E-Paper
Advertisement

Podarillu Today Episode : శైలు కోసం బాధపడ్డ కేశవ.. మహాకు చక్రి సర్ప్రైజ్.. ఆఫీస్ లో మహాకు గ్రాండ్ వెల్కమ్..

Podarillu Today Episode : శైలు కోసం బాధపడ్డ కేశవ.. మహాకు చక్రి సర్ప్రైజ్.. ఆఫీస్ లో మహాకు గ్రాండ్ వెల్కమ్..
Advertisement

Podarillu Today Episode June 10th : ఉదయం మహాలక్ష్మి ఉద్యోగానికి వెళ్తుంది అని మాధవ్ అందరికీ చక్కర పొంగలి చేసి ఇస్తాడు.. అయితే మాధవ్ మహాలక్ష్మి రాగానే తనకి కూడా పొంగలి ఇస్తాడు.. మహాలక్ష్మి మహాలక్ష్మి లాగే రెడీ అయ్యి చీరలో బయటికి రావడం చూసి అందరూ మీరు చీరలు చాలా బాగున్నారు వదిన అని అంటారు.. అయితే చక్రి మాత్రం చీరలో మహాలక్ష్మి ఎంత అందంగా ఉందో అని తనని ఎవరు ఎన్ని తిడుతున్నా సరే పట్టించుకోకుండా అలానే చూస్తుండిపోతాడు.. ఇక బయటికి వెళ్ళగానే టపాసులు పేల్చి ఉద్యోగం వచ్చింది అని రచ్చ రచ్చ చేస్తారు.. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైందని ఆలోచిస్తూ ఉంటారు.. మన ఏమాత్రం తనకు సంబంధం లేకుండా కూడా ఏదో ఒకటి వాగడంతో నారాయణ దిమ్మతిరిగి పోయేలా షాక్ ఇస్తాడు..

మహాకు చక్రీ బిగ్ సర్ప్రైజ్..

మహాని చక్రి తన కారులో తీసుకొని వెళ్తాడు.. అయితే చక్రి లోడలోడా కారులో వాగుతూ ఉండగా.. మహాలక్ష్మి కారుని అక్కడ ఆపు అని అంటుంది. రోడ్డు మీద కారు ఆపితే బాగోదు కదా అని చక్రి అంటూ ఉండగా అక్కడ గుడుంది దండం పెట్టుకొని వెళ్దాం అని మహాలక్ష్మి అంటుంది.. సరే ఆపుతాను అని చక్రి అంటాడు.. ఇద్దరూ కలిసి గుడికి వెళ్లి దండం పెట్టుకొని వస్తారు. ఆ తర్వాత చక్రి మహాలక్ష్మికి ఒక గిఫ్ట్ అని ఇస్తాడు.. మీకు ఇది సర్ప్రైజ్ అని అంటాడు అయితే ఆ గిఫ్ట్ ను చూసిన మహాలక్ష్మి చక్రిని ఆట పట్టిస్తుంది.. మహాలక్ష్మికి బాగా నచ్చడంతో చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.. ఇంకా గిఫ్ట్ నచ్చదని అనుకున్నాను కానీ బాగా నచ్చింది కదా అని అంటాడు చక్రీ..

ఆఫీస్ లో గ్రాండ్ వెల్కమ్..

Advertisement

మహాలక్ష్మి ఆఫీస్ లోకి అడుగు పెట్టగానే విక్కీ వెనకాలే రావడంతో.. మిమ్మల్ని నేను డిస్ట్రబ్ చేయను మీకు ముందు అడ్డు రాను మీరు వెళ్లిపోండి అని అనగానే.. అందాల రాక్షసి సైకో అనుకుంటూ విక్కీ మాట్లాడుకుంటూ ఉంటారు.. అయితే లోపలికి మహా రాగానే కుమారుని చూసి షాక్ అవుతుంది. కుమార్ ప్రవర్తన చూసి మహాలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది.. ఇంకా దివ్య మహాని లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది. అయితే లోపలికి వెళ్ళగానే అక్కడ గ్రాండ్ వెల్కమ్ చెప్తారు.. అంతే కాదు కేక్ కటింగ్ కూడా ఉండడంతో మహాలక్ష్మి ఏంటిది అని అనుకుంటుంది.. అయితే అక్కడ విక్కి ఇలా మీకు ఒక్కరికే కాదు అందరికీ ఇలానే ఉంటుంది అని చెప్పడంతో మహాలక్ష్మి హ్యాపీగా ఉంటుంది..

