E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీని అవమానించిన మహా.. ఒక్కమాటతో మహా సీరియస్.. ఇంట్లోంచి వెళ్లిపోయిన చక్రీ..

Podarillu Today Episode : చక్రీని అవమానించిన మహా.. ఒక్కమాటతో మహా సీరియస్.. ఇంట్లోంచి వెళ్లిపోయిన చక్రీ..
Advertisement

Podarillu Today Episode June 14th : ఏంటి మహాలక్ష్మి గారు ఏంటి ఈ పంచాయతీ అని అడుగుతాడు కుమార్.. అదేం లేదు సార్ నేను చూసుకుంటాను అని మహాలక్ష్మి ఎంత చెప్తున్నా సరే చక్రి మాత్రం అస్సలు వినకుండా ఎవరు నీ మీద అరిచింది చెప్పండి వాడి అంత చూస్తాను అని అంటాడు.. మీరు ఇకనుంచి వెళ్తారా వెళ్ళరా అని చక్రిని ఎంతగా బ్రతిమిలాడినా కూడా తను మాత్రం అరుస్తూనే ఉంటాడు.. ఇక క్యాబిన్ నుంచి విక్కీ కూడా బయటికి వచ్చి ఎవరితను ఏంటి గొడవ అని అడుగుతాడు.. విక్కి నేను చూసుకుంటాను అని మహాలక్ష్మి చెప్పి చక్రిని బయటకు తీసుకుని వెళుతుంది. బయటికి వెళ్లిన మహాలక్ష్మి చక్రిని తిడుతుంది.

మీరు రౌడీలా బిహేవ్ చెయ్యొద్దు.. 

నీ గురించి తప్పుగా మాట్లాడితే నేను అసలు ఊరుకోను. అసలు ఎవరండి మీ గురించి వాళ్ళు తప్పుగా అనడానికి అని మహాలక్ష్మి ని చక్రీ అడుగుతాడు.. అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు ఇక్కడ నేను పనిచేసే చోటు నాకు పరువు తీయకండి అని మహాలక్ష్మి అంటుంది.. అయినా మీరెందుకు ఇంతగా భయపడిపోతున్నారు వాడెవడో చెప్పండి వాడి సంగతి నేను చూసుకుంటాను అని చక్రితో అంటుంది మహా.. వాళ్లతో మీరు ఎందుకు అలా అంటున్నారు భయపడిపోతున్నారా ఎందుకు భయపడాలి? నేను ఉండను కదా చెప్పండి ఇది కాకపోతే బొచ్చెడు ఆఫీసులో ఉన్నాయని చక్రి అంటాడు..

ఇక్కడ నుంచి వెళ్లిపోండి.. 

Advertisement

మీరు ఇకనుంచి వెళ్లిపోండి అందరి దగ్గర నా పరువు తీసేసారు అని మహా అనగానే చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు.. మీరెందుకు అంతగా భయపడుతున్నారు అని చక్రి ఎంతగా అడుగుతున్నా సరే మహాలక్ష్మి మాత్రం నేను భయపడుతున్నానా నా తల కొట్టేసినట్లు అయిపోయింది. ఇంతమందిలో మీరు ఎలా గొడవ చేస్తే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని మహాలక్ష్మి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.. ఇంకొకసారి ఆఫీస్ లోపలికి మీరు వస్తే బాగోదు అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది మహాలక్ష్మి..

మహా పై విక్కీ సీరియస్.. 

మహాలక్ష్మి మళ్ళీ ఆఫీస్ కి రాగానే.. విక్కీ మహాలక్ష్మిని పిలిచి అసలు ఏంటి లక్కీ గొడవ ఎందుకు ఏమైంది అని అడుగుతాడు. ఇంతకీ అతను ఎవరు గొడవపడడానికి వచ్చాడు. అచ్చం రౌడీలాగే ఉన్నాడు కదా అని విక్కీ అనగానే మహాలక్ష్మి కాస్త ఫీల్ అవుతుంది.. అతను నాకు ఫ్రెండ్ కొంచెం ఆఫీస్ లో ఫోన్ మాట్లాడుతూ ఉండగా.. కుమార్ గారు ప్యూన్ పై తిట్టేశారు అది విన్నా అతను నిజంగానే నామీద అరిచారు అనుకోని వచ్చారు. ఐ యాం సారీ ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను అని అంటుంది. సరే ఏదైనా బయట చూసుకోండి ఆఫీస్ వరకు తీసుకురావద్దు అని చక్రి మహాలక్ష్మికి వార్నింగ్ ఇస్తాడు.. సరే  విక్కీ ఇలాంటివి ఇంకెప్పుడు సరుకులు చూసుకుంటాను అని మహాలక్ష్మి మాట ఇస్తుంది..

చక్రిని తిట్టినా మహా..

Advertisement

ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి ఆఫీసులో జరిగిన విషయాన్ని మహాలక్ష్మి పెద్దితో చెబుతూ ఉంటుంది.. చక్రి చేసిన పనికి ఆఫీసులో నా తల కొట్టేసినట్లు అనిపించింది పెద్ద అని బాధ పడిపోతూ ఉంటుంది.. అప్పుడే ఇంటికి వచ్చిన చక్రి నేను అలా చేయడం కరెక్టే.. ఇంకొకసారి మీ వైపు ఎవరైనా చూడాలన్న కూడా భయపడిపోతారు అని అంటాడు.. మీరు పిచ్చిపిచ్చిగా చేస్తే అసలు ఊరుకోను చెప్తున్నాను అని మహాలక్ష్మి అంటుంది. నేను మీకోసమే చేశాను కదా.. మీరు ఎందుకు నన్ను ఎలా తిడుతున్నారు అని చక్రి అనగానే నా గురించి ఆలోచించలేదు నువ్వు ఎవరు అని మహాలక్ష్మి అంటుంది.. మహాలక్ష్మి మాట కొవ్వు హర్ట్ అయిన చక్రి చాలా ఆవేశంగా బయటికి వెళ్లిపోతాడు.. అందరూ పడుకున్న సరే చక్రి మాత్రం ఇంటికి రాకపోవడంతో మహాలక్ష్మి అతని కోసం ఎదురు చూస్తూ భయపడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. మరి సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.. మహాలక్ష్మి జాబ్ మానేస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది..  మరి నిజంగానే చక్రి మహాలక్ష్మి విడిపోతారా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. ఏది ఏమైనా కూడా సోమవారం ఎపిసోడ్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: రవి, శృతి ఫుల్ హ్యాపీ.. మీనా పై ప్రశంసలు.. ఇట్స్ ఫ్యామిలీ పార్టీ..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×