E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీని చూసి షాకైన మహా.. మాధవ్ కు ఘోర అవమానం..ఇంట్లోంచి మహా వెళ్ళిపోతుందా..?

Podarillu Today Episode : చక్రీని చూసి షాకైన మహా.. మాధవ్ కు ఘోర అవమానం..ఇంట్లోంచి మహా వెళ్ళిపోతుందా..?
Advertisement

Podarillu Today Episode June 22 nd : మహాలక్ష్మి గదిలోకి వెళ్లిన చక్రి తనని ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. మహాలక్ష్మి వెంటనే కళ్ళు తెరిచి షాక్ అవుతుంది. చక్రి మహా గదిలోకి వెళ్లి నువ్వు నా భార్య ఇది మనది గది అంటూ మాట్లాడుతూ ఉంటాడు.. పెళ్లి ఎలా జరిగినా సరే ఇది పెళ్లి అవుతుంది. నేను నీ భర్తనే అని మాట్లాడుతూ తనకి ముద్దు పెట్ట పోతాడు. అప్పుడే సడన్ గా కళ్ళు తెరిచిన మహాలక్ష్మి చక్రిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఏం చేస్తున్నారు మీరు అని గట్టిగా అరుస్తుంది.. నీ మెడలో నేను తాళి కట్టాను కాబట్టి నీ భర్తను నేను.. మరి నీ గదిలో పడుకోక ఎక్కడ పడుకోవాలి అని చక్రి అడుగుతాడు.. నీ పక్కలోనే నేను పడుకుంటాను అని చక్రి మాట్లాడడంతో మహాలక్ష్మి ఒక్కసారిగా భయపడిపోతుంది. తాగేసి వచ్చారా ఎందుకిలా మాట్లాడుతున్నారు అని కంగారు పడిపోయిన మహా వెంటనే కేకలు పెట్టి పెద్ది అని వస్తుంది..

మహా ఏడుస్తుందని కంగారుపడ్డ మాధవ్..

మహాలక్ష్మి ఎందుకో బాధపడుతుంది ఏడుస్తున్నట్లు ఉంది రా అని అందరూ అక్కడికి వెళ్తారు.. డోర్ కొట్టి పిలవాలని ప్రయత్నిస్తారు కానీ మహా చక్రి గురించి చెప్పి ఏడుస్తుంది. తను మనిద్దరం భార్యాభర్తల మనీ అంటున్నాడు తాగేసి వచ్చాడు పెద్ది అని భయపడిపోతుంది.. ఇక అందరూ ఒక్కసారిగా కంగారు పడిపోతారు.. గడ్డపార తీసుకొని వచ్చి తలుపు బద్దలు కొడదాం అని అంటే లేదు వాడు ఇక్కడే డోర్ దగ్గరే ఉన్నాడు రా.. అని అందరూ ఎలాగైనా సరే మహాలక్ష్మి తలుపు తీయమని అడుగుతారు.. చివరికి మహాలక్ష్మి వాళ్ళు ఎవరు రారు మనిద్దరం భార్యాభర్తల మనీ చక్రి అంటున్న సరే తనని తోసేసి మహా డోర్ తీస్తుంది.. చక్రిని ఆ పరిస్థితిలో చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. మహాలక్ష్మి ఎంత భయపడిపోతుందో చూడరా అని మాధవ్ ఎంత చెప్పడానికి ప్రయత్నించినా కూడా చక్రి మాత్రం అసలు మాట వినడు.

చక్రీని కొట్టిన మాధవ్..

Advertisement

పెద్ది చక్రి నా గదిలోకి వచ్చి మనిద్దరికీ పెళ్లి అయిపోయింది. నీ పక్కలో పడుకుంటే తప్పేంటి అని అసభ్యంగా మాట్లాడుతున్నాడు అని మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఎందుకురా ఇలా మారిపోయావు అని చక్రిని బయటకి తీసుకొని వస్తాడు మాధవ్.. నువ్వు తాగేసి వచ్చావా ఈ కొత్త అలవాటు ఎప్పటినుంచి రా. ఒక ఆడపిల్ల గదిలోకి వెళ్లే ముందు నువ్వు ఆలోచించవా ? ఎందుకు ఇలా చేస్తున్నావు అని మాధవ్ చక్రిని అడుగుతాడు.. కానీ చక్రి మాత్రం నా భార్య గదిలోకి నేను వెళ్తే తప్పేంటి అని అడుగుతాడు.. ఇష్టపడి పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలవుతారు అనుకోని పరిస్థితిలో తాళి కడితే ఆ అమ్మాయిని కాపాడిన వాడివి అవుతావు అలాంటిది నువ్విలా ప్రవర్తిస్తావని నేను అసలు ఊహించలేదు అని మాధవ్ అరుస్తాడు..

మాధవ్ ఘోర అవమానం..

ఒక ఆడపిల్ల గదిలోకి వెళ్లి ఇలా ప్రవర్తించడం మంచిది అనుకుంటున్నావా..? ఎందుకు పశువు లాగా ప్రవర్తిస్తున్నావు అని మాధవ్ చక్రిని తిడతాడు.. నాకు పెళ్లయింది కాబట్టి.. నా భార్య గదిలోకి నేను వెళ్తే తప్పేంటి.? తనంటే నాకు ఇష్టం మా ఇద్దరికి పెళ్లి అయింది కాబట్టి ఒకే గదిలో ఉండక ఎక్కడ ఉండాలి అని చక్రి అడుగుతాడు. పెళ్లయిన తర్వాత కూడా భార్యకు దూరంగా ఉండాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందో నీకేం తెలుస్తుంది. పెళ్లి పెటాకులు లేని వాడివి నీకు ఆ బంధం గురించి తెలియదు కదా అని మాధవను అవమానిస్తాడు చక్రి.. చక్రి నీ మాధవ్ కొట్టబోతాడు.. అయితే చక్రి నామీద చెయ్యి పడితే అసలు ఊరుకోను అని వార్నింగ్ ఇవ్వడంతో మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.

మహా ఇంట్లోంచి వెళ్ళిపోతుందా..?

Advertisement

చక్రిని ఒక రూమ్ లో పెట్టి తలుపు వేస్తారు. నారాయణ నా వల్లే వాడిలా ప్రవర్తించాడు అని బాధపడిపోతూ ఉంటాడు.. మహాలక్ష్మి ఎంత బాధపడిపోయిందో నాకు చాలా భయంగా ఉంది అని అనుకుంటాడు.. కానీ మహాలక్ష్మి ఉదయం లేవగానే తొందరగా ఆఫీస్ కి వెళ్లడంతో అందరూ ఏమైంది అని అడుగుతారు. మహాలక్ష్మి మాత్రం అందరూ పిలుస్తున్న సరే మౌనంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.. చక్రి కి ఉదయం మెలకువ రాదరి తను మహాలక్ష్మితో చేసిన ప్రవర్తనను గుర్తుచేసుకొని బాధపడిపోతూ ఉంటాడు.. ఇక ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి తన ఫ్రెండ్ దివ్య అని అడిగి హాస్టల్లో వేకెన్సీ ఉందేమో అని కనుక్కుంటుంది.. మొత్తానికి మహాలక్ష్మి ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతుందని అర్థమవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: అయ్యో.. ప్రభావతికి ఎన్ని కష్టాలో.. కుక్కల దెబ్బకు మనోజ్ కు షాక్.. దిగొచ్చిన ప్రభా..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×