E-Paper
Advertisement

Podarillu Today Episode : కన్నా కోరికను తీర్చిన మహా.. చక్రీకి మైండ్ బ్లాక్..జైలుకు వెళ్లిన చక్రీ..?

Podarillu Today Episode : కన్నా కోరికను తీర్చిన మహా.. చక్రీకి మైండ్ బ్లాక్..జైలుకు వెళ్లిన చక్రీ..?
Advertisement

Podarillu Today Episode June 16th : ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి ఆఫీసులో జరిగిన విషయాన్ని మహాలక్ష్మి పెద్దితో చెబుతూ ఉంటుంది.. చక్రి చేసిన పనికి ఆఫీసులో నా తల కొట్టేసినట్లు అనిపించింది పెద్ద అని బాధ పడిపోతూ ఉంటుంది.. అప్పుడే ఇంటికి వచ్చిన చక్రి నేను అలా చేయడం కరెక్టే.. ఇంకొకసారి మీ వైపు ఎవరైనా చూడాలన్న కూడా భయపడిపోతారు అని అంటాడు.. మీరు పిచ్చిపిచ్చిగా చేస్తే అసలు ఊరుకోను చెప్తున్నాను అని మహాలక్ష్మి అంటుంది. నేను మీకోసమే చేశాను కదా.. మీరు ఎందుకు నన్ను ఎలా తిడుతున్నారు అని చక్రి అనగానే నా గురించి ఆలోచించలేదు నువ్వు ఎవరు అని మహాలక్ష్మి అంటుంది.. మహాలక్ష్మి మాట కొవ్వు హర్ట్ అయిన చక్రి చాలా ఆవేశంగా బయటికి వెళ్లిపోతాడు.. అందరూ పడుకున్న సరే చక్రి మాత్రం ఇంటికి రాకపోవడంతో మహాలక్ష్మి అతని కోసం ఎదురు చూస్తూ భయపడిపోతూ ఉంటుంది..

చక్రికీ యాక్సిడెంట్.. 

నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే మా ఇంట్లో వాళ్ళు ఒక్కరు కూడా నాకు ఫోన్ చేసి ఎందుకు ఇంట్లోంచి వెళ్లిపోయావు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమి చెప్పకుండా ఉన్నారు.. నిన్నగాక మొన్న వచ్చిన మహాలక్ష్మి నాకోసం ఫోన్ చేసి ఎక్కడికి వెళ్లారు అని అడిగింది అని చక్రి మహాపై ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు.. మహాలక్ష్మి ఫోన్ చేసి రమ్మనింది కాబట్టే నేను ఇంటికి వెళ్తున్నానని చిరాగ్గా చక్రి ఇంటికి వెళ్తుంటాడు. అయితే అప్పుడే అక్కడికి వచ్చినా ఒక వ్యక్తి రాంగ్ రూట్లో వచ్చి చక్రి కారుని గుద్దేస్తాడు… తను మాత్రం రాంగ్ రూట్లో వచ్చినా కూడా నేనే రైట్ అంటూ మొండిగా ప్రవర్తించడంతో పాటుగా పోలీస్ స్టేషన్లో కేసు పెడతానని అంటాడు..

కన్నా కోరికను తీర్చిన మహా..

Advertisement

కన్నా ఇంటికి రాగానే ఏం కూర చేసావ్ అన్నయ్య అని అంటాడు.. అయితే పప్పు చారు చేశాను రా అని అనగానే ఏంటి మన ఇంట్లో ఎప్పుడు పప్పుచారు అలానే ఉంటాయి అందరిలో చికెను అలాంటివి ఎక్కువగా వాసన వస్తూ ఉంటాయి అని అంటాడు కన్నా.. మనింట్లో ఎప్పుడు చూసినా పప్పుచారు వాసన వస్తుంది కనీసం ఇవ్వాలైనా చికెన్ తెచ్చుకుందాం అన్నయ్య అని అంటుంది.. అవును పెద్ది వాడి కోరిక తీర్చడంలో తప్పులేదు కదా మనం ఇవాళ చికెన్ చేసుకుందాము మీరు చికెన్ తీసుకురండి అని అంటుంది మహా.. వదిన కోసం ఏమైనా చేస్తాడు అన్నయ్య ఈరోజు మన ఇంట్లో చికెన్ చేసుకుంటున్నాము అని అనగానే అంతలోపే చక్రి ఫోన్ చేస్తాడు.. పోలీసులు అరెస్ట్ అక్కడే ఉన్నాను నేను అని చెప్పగానే షాక్ అవుతారు.

