E-Paper
Advertisement

Podarillu Today Episode : ఇంట్లో అడ్డంగా బుక్కయిన శైలు..ఇంట్లో బాంబ్ పేల్చిన చక్రీ.. మహా కోసం పెద్ది త్యాగం..

Podarillu Today Episode : ఇంట్లో అడ్డంగా బుక్కయిన శైలు..ఇంట్లో బాంబ్ పేల్చిన చక్రీ.. మహా కోసం పెద్ది త్యాగం..
Advertisement

Podarillu Today Episode July 3rd: మహా చక్రిని కలవాలని అడుగుతుంది.. అయితే చక్రి మహాకోసమని ఒక రెస్టారెంట్ కి వస్తాడు.. చక్రి తో మాట్లాడాలని పిలిచిన మహా మౌనంగా ఉండడంతో చక్రిలోడలోడా బాగా వేస్తూ ఉంటాడు.. నాకు మీరు ఒక మాట ఇవ్వాలి ఒకటి ఇవ్వాలి అని మహాలక్ష్మి అడుగుతుంది.. నాకు విడాకులు కావాలి మనిద్దరం విడాకులు తీసుకోవడం మంచిది అని మహాలక్ష్మి అనగానే చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు.. మన ఉత్తుత్తి బంధం ఎందుకు పనికిరాదు కదా విడాకులు తీసుకోవడమే మంచిది అని మహా అనగానే చక్రి ఫ్యూజుల్ ఎగిరిపోతాయి. కానీ మహాలక్ష్మి కచ్చితంగా నాకు విడాకులు ఇవ్వాల్సిందే అని చెప్పడంతో చక్రి ఇక ఏమీ చేయలేక ఇస్తాను అని మాటిస్తాడు.. ఇక కేశవా నువ్వు కలిసిన శైలుని వాళ్ళ నాన్న చూసి చాలా బాధపడతాడు..

కేశవ పై కన్నాకు అనుమానం..

కేశవ శైలుతో డేటింగ్ కి బయటికి వెళ్లి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంటాడు.. అయితే కేశవ చాలా సంతోషంగా ఇంట్లోకి రావడం చూసినా కన్నా అతను ఏదో తేడాగా ఉన్నాడని ఆలోచిస్తూ ఉంటాడు.. మాధవ్ కూర చేసి ఎలా ఉందో చూడరా అని అక్కడికి తీసుకురాగానే ఎప్పుడూ లేనిది కేశవ చాలా సంతోషంగా ఉంది కనిపించడంతో పాటుగా ఆ కూర చాలా బాగుంది అదిరిపోయింది సూపర్ అంటూ పొగిడేస్తూ ఉంటాడు.. అరె నువ్వు ఎలా ఉంది ఒకసారి నువ్వు కూడా చూడరా అని మాదవ అడుగుతాడు.. లోపలికి వెళ్లి న కేశవ అద్దంలో చూసుకుని తెగ మురిసిపోతూ ఉంటాడు. అది చూసిన కన్నా బుస్సుతో డేటింగ్ కి వెళ్లొచ్చావని అడుగుతాడు. ఈ బుస్సు ఎవర్రా అనే మాధవి అడిగితే కేశవ్ అన్నయ్య ప్రేమించిన అమ్మాయి పేరు బస్సు అన్నయ్య అని అంటాడు.. మొత్తానికి కేశవ ప్రేమలో పడ్డాడని అందరూ కన్ఫామ్ చేసుకుంటారు..

అడ్డంగా దొరికిపోయిన శైలు..

Advertisement

శైలు చాలా సంతోషంగా ఇంట్లోకి ఎగురుతూ గంతులు వేసుకుంటూ వస్తుంది.. అయితే వరాలు చూసి ఏమైంది ఎందుకు ఇలా దంతులు వేస్తూ వస్తుంది అని అనుమానంగా చూస్తుంది. అది చూసిన వరాలు ఏమైందే రోజు మంచిగానే ఉండే దానివి కదా ఈరోజు ఏమైనా పిచ్చి పట్టిందా ఇలా గంతులు వేస్తున్నావు అని అడుగుతుంది. ఆ తర్వాత బయటకు వచ్చిన శైలు వాళ్ల నాన్న అబ్బాయి గురించి నాకు తెలిసిపోయిందని చాలా జాగ్రత్త పడుతుందేమో అని అతను అనుకుంటాడు.. ఎలాగైనా సరే తన గురించి చెప్పకుండా దాచి పడుతుందేమో అని మనసులో అనుకుంటూ ఉంటాడు.. ఆ అబ్బాయి గురించి నేను తెలుసుకోవాలి అని అతను అనుకుంటాడు.. అయితే ఏంటమ్మా నువ్వు కాలేజీ నుంచి నేరుగా ఇంటికే వస్తున్నావా లేదా ఎక్కడికైనా వెళ్ళావా అని అడుగుతాడు.. లేదు నాన్న ఎందుకు కొత్తగా మీరు అలా అడుగుతున్నారు అని అడుగుతుంది. ఏం లేదమ్మా ఊరికే అడిగాను అని చెప్తాడు. నేను కేశవ తో బండి మీద బయటకు రావడం చూసి నాన్ ఏమైనా చూసాడేమో అని శైలు అనుకుంటుంది..

