E-Paper
Advertisement

Podarillu Today Episode : మహాకు గార్డియన్ గా మారిన పెద్ది.. కన్నీళ్లు తెప్పించే సీన్.. గుండెలుబద్దలు అయ్యే సీన్..

Podarillu Today Episode : మహాకు గార్డియన్ గా మారిన పెద్ది.. కన్నీళ్లు తెప్పించే సీన్.. గుండెలుబద్దలు అయ్యే సీన్..
Advertisement

Podarillu Today Episode June 24th : మహాలక్ష్మి నేను హాస్టల్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను పెద్ది అని మాధవతో చెప్తుంది. ఇక మాధవ్ ఏమి మాట్లాడకుండా నీకు ఎలా అనిపిస్తే అలా చేయమ్మా నేను ఉండమని బలవంత చేయను వెళ్ళమని చెప్పను అని అంటాడు.. ఇక కన్నా వచ్చేలోగా తన లగేజ్ సద్దుకొని బయటికి వచ్చిన మహాలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. చక్రి కేశవ ఇద్దరూ కూడా మహాలక్ష్మిని క్షమించమని ఎంతగా అడుగుతున్న సరే తను మాత్రం వెళ్లలేని గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇక మహాలక్ష్మిని హాస్టల్లో దిగబెట్టడానికి పెద్ది వెళ్తాడు. ఆ ఇంటితో ఉన్న సంబంధాలను గురించి గుర్తు చేసుకుంటూ మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. కానీ మహాలక్ష్మి హాస్టల్ కి రాగానే తనకి అన్ని విధాలుగా మాధవ్ సపోర్ట్ చేస్తాడు..

మహాకు గార్డియన్ గా మారిన పెద్ది..

మహాను తీసుకొని హాస్టల్ కి వెళ్తాడు మాధవ్.. అక్కడికి వెళ్లి ఒక తండ్రికి తన కూతురి హాస్టల్లో ఎలాగైతే వదిలి పెడుతుందో అలాగే వాళ్ళందరికీ జాగ్రత్తలు చెబుతూ హాస్టల్లో వదిలిపెట్టాలని అనుకుంటాడు.. అక్కడ హాస్టల్ వార్డెన్ తో మాట్లాడి డబ్బులు కట్టి మరీ ఒక గార్డియన్ గా మారుతాడు.. అయితే అక్కడ తన ఫ్రెండుతో మహాలక్ష్మిని అప్పగించి వెళ్లడం చూసిన అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు.. ఇక నేను వెళ్లి వస్తానమ్మా అని మాధవ్ చెప్పి వెళ్ళగానే మహాలక్ష్మి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తుంది..అయితే, మాధవ్ వెళుతూ ఉండగా మహాలక్ష్మి రావడంతో ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటారు.. ఇద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు.. ఈ సీన్ చూసిన వాళ్ళందరికీ గుండెలు ఉప్పొంగిపోయే కన్నీళ్లు వస్తాయి..

నారాయణపై చక్రీ సీరియస్..

Advertisement

చక్రి కేశవ కన్నా ముగ్గురు కూడా బయట కూర్చుని మహాలక్ష్మి వెళ్లిపోయింది అని బాధపడిపోతూ ఉంటారు.. చక్రి నారాయణ రాగానే నీ కోసమే వెయిట్ చేస్తున్నాను.. నువ్వే ఇదంతా జరగడానికి కారణం అని సీరియస్ అవుతాడు.. నువ్వే కనుక నన్ను రెచ్చగొట్టకపోతే నేను అసలు మహాలక్ష్మి దగ్గరికి వెళ్లే వాన్నే కాదు.. నీవల్లే ఇదంతా జరిగింది అని కోపంగా మాట్లాడుతాడు.. నేనేం చేశాను రా పెళ్ళాం వెళ్ళిపోతుంటే చవటగా చూస్తూ ఉండిపోయావా అని నారాయణ అంటాడు.. కాసేపు గొడవపడతారు.. ఇక చక్రి మహా వెళ్ళిపోయింది అని తనకు తానే శిక్ష వేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు..

మహా కోసం కన్నీళ్లు పెట్టుకున్న కన్నా..

