// // Podarillu Today Episode : సురేష్ కు చక్రీ స్ట్రాంగ్ వార్నింగ్.. చక్రీ, మహా -->
E-Paper
Advertisement

Podarillu Today Episode : సురేష్ కు చక్రీ స్ట్రాంగ్ వార్నింగ్.. చక్రీ, మహా విడాకులు.. శైలు పై కేశవ సీరియస్..

Podarillu Today Episode : సురేష్ కు చక్రీ స్ట్రాంగ్ వార్నింగ్.. చక్రీ, మహా విడాకులు.. శైలు పై కేశవ సీరియస్..
Advertisement

Podarillu Today Episode July 7th: నారాయణ బయట కూర్చుని ఉండగా సురేష్ తన ఫ్రెండ్స్ ని తీసుకొని వాళ్ళ ఇంటి మీదకు వెళ్తాడు.  ఇదే నారాయణ ఎవర్రా నువ్వు ఈ పిల్ల బచ్చా గాడివి నా ఇంటికి వచ్చావు అని అడుగుతాడు. అయితే నారాయణ మాట్లాడుతూ ఉండగా సురేష్ ఇంట్లో మెకానిక్ ఉన్నాడా మెకానిక్ రారా బయటికి అని అరుస్తాడు.. ఇంట్లో నుంచి భయపడుతూ బయటకు వచ్చినా మాధవ్ చక్రి ఇద్దరు చూసి ఏమైంది అని అడుగుతారు.. నా చెల్లిని ఆ మెకానిక్ గాడు ప్రేమిస్తున్నాడు అని చెప్పగానే మాధవ్ ఏంటి కేశవ ప్రేమలో పడ్డాడా అని షాక్ అవుతాడు.. నారాయణ ఈ మొండోడు ప్రేమలో పడ్డాడా అని సంతోషంగా ఉంటాడు..

సురేష్ కు చక్రీ వార్నింగ్…

సురేష్ఎంతగా చెబుతున్నా సరే వినకుండా చక్రి మాత్రం మాటకు మాట సమాధానం చెబుతూ ఉంటాడు.. నీ చెల్లి మా వాడి దగ్గరికి వచ్చింది మావాడు నీ ఇంటికి వచ్చి నీ చెల్లిని చెయ్యి పట్టుకుని బయటికి తీసుకుని వెళ్ళలేదు కదా ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావ్ రా ఆది గాని చక్రి దిమ్మ తిరిగిపోయేలా సురేష్ కి కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తాడు.. కానీ సురేష్ మాత్రం ఇలాంటి బూత్ బంగ్లా కి నాకు చెల్లెల్ని ఎలా పంపిస్తాను అనుకున్నావ్ అసలు ఆ ఆలోచన కూడా మీకు రాకూడదు అని తన స్టైల్ లో వార్నింగ్ ఇస్తాడు.. అయితే చక్రి సురేష్ ని ప్రతి మాటకి సమాధానం చెప్తూ తిడుతూ ఉంటాడు.. కేశవ ఎలాంటి వాడు మాకు తెలుసు మీ చెల్లెలు వాడి దగ్గరికి వచ్చింది కాబట్టి ముందు మీ చెల్లెల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి అని మాట్లాడతాడు.

నారాయణ సురేష్ కు మాస్ వార్నింగ్…

Advertisement

అయినా ఇలాంటి కొంపకి నా చెల్లెల్ని ఎలా పంపిస్తాను అనుకుంటున్నారు కొంచమైనా మీకు బుద్ధి లేదా అని సురేష్ చాలా కోపంగా అందరినీ తిడుతూ ఉంటాడు. అయితే సురేష్ మాట విన్న చక్రితో పాటుగా మాధవ్ కూడా సీరియస్ అవుతాడు. ఇదొక బూత్ బంగ్లా లాగుంది ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఒక లాడ్జి లాగా ఉంది.. ఈ లాడ్జికి నా చెల్లెల్ని ఎలా పంపిస్తాను అనుకుంటున్నారు అని దారుణంగా మాట్లాడతాడు. ఆ మాట వినగానే నారాయణ నా ఇంటిని లాడ్జి అంటావా నన్ను ఎన్నన్నా పర్వాలేదు కానీ నా ఇంటిని అంత మాట అంటావా నీ అంత చూస్తాను అని వార్నింగ్ ఇస్తాడు.. కేశవ గాడికి నా చెల్లెలు జోలికి వస్తే ఇంకా రోజులు ఉండవు అని సురేష్ కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు..