చక్రీ, మహా కలిసిపోయారా..?

అయితే చక్రి మహా ఇద్దరు కలిసి రండి ఇంట్లోని వాళ్ళందరూ ఇదే మిరాకిలు వీళ్ళిద్దరూ కలిసిపోయారా అని అనుకుంటారు. ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరూ కలిసి ఉంటే చాలా బాగుంది అని మాధవ అంటాడు.. ఇంత సడన్గా వీరిద్దరూ కలిసి రావడం ఏంటి నాకు కూడా అర్థం కావడం లేదు ఏదో తేడా కొడుతుందని కేశవ అనుకుంటాడు.. చక్రి ఏమైందిరా మీరిద్దరూ కలిసిపోయారని అడగగానే చాలా సీరియస్ అవుతాడు.. మా ఇద్దరి గురించి నీకెందుకురా అని కోపంగా అందరిపై అరుస్తాడు. మహాలక్ష్మిని మాధవ్ టీ పెట్టి తీసుకురామ్మంటావా అమ్మ అని అడుగుతాడు. కానీ మహాలక్ష్మి మాత్రం ఒకటేసారి డిన్నర్ చేస్తాం పెద్ది అని అంటుంది.. అయితే మహాలక్ష్మి మళ్ళీ బయటికి వచ్చి మన ఇంటిని చూడడానికి మా ఆఫీసు వాళ్ళు వస్తారంట పెద్ద అని చెప్పగానే మాధవ్ ఏమైంది అమ్మ ఎందుకు అని అడుగుతాడు.. మన ఇల్లు పాతది కదా దానిని చూడ్డానికి మా వాళ్ళు వస్తారంట అని చెప్పగానే అందరూ ఇది ఒక ప్యాలెస్ దీని చూడడానికి వస్తారని వెటకారంగా మాట్లాడుకుంటారు..

విడాకుల మ్యాటర్ రీవిల్ చేసిన చక్రీ..

Advertisement

రాత్రి అయిన తర్వాత అందరూ పడుకునేందుకు సిద్ధంగా ఉంటారు.. తని చక్రి మాత్రం ఒంటరిగా తనలో తానే బాధపడిపోతున్నట్లు కనిపిస్తాడు.. అది చూసిన కేశవ నువ్వు అలా ఉంటే చూడలేకపోతున్నాం రా ఏమైంది అని అడుగుతాడు.. ఏం కాలేదు..రా అని ఎంతగా చెబుతున్నా కూడా వినకుండా అందరూ బలవంత పెడతారు.. మేమిద్దరం కలిసి రావడం చూసి మీరిద్దరూ కలిసిపోయారని అనుకున్నారు.. కానీ విడాకుల గురించి మీకు చెప్పాలి అని అంటాడు.. బయటికి తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళ వదిన ఏదో చెప్పిందన్నట్లుగా విడాకులు కావాలని అడిగింది.. త్వరలోనే విడాకులు ఇవ్వాలని కూడా నన్ను పోస్ట్ చేసింది అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే విడాకులు ఇవ్వమని అడిగింది అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఎలాగైనా సరే విడాకులు తీసుకుని ఇవ్వకుండా నేను ఏదో ఒకటి చేసి మా పెళ్లి ని నిజం పెళ్లి చేస్తాను అని చెక్రి శబదం చేస్తాడు.. అది విన్న మిగిలిన వాళ్ళందరూ కూడా అది జరిగినట్లే అని వెటకారంగా అనుకుంటారు. ఇక తర్వాత రోజు విక్కీ వాళ్ళు రావడంతో చక్రి కుళ్ళుకుంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: వల్లికి షాకివ్వబోతున్న నర్మదా.. ప్రేమ పరిస్థితి దారుణం..  ధీరజ్ దెబ్బకు రాజాపుష్పంకు ఫ్యూజుల్ అవుట్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×