E-Paper
Advertisement

Podarillu Today Episode : శైలు ఇంట్లో రచ్చ చేసిన కేశవ.. మహా మాటతో వరాలు ఫ్యూజుల్ అవుట్.. చక్రీ ఫుల్ హ్యాపీ…

Podarillu Today Episode : శైలు ఇంట్లో రచ్చ చేసిన కేశవ.. మహా మాటతో వరాలు ఫ్యూజుల్ అవుట్.. చక్రీ ఫుల్ హ్యాపీ…
Advertisement

Podarillu Today Episode July 8th: ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు మీరు? ఎందుకు వాణ్ని ఇలాగే ఉంచారు. నాకు ఆ విషయం ముందే చెప్తే వాడు అంటూ చూసే వాడిని కదా మన ఇంటి గురించి అంత మాట అంటాడా? వాడి సంగతి ఏంటి నేను చూస్తాను అని ఆవేశంగా లోపలికి వెళ్ళిపోతాడు.. శైలజ ఫోన్ చేయగానే ఇది ఒకటి ప్రాణానికి అంటూ శైలజ మీద చిరాకు పడతాడు.. అయితే శైలజ వాళ్ళ అన్న ఇంటికి వచ్చి గొడవ చేసిన విషయాన్ని తనతో చెప్తాడు.. మీ అన్న ఇలా మాట్లాడ్డం నాకు అస్సలు నచ్చలేదు మా ఇంట్లో వాళ్ళని ఏమన్నా పడతాను గాని మా ఇంటి గురించి మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడు.. నువ్వేం ఆవేశ పడకు రా నేను చూసుకుంటాను అని ఎంత చెప్తున్నా సరే.. ఇక శైలజ వెళ్లి వాళ్ళ అమ్మతో గొడవ పడుతుంది..

శైలు ఇంట కేశవ రచ్చ..

ఉదయం లేచిన తర్వాత కేశవ చక్రి ఎక్కడ కనిపించడం లేదు అని అందరూ అనుకుంటారు.. వీళ్ళు నిన్న జరిగిందానికి ఆవేశ పడిపోయి ఎక్కడికైనా వెళ్లిపోయారేమో అని అందరూ కంగారు పడిపోతుంటారు.. ఇక కేశవా కి ఫోన్ చేస్తే ఫోన్లు ఇద్దరు ఇంట్లోనే పెట్టిపోయారని తెలుసుకొని వీళ్ళు ఆ ఇంటికి వెళ్లి గొడవ పడడానికి వెళ్ళారా ఏంటి అని అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు.. కేశవ చక్రి ఇద్దరూ శైలు వాళ్ళ ఇంట్లోకి నేరుగా వెళ్లి పెద్ద గొడవ చేస్తారు. మధ్యలో వచ్చిన సురేష్ ని కొట్టిమరి చక్రి దిమ్మ తిరిగిపోయే డైలాగులు కొడతాడు.. చక్రి కేశవ మాటలు విన్న వరాలు ఇలాంటి వాడిని నువ్వు ప్రేమించావా అంటూ శైలుని తిట్టేస్తుంటుంది.. ఇక వాళ్ళింటి గురించి మాట్లాడిన మాటలతో చక్రి అలాగే కేశవ ఇద్దరు కూడా వరాలుకి అలాగే శైలువాల్ల నాన్నకి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతారు.

లాస్ట్ పంచ్ చక్రీదే..

Advertisement

శైలు ఎంత చెప్తున్నా కూడా చక్రి అలాగే కేశవా ఇద్దరు వినకపోవడంతో వరాలు వాళ్ళిద్దరికీ దద్దరిల్లి పోయాలా మాటలతో యుద్ధం చేస్తుంది.. ఇక మధ్యలో శైలును తీసుకుని వచ్చి ఇంకాస్త వాయించేది.. సురేష్ మధ్యలో అడ్డు రావడంతో అతన్ని కూడా కేశవ కొట్టేస్తాడు.. ఇక ఆదితో పోలిస్తూ చక్రి అయితే సురేష్ ని తిట్టేస్తుంటాడు.. అస్సలు ఊహించని విధంగా చక్రి కేశవ ఆ ఇంట్లో చేసిన రచ్చ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.. అరే మనం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత దీన్నేమైనా అంటారేమో కొడతారేమో అని కేశవా చక్రితో అంటాడు.. శైలు మా వాడిని ప్రేమించిన తర్వాత మా ఇంటి పిల్ల అయింది తన మీద చేయి చేసుకున్న తనని ఒక్క మాట అన్నా మేము ఊరుకోం ఈసారి నలుగురు వస్తాము అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు చక్రి.. చక్రి మాట విన్న వరాలు ఇలాంటి వాడితో మీకు పెళ్లి చేస్తాను అనుకుంటున్నావా అని లోపలికి వెళ్ళిపోతుంది..

