// // Podarillu Today Episode : అయ్యో.. కన్నాకు జ్వరం.. తల్లిగా మారిన -->
E-Paper
Advertisement

Podarillu Today Episode : అయ్యో.. కన్నాకు జ్వరం.. తల్లిగా మారిన మహా..చక్రిని ప్రేమిస్తున్న మహా..

Podarillu Today Episode : అయ్యో.. కన్నాకు జ్వరం.. తల్లిగా మారిన మహా..చక్రిని ప్రేమిస్తున్న మహా..
Advertisement

Podarillu Today Episode June 7th : మహాలక్ష్మి నీ కాపాడాను కదా అందుకే నామీద కాస్త గుడ్ ఇంప్రెషన్  పడిపోతుంది అని చక్రి చాలా సంతోషంగా ఉంటాడు.. ఇప్పుడు నేను ఆమె దృష్టిలో హీరో. ఆమె నన్ను ఇష్టపడుతుంది అని నాకు క్లియర్ గా అర్థం అవుతుంది అని చక్రి అంటాడు. అంతేకాదు వీలైనంత త్వరగా నన్ను బావ అని పిలుస్తుంది చూడండి అని అనగానే కన్నా బావ అని పిలిస్తే మీరిద్దరు అసలు కలవరు అని అంటాడు.. అదేంట్రా పుసుక్కుని అంత మాట అనేసావు అని చక్రి అంటాడు.. బావా బావా అని మాధవన్నయ్యని గాయత్రి వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నిన్ను కూడా వదిన బావ అంటే ఎక్కడ వదిలేసి పోతుందని నాకు భయంగా ఉంది అని అంటాడు.

కన్నా కు జ్వరం..

ఉదయం అందరూ లేసినా కూడా కన్న లేకపోవడంతో మాధవ్ వీడికి ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటాడు. నీకు ఇష్టమైన బెండకాయ కర్రీ పచ్చడి సాంబార్ అన్ని ఇక్కడే ఉన్నాయి రా మొత్తం తినేసేయ్ అని మాధవ్ ఎంతగా మాట్లాడుతున్న సరే కన్నా మాత్రం అసలు మాట్లాడకుండా పడుకొని ఉంటాడు. ఏంటి వీడు ఎంతగా లేపిన సరే ఇంకా లేవడం లేదు అని మాధవ్ కంగారు పడిపోతూ ఉంటాడు. అసలు వీరికి ఏమైంది అబ్బా ఇంతవరకు లేవలేదు అని మాధవ్ అనుకుంటూ కన్నా ని లేపగానే వాడికి జ్వరం అని తెలుసుకుని కంగారు పడిపోతాడు.. ఇంత జ్వరం ఉంటే చెప్పేది లేదా రా పద హాస్పిటల్ కి వెళ్దామని మాధవ అడుగుతాడు. అది మామూలుగా వచ్చిన జ్వరం కాదులే అన్నయ్య చక్రి అన్నయ్య కోసం మనం తిరిగాం కదా అలా అలసిపోయి వచ్చిన జ్వరం అని కన్నా అంటాడు.

కన్నాను నా బిడ్డలాగా చూసుకుంటాను..

Advertisement

సరే మరి నేను ఫోన్ చేసి సైట్ కి రావడం లేదు అని చెప్తాను అని మాధవ్ అంటాడు.. అయితే అప్పుడు అక్కడికి వచ్చిన మహాలక్ష్మి ఏమైంది పెద్ది ఎందుకు నువ్వు కంగారు పడిపోతున్నావు అని అడుగుతుంది. కన్నాకు జ్వరం వచ్చిందమ్మా.. హాస్పిటల్ కి వెళ్దామంటే అతడు లేవట్లేదు. వాడిని చూసుకోవాలి కదా నేను ఇంట్లోనే ఉండిపోతాను ఇవాళ అని అంటాడు.. నువ్వెందుకు ఇంట్లో ఉండాలి పెద్ది, నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాలే వాడిని అని మహాలక్ష్మి అంటుంది. నీకెందుకమ్మా శ్రమ నేను చూసుకుంటాలే అని మాధవ్ అన్న సరే మహాలక్ష్మి తల్లికి బిడ్డ ఎక్కడ శ్రమ అనుకోదు అని అంటుంది.. మహాలక్ష్మి మాట విన్న మాధవ్ సరే అమ్మ నువ్వు జాగ్రత్తగా చూసుకో ఏదైనా అయితే నాకు వెంటనే ఫోన్ చెయ్ అని చెప్తాడు.

మహా ఒంటరిగా దొరికింది..