కన్నా మహాలక్ష్మి వెళ్లిపోయింది అని బయట కూర్చుని ఒంటరిగా ఏడుస్తూ ఉంటాడు. తన దగ్గరికి వచ్చిన కేశవ నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే మన ఇంటిలో నుంచి మహాలక్ష్మి వెళ్లిపోయింది అని అందరికీ తెలుస్తుంది రా పద లోపలికి తీసుకొని వెళ్తాడు.. బయట ఆటో సౌండ్ రాగానే కన్నా పరిగెత్తుకుంటూ అన్నయ్య వదినని తీసుకొని వచ్చాడు అని వస్తాడు.. బయట మాధవ్ ఒక్కడే కనిపించడంతో వదిన రాలేదా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు కన్నా.. ఎలాంటి లోపం లేదు నువ్వు చెప్తే వదిన ఆగేది కదా అన్నయ్య ఎందుకు నువ్వు అక్కడే వదిలేసి వచ్చావు అని అందరూ అడుగుతారు. మహాలక్ష్మి వెళ్లిపోయినందుకు చక్రి కూడా బాధపడిపోతూ ఉంటాడు.. నువ్వు తాగి తనతో అసభ్యంగా ప్రవర్తించమని నేను రాసి ఇవ్వలేను కదరా అందుకే వెళ్ళిపోయింది అని మాధవ్ కూడా అంటాడు..

కన్నీళ్లు పెట్టుకున్న అన్నదమ్ములు..

Advertisement

ఇక చక్రి మహాలక్ష్మి ఉన్న గదిలోకి వెళ్లి మీరు లేరన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని బాధ పడిపోతాడు. అదేవిధంగా కన్నా మాధవ్ కూడా వదిన వెళ్ళిపోయింది అని బాధ పడిపోతూ ఉంటారు. నారాయణ మాత్రం నా కన్నతల్లి నన్ను వదిలేసి వెళ్లిపోయిందని తాగవచ్చి బాధపడిపోతూ ఉంటాడు.. ఇక నారాయణ ఎలాగైనా సరే మహాలక్ష్మిని కలిసి తనని మళ్లీ ఇంటికి తీసుకురావాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మహాలక్ష్మి ఆ ఇంటి నుంచి వెళ్లిపోగానే ఇంట్లో ఏదో తెలియని వెలితి కనిపిస్తుంది అని ముగ్గురు అన్నదమ్ములు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈ ఎపిసోడ్ కి ఇదే హైలెట్ సీన్ గా మారుతుంది.. ఈ సీరియల్ ఇవాల్టి ఎపిసోడ్ మాత్రం అందరిని కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తుంది..

మహాను కలిసిన నారాయణ..

మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళిన నారాయణ బీడీలు ఎక్కువగా కాలుస్తున్నాను నువ్వు లేవు కదా ఊడ్చి వాళ్ళు కూడా లేరు అని అంటారు.. నన్ను తిట్టేవాళ్ళు కూడా ఎవరూ లేరు కదా అందుకే నేను ఏమీ చేయలేకపోతున్నాను అని నారాయణ అంటాడు.. ఆ కొంపలోని నలుగురు అన్నదమ్ములు చాలా బాధపడిపోతున్నారు.. ఆ సంతోషాన్ని మిగిల్చావు. ఇప్పుడు నువ్వు వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో సంతోషం కూడా పూర్తిగా పోయింది అని మహాలక్ష్మికి అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంటాడు.. మీరందరూ ఒకే రక్తం కదా మీ బుద్ధి ఎలా ఉంటుందో మార్చలేము అని అంటారు. నిజానికి చక్రి ఎలా రావడానికి కారణం నేనే అని నారాయణ నిజం చెప్పడంతో మహాలక్ష్మి చాలా సీరియస్ అవుతుంది. మొత్తానికి నారాయణ మీద కోపంతో ఉంటుంది మహాలక్ష్మి.. మళ్లీ ఆ ఇంట్లో ఆడ దిక్కులేని పాడిపడ్డ కొంపలాగా మారిపోతుంది.. మహాలక్ష్మి గారితో కొంచెం మాట్లాడాలి. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Gundeninda GudiGantalu Today episode: రోహిణికి మైండ్ బ్లాక్.. మనోజ్ ను కాపాడిన రోహిణి.. సత్యంకు బాలు గుడ్ న్యూస్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×