చక్రీ గురించి దాచిన మహా..

మహాలక్ష్మి ఆఫీసులోకి తన క్యాబిన్లోకి అడుగు పెట్టగానే అక్కడ ఉన్న వర్కు గురించి తెలుసుకుంటారు.. అయితే తన సిస్టం ముందు కూర్చోగానే అందరూ ఒక్కొక్కరిగా ఫోన్ చేసి ఆఫీస్ ఎలా ఉంది అని అడుగుతారు.. ఇక చక్రి గురించి పెళ్లయిన విషయాన్ని చెప్పకుండా దాస్తుంది మహాలక్ష్మి.. దివ్య మాత్రం తన గురించి లొడ లొడ వాగేస్తూ ఉంటుంది.. మహాలక్ష్మి చక్రి గురించి చెప్పకపోవడమే మంచిది అని అనుకుంటుంది.. నాకు జరిగింది నిజమైన పెళ్లి కాదు కదా అని మనసులో అనుకుంటుంది అప్పుడే చక్రి ఫోన్ చేయగానే తనతో విచిత్రంగా ప్రవర్తించడంతో చక్రి సైకో అని అనుకుంటాడు.

కన్నా తల్లిని చూసి మహా షాక్..

Advertisement

దివ్య అలాగే మహాలక్ష్మి ఆఫీస్ అయిన తర్వాత ఇద్దరు కలిసి నడుచుకుంటూ వస్తారు.. అయితే బస్సులో వాళ్ళిద్దరూ కలిసి వచ్చేటప్పుడు ఒక ఆవిడ వాళ్ళిద్దరిని గుద్దుకుని పక్కకు వస్తుంది.. అది చూసిన మహాలక్ష్మి ఆవిడని చూసి కన్న వాళ్ళ అమ్మలాగే ఉంది అని అనుకుంటుంది. ఆవిడని చూసిన తర్వాత మహాలక్ష్మి షాక్లో ఉండిపోతుంది.. అయితే బస్ స్టాప్ లో కన్నా ఉన్నా కూడా తను పట్టించుకోకుండా మహాలక్ష్మి ముందుకు వెళ్లిపోవడంతో కన్నా ఎంతగా పిలుస్తున్నా వినిపించుకోదు.. ఏమైంది వదిన అలా పరధ్యానంగా ఉన్నావు ఏమైనా జరిగిందని కన్నా అడుగుతాడు.. కానీ కన్నా కు ఆ విషయం చెప్పకుండా దాచిపెడుతుంది మహాలక్ష్మి..

నారాయణ నిజం చెప్తాడా..?

అయితే మహాలక్ష్మి ఇంటికొచ్చిన తర్వాత అందరూ ఆఫీస్ ఎలా ఉంది అని అడుగుతారు.. కేశవ ఆఫీస్ నుంచి నువ్వు తీసుకొచ్చావా లేదా అని చక్రిని అడుగుతాడు. నేను ఒంటరిగా వెళ్లడం నేర్చుకోవాలి మీరు ఈ విషయం గురించి ఇక మాట్లాడకండి అని మహాలక్ష్మి అంటుంది.. ఇక ఆ తర్వాత నారాయణ దగ్గరికి వెళ్లిన మహాలక్ష్మి కన్న వాళ్ళ అమ్మని నేను చూశాను ఆ విషయం గురించి మీరు నాకు నిజం చెప్పాలి అని ఎంతగా అడిగినా సరే నారాయణ నేను చెప్పను అని అంటాడు.. కానీ నారాయణ ఆవిడ గురించి దాచడంతో మహాలక్ష్మి ఏదో ఆయన దాస్తున్నాడు అని అనుకుంటుంది.. ఈయన ఏదో దాస్తున్నాడు కచ్చితంగా ఏదో జరిగింది అని మహాలక్ష్మి అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం వేదవతి కన్నీళ్లు.. స్మగ్లర్ కోసం వేట.. ధీరజ్ జైలుకు వెళ్తాడా..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×