరు జాగ్రత్తలు చెప్పి డబ్బులు ఇచ్చి పంపించాలని అనుకుంటారు.. వాళ్ళ అన్నదమ్ముల ప్రేమను చూసి మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఇక మాధవ్ చక్రి అందరూ కలిసి మహాలక్ష్మిని చాలా జాగ్రత్తగా కార్ ఎక్కించి పంపిస్తారు.. ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఫోన్ చెయ్ అమ్మ నువ్వేమీ భయపడకు అని మాధవ్ అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో నారాయణ దెబ్బకు మహాలక్ష్మి షాక్ అవుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×