E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ స్టోరీతో కేశవ ఎమోషనల్.. కన్నీళ్లు తెప్పించే సీన్.. అడ్డంగా ఇరుక్కున్న మహా..

Podarillu Today Episode : చక్రీ స్టోరీతో కేశవ ఎమోషనల్.. కన్నీళ్లు తెప్పించే సీన్.. అడ్డంగా ఇరుక్కున్న మహా..
Advertisement

Podarillu Today Episode June 27th : మహా హాస్టల్ దగ్గరికి చక్రి వెళ్తాడు. అయితే అక్కడ సారీ అన్నా బెలూన్స్ కనిపించడంతో దివ్య ఏంటది ఎవరికోసం సారీ అని అక్కడ చూడగానే కింద చక్రి కనిపిస్తాడు. మా హాస్టల్ దగ్గర ఎందుకు ఇంత షో ఆఫ్ చేస్తున్నావు నువ్వు దయచేసి ఇక నుంచి వెళ్ళిపో అని మహాలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది. అయితే నా సారీ నేను యాక్సెప్ట్ చేయండి అని చెక్రి ఎంతగా చెప్తున్నా సరే మహా మాత్రం జన్మలో ఇక తప్పు చేయను అని అంటుంది. మీ హాస్టల్ కి నేను వాచ్మెన్ గా జాయిన్ అయిన తర్వాత మీరు నన్ను క్షమిస్తారని చక్రి అడుగుతాడు. కానీ మహాలక్ష్మి మాత్రం చక్రికి షాక్ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చక్రి కేశవ కి తన బాధను చెప్పి ఇంకాస్త బాధపడతాడు..

ఎమోషనల్ స్టోరీతో కన్నీళ్లు..

చక్రి బయట ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉండడం చూసినా కేశవ ఏంట్రా ఇక్కడే కూర్చున్నావు ఏమైంది తనని కలిసావా అని అడుగుతాడు. కలిసాను రా, కలిసిన కూడా పెద్దగా ప్రయోజనం లేదు. తను నన్ను క్షమించడానికి కూడా ఇష్టపడడం లేదు అని చక్రి అంటాడు. మనకు ఇష్టమైన వాళ్ళు దూరమైతే ఆ బాధ భరించలేనిది రా అని చక్రి బాధపడతాడు. నా లైఫ్ లోకి ఒక మెరుపుతీగ లాగా మహాలక్ష్మి వచ్చింది. నా కారు ఎక్కి ఆ తర్వాత వెంటనే దిగేసి వెళ్లిపోయింది. అప్పుడే నా మనసులో చోటు సంపాదించుకుంది అని చక్రి కన్నీళ్లు పెట్టుకుంటాడు.. మహాలక్ష్మి లేదు అన్న వార్త కూడా నేను విని తట్టుకోలేకపోతున్నాను రా నేను ఇంతగా బాధపడుతున్నాను అంటే నాకే అర్థం కావడం లేదు. తను నాకు శాశ్వతంగా దూరమైతే నేను బ్రతకలేను అంటూ చక్రి అనడంతో కేశవ ఫీలవుతాడు..

చక్రీ స్టోరికి కేశవ కనెక్ట్..

Advertisement

చక్రి మహాలక్ష్మి గురించి అలాగే ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్తాడు. మనం ప్రేమించబోతున్నాము అన్న వ్యక్తులు మనకు తెలియకుండానే మనకు పరిచయం అవుతారు. ఆ తర్వాత అవసరం లేకపోయినా రెండోసారి మనల్ని కలుస్తారు. ఇక మూడోసారి వాళ్లు బాధపడుతుంటే మనం తట్టుకోలేకపోతము. వాళ్లని ప్రేమిస్తున్నాము అని డైరెక్టుగా చెప్పలేకపోయినా వాళ్ళపై ఉన్న ఇష్టాన్ని మన మనసులోని దాచుకొని కుమిలిపోతూ ఉంటాము అని చక్రి అంటాడు. అంతే కాదు తనకి కష్టం వస్తే ఎంత దూరమైనా వెళ్లేలా ప్రేమ చేస్తుంది రా అని చక్రి అనగానే కేశవ తనకు శైలుకు మధ్య జరిగిన స్టోరీని ఒకసారి గుర్తు చేసుకుంటాడు. ఆ స్టోరీ మొత్తం తన లైఫ్ లో కూడా జరిగింది ఇది నిజంగానే ప్రేమ నా అని ఆలోచిస్తూ ఉంటాడు..