ఈరోజు మహాలక్ష్మి ఇంట్లో ఒక్కటే ఉంటుంది కన్నా ని చూసుకునే పేరుతో మహాలక్ష్మితో మాటలు కలిపేసి నా మీద ప్రేమ పెరిగేలా చేసుకుంటాను అని చక్రి అనుకుంటాడు.. కన్నాకు జ్వరం వచ్చింది కదా మీకు తోడుగా నేనుంటాను అని చక్రీ అనగానే. మీకేం పని పాట లేదా అని మహా తిడుతుంది.. వెళ్లి మీ పని మీరు చూసుకోండి వాడిని చూసుకోవడానికి నేనున్నాను కదా అని మహాలక్ష్మి అంటుంది. అందరితో మంచిగుంటుంది నాతో మాత్రమే ఇలా ఉంటుంది ఏంటో అని చక్రి బాధపడిపోతూ ట్రిప్ కోసం వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి కన్నా కి దగ్గరుండి సేవలు చేస్తూ తనకి అమ్మలాగా మారిపోతుంది.

కేశవ దెబ్బకు శైలు ఫ్యూజుల్ అవుట్..

Advertisement

కేశవ మెకానిక్ షాప్ కి వెళ్లేందుకు బయట రెడీగా ఉంటాడు.. నిన్నంతా తిరిగాను కదా బండి కూడా కింద పడిపోయింది కదా.. అందుకే ఇది మొరాయించినట్లు ఉంది అని బండికి ఏమైందో చూస్తూ ఉంటాడు.. అయితే వెనకాలే శైలు రావడం చూసి నువ్వు ఎందుకు నా వెనుక పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని కేశవ సీరియస్ అవుతాడు. నీ కొంచమైనా బుద్ధుందా నువ్వు అన్ని సార్లు ఫోన్ చేశావు అవతల మనిషి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఏం చేస్తున్నాడో అర్థం చేసుకోవా నువ్వు అని శైలజా ని చంప పగలగొడతాడు.. ఇంకొకసారి నా వెనకాల పడ్డ నాకు ఫోన్లు చేసిన కూడా మర్యాదగా ఉండదు నీకు అని వార్నింగ్ ఇస్తాడు.. దాంతో శైలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కేశవ శైలుని అనవసరంగా కొట్టానే అని బాధపడిపోతూ ఉంటాడు..

చక్రీ కోసం టెన్షన్ పడ్డ మహా..

ఇక రాత్రి అందరూ భోజనానికి కూర్చోగానే చక్రి ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతుంది.. వాడికి ట్రిప్ లో లేట్ అయిందేమో ఫోన్ కూడా చేయలేదు కదా అని అనగానే.. అవును కదా మరి కనీసం ఫోన్ అయినా చేయాలి కదా అని మహాలక్ష్మి బాధ పడిపోతూ ఉంటుంది. అయితే మహా మాత్రం అందరూ భోజనం చేస్తున్న సరే చక్రి కోసం వెయిట్ చేసే తర్వాత తింటాను అని అంటుంది. ఆ మాట వినగానే కేశవ ఒక్కసారిగా షాక్ అవుతాడు.. ఇక చక్రి రాగానే మహాలక్ష్మి బయట ఎదురుచూస్తూ కనిపించడం చూసి చక్రీ ఏంటి మొగుడు కోసం వెయిట్ చేస్తున్నట్లు వెయిట్ చేస్తుంది కదా అని లోలోపలే సంతోష పడిపోతూ ఉంటాడు.. ఏంటండీ లేట్ అవుతుందని చెప్పచ్చు కదా అని మహాలక్ష్మి చక్రిని ఇంటికి రాదని అడుగుతుంది.. నేను లేట్ అవుతుందని అన్నయ్యకి ఫోన్ చేసి చెబుదామనుకున్నానండి. కానీ మర్చిపోయాను అని అనగానే నాకు కూడా ఫోన్ ఉంది. నాకు ఫోన్ చేయొచ్చు కదా అని మహా అనగానే చక్రి ఆలోచనలో పడతాడు. కానీ కేశవ వచ్చి తను ఇందాకటి నుంచి నీకోసం వెయిట్ చేస్తుంది రా ఇదంతా చూస్తుంటే నీ ప్రేమలో పడిపోయినట్లు కనిపిస్తుంది అని అనగానే చక్రి గాల్లో తేలిపోతుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: సుబ్బారావుకు పల్లవి వార్నింగ్.. అవనికి అనుమానం.. పల్లవికి మైండ్ బ్లాక్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×