పోలీస్ స్టేషన్ కు వెళ్లిన చక్రీ ఫ్యామిలీ..

వాడు రాంగ్ రోట్లో వచ్చి కూడా చక్రీదే తప్పు అన్నాడట.. దాంతో పోలీసులు వాడి మాట వినకుండా అరెస్ట్ చేస్తామని అంటున్నారట అని అనగానే మహాలక్ష్మితో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. ఇక చక్రిని ఎలాగైనా సరే విడిపించాలి అని అక్కడికి వెళ్తారు.. అయితే అక్కడ పోలీసులు చెప్పిన మాట విని మాధవ్ షాక్ అవుతాడు.. ఎంత చెప్తున్నా సరే పోలీసులు మాత్రం వినకుండా చక్రి తప్పు అని అనడంతో మాధవలు బ్రతిమలాడతారు.. అతను కూడా రాంగ్రోడ్లో నేను రాలేదని మీ తమ్ముడి వల్ల నా చేయి విరిగింది అని చెప్పగానే పోలీసులు అదే నిజం అనుకోని చక్రిని అరెస్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు.. ఇక ఎక్కువ మాట్లాడద్దు అని చక్రిని జైల్లో వేస్తారు.. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు అప్పగించాలి అని చెప్పగానే అందరూ షాకిస్తారు..

డబ్బులిచ్చి సెటిల్ చేసిన ఓంకార్..

Advertisement

చక్రి నడుపుతున్న కారు ఓనర్ కి ఫోన్ చేసి ఆ ట్రావెల్స్ ఓనర్ ని ఇక్కడ అర్జెంటుగా పిలిపించండి అని ఎస్సై చెప్పగానే కానిస్టేబుల్ ఓంకారేశ్వరుని అక్కడికి పిలిపిస్తారు.. అక్కడ చక్రి ఏం చేశాడు అన్నది కేశవ చెప్పగానే ఇలాంటివన్నీ మామూలుగా మేము చూసుకుంటాను అని అంటారు. ఇక లోపలికి వెళ్ళిన ఓంకారేశ్వర్ అక్కడ ఎంతగా మాట్లాడి బ్రతిమలాడినా సరే ఆ వ్యక్తి మాత్రం అసలు వినకుండా కోర్టుకు వెళ్తాను అని అనడంతో డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకుందామని అంటాడు.. ఇక 50,000 అతని డిమాండ్ చేయడంతో మాధవ్ తప్పని పరిస్థితులలో ఆ డబ్బులు ఇస్తానని ఒప్పుకుంటాడు.. మొత్తానికి చక్రిని రిలీజ్ చేసి బయటకు వదిలేస్తారు..

లైసెన్స్ సీజ్.. చక్రీ, కేశవ ఫైట్..

నా తప్పు లేకపోయినా మీరు డబ్బులు కట్టారు అది నాకు బాధగా ఉందని చక్రి అనగానే లైసెన్స్ ఇవ్వమని ఎస్ఐ అడుగుతాడు. అయితే ఆ లైసెన్స్ తీసుకున్న ఎస్ఐ నువ్వు చాలా పొగరుగా మాట్లాడుతున్నావు నీ లైసెన్స్ ని ఒక నెలపాటు సీజ్ చేస్తాను అని చెప్తాడు.. మీరు ఇలా చెప్తే ఎలా ఉంటుంది అతను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. కారు నడిపితే కానీ అతని జీవితం సాగదు అని ఓంకారేశ్వర్ ఎంత చెప్తున్నా సరే మాత్రం అసలు వినకుండా లైసెన్స్ తీసుకుంటాడు.. ఇంటికి వెళ్లిన చక్రి పోలీసులకు డబ్బులు ఇవ్వడం నాకు నచ్చలేదు అని మళ్లీ కేశవ గొడవ పడతాడు అది చూసిన మహాలక్ష్మి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×