లాయర్ దగ్గరకు వెళ్లిన చక్రీ, మహా…

మహాలక్ష్మి అలాగే చక్రి ఇద్దరు కూడా వెళ్తారు . ఆ లాయరు అక్కడ వెళ్ళగానే చక్రి మహాతో కారణం ఏంటి అంటూ మరో కొత్త డైలాగుతో అందరినీ ఆకట్టుకుంటాడు.. అయితే మహాలక్ష్మి చక్రి ఉండగా ఏమి చెప్పలేదనీ లాయర్ బయటికి పంపిస్తాడు.. మహాలక్ష్మి కారణం చెప్పిన సరే అతడు మాత్రం పెద్దగా పట్టించుకోడు.. అయితే మహాలక్ష్మి మాత్రం తనకి విడాకులు కావాలి మాకు నాలుగు నెలల్లోనే పెళ్లయింది అని చెప్తుంది.. చక్రి కూడా తను విడిపోవడానికి కాదు కలిసి ఉండాలని అనుకుంటున్నాను అని ఎంతగా చెప్పిన సరే లాయర్ మాత్రం మహాలక్ష్మి చెప్పింది ఫైనల్ చేస్తాడు.. ఇద్దరు కలిసి సంతకాలు పెట్టి అక్కడ పేపర్లు ఇచ్చేసి బయటికి వస్తారు.. బయటికి రాగానే వాళ్ళిద్దరూ బెస్ట్ కపుల్ అంటూ ఒక మీడియా ఛానల్ అక్కడికి వచ్చి వారితో ఇంటర్వ్యూ తీసుకుంటుంది.. ఒకరికి తెలియకుండా మరొకరు అన్ని నిజాలు చెప్పడంతో ఆ ఎపిసోడ్ కాస్త హైలెట్గా నిలుస్తుంది. ఇక ఇద్దరూ చెప్పిన సమాధానాలు విన్న ఆ ఛానల్ వాళ్ళు వాళ్ళకి 5000 గిఫ్ట్ గా ఇస్తారు.. అయితే మహాలక్ష్మి చక్రిపై సీరియస్ అవుతుంది కూడా..

కేశవకు నిజం చెప్పిన నారాయణ..

Advertisement

ఇక మహాలక్ష్మి చక్రి అందరూ ఇంటికి రాగానే కేశవ గొడవ గురించి మాట్లాడుకుంటారు.. కేశవ కి ఈ విషయం తెలియకుండా ఉండాలి.. వాడికి ఈ విషయం తెలిస్తే ఆవేశంగా వెళ్లి వాడిని చంపిన వస్తాడు అని అందరూ అనుకుంటారు.. భోజనం చేస్తావా అని అడుగుతాడు. కేశవ ఏంటి అన్నయ్య అప్పుడే భోజనం చేస్తావని అడుగుతున్నావు ఏమైంది మీకు ఏం జరిగిందో అసలు అని అడుగుతాడు.. కేశవ మాత్రం అందరి మీద అనుమానంగా ఉంటాడు అప్పుడే నారాయణ వచ్చి నువ్వు నా కొడుకువని నేను ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నాను రా అని చెప్పగానే ఏమైంది అని అసలు విషయాన్ని అడుగుతాడు.. నువ్వు శైలజా అని అమ్మాయిని ప్రేమించావంట వాళ్ళ అన్నగాడు వచ్చి ఇంటి మీద పెద్ద గొడవ చేసాడు. మన ఇంటిని లాడ్జ్ అని కూడా అన్నాడు కాకపోతే నువ్వు ప్రేమించిన అమ్మాయి వాళ్ళ అన్న కాబట్టి మేము ఎవరు ఏమీ అనలేదు అని నారాయణ అంటాడు.

శైలుతో గొడవ పడ్డ కేశవ..

ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు మీరు? ఎందుకు వాణ్ని ఇలాగే ఉంచారు. నాకు ఆ విషయం ముందే చెప్తే వాడు అంటూ చూసే వాడిని కదా మన ఇంటి గురించి అంత మాట అంటాడా? వాడి సంగతి ఏంటి నేను చూస్తాను అని ఆవేశంగా లోపలికి వెళ్ళిపోతాడు.. శైలజ ఫోన్ చేయగానే ఇది ఒకటి ప్రాణానికి అంటూ శైలజ మీద చిరాకు పడతాడు.. అయితే శైలజ వాళ్ళ అన్న ఇంటికి వచ్చి గొడవ చేసిన విషయాన్ని తనతో చెప్తాడు.. మీ అన్న ఇలా మాట్లాడ్డం నాకు అస్సలు నచ్చలేదు మా ఇంట్లో వాళ్ళని ఏమన్నా పడతాను గాని మా ఇంటి గురించి మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడు.. నువ్వేం ఆవేశ పడకు రా నేను చూసుకుంటాను అని ఎంత చెప్తున్నా సరే.. ఇక శైలజ వెళ్లి వాళ్ళ అమ్మతో గొడవ పడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లి.. భాగ్యం ఫ్యూజుల్ అవుట్.. రామారాజుకు నిజం తెలుస్తుందా..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×