నిజం తెలిసిపోయిందా..?

కేశవ అలాగే చక్రి వాళ్ళ ఇంట్లో వార్నింగ్ ఇచ్చి ఇంటికి రాగానే మాధవతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్లారు అని అడుగుతారు. మేము ఎక్కడికి వెళ్ళలేదు మేము వాకింగ్ కి వెళ్ళామని ఒకరు. జాగింగ్ కి వెళ్ళామని మరొకరు అబద్ధం చెప్పడంతో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు మీకైనా అర్థమవుతుందా అని మాధవ తిడతాడు. మీరు ఇంటి మీదకి ఏమీ గొడవలు తీసుకురావడం లేదు కదా మాకు కాస్త భయంగా ఉంది రా మీరిద్దరూ కలిసి వెళ్లారు అంటే అని హలో భయపడుతూ ఉండగా.. ఏమి భయపడకండి అన్నయ్య మేము ఎక్కడికి ఏ గొడవ తీసుకురావడం లేదు.. కన్నా వీళ్లిద్దరు ఎప్పుడు ఏదో ఒక గొడవ తీసుకొని వస్తారు అని అక్కడి నుంచి బయటికి వస్తాడు.. ఇకపోతే రైలు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి పెద్ద రచ్చ చేస్తారు.

మహా దెబ్బకు వరాలు ఫ్యూజుల్ అవుట్…

Advertisement

బయట వాళ్ళిద్దరూ వచ్చే పెద్ద గొడవ చేస్తుండగా అందరూ ఎంత చెప్తున్నా సరే వాళ్ళు మాత్రం అస్సలు వినరు. నేను ఎన్నిసార్లు చెప్పినా సరే వినట్లేదు అని అందరూ అనుకుంటూ ఉంటారు.. వరాలు ఇలాంటి ఇయ్యాలన్న కొంపకి నా కూతుర్ని ఎలా పంపిస్తానని అనుకుంటున్నారు.అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు మనుషులేనా మీరు అని దారుణంగా మాట్లాడుతుంది.. లోపల వరాలు మాట విన్న మహాలక్ష్మి ఒక్కసారిగా బయటికి వచ్చి చిరుత పులి లాగా విజృంభిస్తుంది.. ఈ ఇంటికి ఏ ఆడపిల్ల రాదు అని అంటున్నారు నేను వచ్చాను ఈ ఇంటి ఆడపిల్లనే. నేను చక్రితో తాళి కట్టించుకున్న భార్యని ఇది నా అత్తగారిల్లు అని అనగానే అందరూ ఎంతో హ్యాపీగా ఫీలవుతారు.. ఆ ఇంటి గురించి మహాలక్ష్మి మాట్లాడిన మాటలు విని మాధవ్తో సహా మిగిలిన వాళ్ళందరూ కూడా సంతోషపడతారు.. మహాలక్ష్మి ఒక్క మాటతో వరాలుకి ఫీజులు ఎగిరిపోయేలా చేస్తుంది. మహాలక్ష్మి తో ఇక మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వరాలు అలాగే వాళ్ళ భర్త. ఇంట్లోకి వెళ్లిన వాళ్లందరూ కూడా చాలా సంతోషంగా డాన్సులు వేస్తూ ఉంటారు. ఈ ఎపిసోడ్ కి ఇదే హైలెట్గా నిలుస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: బావిలో దూకిన వల్లి.. నిజం దాచిన వేదవతి.. రామరాజు మాటతో శ్రీవల్లి కన్నీళ్లు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×