మహాలక్ష్మీ అడ్డంగా ఇరుక్కుందే..

మహాలక్ష్మి హాస్టల్ లోకి వెళ్ళగానే అక్కడ హాస్టల్ లోని కొందరు అమ్మాయిలు మహాలక్ష్మి దగ్గర కూర్చుంటారు. నీకోసం అంత ప్రేమగా సారీ అంటూ బెలూన్స్ తీసుకొచ్చారు కదా అతను ఎవరు అని అడుగుతారు. మీ రిలేటివ్ అయితే బెలూన్స్ ఇచ్చి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ కజిన్స్ అయితే అసలు సారీనే చెప్పరు. అంత రొమాంటిక్ గా అంత బాగా సారీ చెప్పాడు అంటే అతనికి నీకు ఏదో కనెక్షన్ ఉంది చెప్పు అని అందరూ బలవంతంగా అడుగుతారు. కానీ మహా మాత్రం ఏం చెప్పాలి ఏమి లేదు అని దాస్తుంది. ఒకటి మాత్రం అర్థమైంది మహాలక్ష్మి నువ్వు నీకు తెలియకుండానే అతని ప్రేమిస్తున్నావు అని హాస్టల్ లోని అమ్మాయిలు అంటారు. ఆ మాటతో మహాలక్ష్మి ఫీల్ అవుతుంది. నేను ఆ చక్రిని లవ్ చేయడం ఏంటి వీళ్ళ ఊహ కానీ అని వెళ్లి పడుకుంటుంది.

కన్నాకు జ్వరం వచ్చింది..

Advertisement

తర్వాత రోజు ఉదయం కన్నా నిద్రపోయి ఇంకా లేవకపోవడంతో చక్రి ఏమైంది రా ఇంకా లేవట్లేదు. మీ వదిన గనుక ఉంటే ఎప్పుడో లేచే వాడివి కదా ఎందుకు లేవలేదు అని అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మాధవ్ వాడు ఏమి ఊరికే పడుకుని నిద్రపోలేదు రా జ్వరం వచ్చింది అందుకే పడుకున్నాడు అని మాధవ్ అంటాడు. అదేంట్రా మీకు జ్వరం చుట్టం లాగా ఉంది పిలవక ముందే వచ్చి కూర్చుంటుంది అన్నట్లుగా మొన్నే కదా జ్వరం వచ్చింది ఇప్పుడు మళ్లీ జ్వరం ఎలా వచ్చింది అని అడుగుతాడు. జ్వరమేమైనా చెప్పి వస్తుందా అని మాధవ్ చక్రిపై సీరియస్ అవుతాడు. నేను కన్నా ని చూసుకుంటాను నువ్వెలా అన్నయ్య అని మాధవ్ అని పంపిస్తాడు చక్రి.. నీకు జ్వరం వచ్చింది కదా మీ వదినకి ఫోన్ చెయ్యి నేను చూసుకోవడానికి వస్తుంది అని చక్రి అంటాడు. మా వదిన కి ఫోన్ చెయ్యను నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు.. నువ్వెక్కడుండగా మా వదిన కి ఫోన్ చేసి రమ్మనాలి అని అవసరం నాకు లేదు అని కన్నా అంటాడు. మొన్న దగ్గరుండి సేవలు చేసింది కదా ఇప్పుడు కూడా అలానే సేవలు చేస్తుంది అని అనుకున్నాను అని చక్రి అంటాడు. మొత్తానికి చక్రి లవ్ స్టోరీ అటు ఇటు వెళ్లిన సరే.. మన మొండోడు కేశవ లవ్ స్టోరీ మాత్రం ముందుకు సాగేలా కనిపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య మనోజ్ సేఫ్.. డేంజర్ లో రోహిణి.. ప్రభావతికి షాకివ్వబోతున్న మీనా..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×