E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..
Advertisement

Podarillu Today Episode July 20th: మహాలక్ష్మి చక్రిని గిఫ్ట్ అడిగిమరీ ఆ చీర కట్టుకొని వస్తాను అని లోపలికి తీసుకుని వెళుతుంది. అయితే చక్రి మహాలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. ఎంత బాగుందో దేవతలాగా ఉంది అంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు.. మహాలక్ష్మి ఎలా ఉంది అని అడగ్గానే చాలా అందంగా ఉన్నారండి అని చక్రి చెప్తాడు.. నాకు ఒక డౌటు సినిమాలలో చూపించినట్లుగా చీర ఇవ్వగానే లోపలికి వెళ్లి బ్లౌజ్ తో సహా కట్టుకుని వస్తారు అది ఎలా సాధ్యమని అడుగుతాడు. నాకు ఇష్టమైన కలర్ గ్రీన్ కలర్ వేరే శారీ మీదకి సెట్ అయ్యే జాకెట్ దొరకడంతో నేను దీనికి వేసుకున్నాను అని మహాలక్ష్మి అంటుంది.. మహాలక్ష్మి ఆఫీసులో పరిమిషన్ తీసుకొని కానిస్టేబుల్ ని కలవాలని అనుకుంటుంది.. విక్కీ కూడా అదే దారిలో వెళ్లాలి అని అనడంతో మహాలక్ష్మి విక్కీతో కలిసి వెళ్తుంది..

మహా పై విక్కీ కామెంట్స్..

మహాలక్ష్మి ఎందుకు ఒంటరిగా ఇక్కడికి వెళ్లాలనుకుంటున్నావు అని విక్కి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు.. మా రిలేటివ్ ఒక అతను కానిస్టేబుల్ ఉన్నారు ఆయనతో మాట్లాడడానికే నేను ఇంత దూరం వచ్చాను అని మహాలక్ష్మి అనగానే అవునా అని విక్కీ అంటాడు. విక్కీ ఎంతగా మాట్లాడుతున్నా సరే మహా మాత్రం చాలా సైలెంట్ గా ఏదో ఒకటి సమాధానం చెప్తూ ఉంటుంది.. అప్పుడే తన ఫ్రెండ్ ఫోన్ చేసి మహాలక్ష్మి హ్యాపీ బర్త్డే అని చెప్పగానే.. విక్కీ ఇవాళ నీ బర్త్ డే నా కనీసం చెప్పలేదు ఎందుకు అని అడుగుతాడు.. నా బర్తడే అన్న విషయం చెప్తే ఏం చేసే వాళ్ళు ఇప్పుడు చెప్పాను కదా అని అనగానే విక్కీ ఆఫీస్ లో గ్రాండ్ గా కేక్ కటింగ్ చేసే వాడిని కదా అని అంటాడు.. అయితే ఏం మహాలక్ష్మి మాత్రం ఇప్పుడైనా చెప్పారు కదా చాలా థాంక్స్ అని అంటుంది.. కానీ మహాలక్ష్మికి విక్కీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వగానే మొదట షాక్ అయినా తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతుంది..

కానిస్టేబుల్ చెప్పిన భయంకరమైన నిజం..

Advertisement

కానిస్టేబుల్ ని కలవడానికి అని పోలీస్ స్టేషన్ కి వెళుతుంది మహాలక్ష్మి.. అయితే అక్కడ కానిస్టేబుల్ తో మాట్లాడాలి అని వెళ్లిన మహాలక్ష్మి అతనితో మాట్లాడుతూ ఉండగా ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అక్కడికి వస్తారు.. ఎవరమ్మా నువ్వు ఏంటి ప్రాబ్లం అని అడగ్గాని నా పెళ్లి చేశారు కదా సార్ మీరు.. అందుకే ఒకసారి మాట్లాడదామని వచ్చాను అని అనగానే అవునా ఏంటమ్మా ఏదైనా సమస్య అని ఎస్ఐ అడుగుతాడు. అయితే నాకు భర్తతో విడాకులు తీసుకోవాలని అనిపిస్తుంది అందుకే నేను లాయర్ ని కలిసిన ప్రతిసారి కానిస్టేబుల్ నుంచి ఫోన్ వస్తుంది.. ఎవరు చేసారు ఎందుకు చేశారో కనుక్కుందామని ఇక్కడికి వచ్చాను సార్ అని చెప్పగానే ఎస్సై ఆ కానిస్టేబుల్ ని తిడతాడు.. విడాకులు తీసుకోవాలా వద్దా అన్నది వాళ్ల పర్సనల్ విషయం.. నువ్వెందుకు ఇంతగా ఇంటర్ ఫీల్ అవుతున్నావు అని ఎస్ఐ అడగగానే తన భర్త ఇలా చెప్పమని చెప్పాడు సార్ అని అతను నిజం చెప్తాడు.. ఆ మాట వినగానే మహాలక్ష్మి ఒక్క సరిగా షాక్ అవుతుంది..

చక్రీ ఇంత మోసం చేశాడా..?

మహాలక్ష్మి ఇంకొక విషయం తెలుసుకోవాలి అంటుంది. ఆధార్ కార్డు లేకుండా పెళ్లిని ఎలా రిజిస్టర్ చేస్తారు అని లాయర్ చెప్పిన మాటని కానిస్టేబుల్ తో అడుగుతుంది.. అవును సార్ నా ఆధార్ కార్డు లేకుండా మీరు పెళ్లిని ఎలా రిజిస్టర్ చేశారు అని మహాలక్ష్మి అడగగానే చక్రి దగ్గర ని ఆధార్ కార్డు ఉందమ్మా.. అతని ఆరోజు ఆధార్ కార్డు ఇవ్వగానే మీ పెళ్లిని రిజిస్టర్ చేసాము అని కానిస్టేబుల్ నిజాన్ని చెప్తాడు.. ఆ మాట వినగానే మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. కావాలనే చక్రి నన్ను ఇలా చేస్తున్నాడా ఎందుకు అని ఆలోచిస్తూ ఉండగా.. కానిస్టేబుల్ చక్రి నిన్ను చాలా ప్రేమిస్తున్నాడమ్మా నీకోసం ప్రాణమైన ఇస్తాడు అని నిజం చెప్తాడు.. ఆ మాట వినగానే మహాలక్ష్మి చాలా కోపంగా ఉంటుంది..

చక్రీ పై మహా సీరియస్..

Advertisement

ఇక మహాలక్ష్మి వంటరిగా వస్తుందని చూసిన విక్కీ ఏమైంది ఎందుకు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతాడు.. కానీ చివరికి మహాలక్ష్మి ఎలాగోలాగా విక్కీ కారులోనె ఇంటికి వస్తుంది. విక్కీ లక్కీ వచ్చారు అని కన్నా అనగానే చక్రి షాక్ అవుతాడు.. అయితే విక్కీని బయట నుంచి పంపించాలని అనుకుంటాడు కానీ మహాలక్ష్మి మాత్రం లోపలికి తీసుకొని వస్తుంది.. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత చక్రి గురించి ఆలోచిస్తూ మహాలక్ష్మి కోపంగా ఉంటుంది.. ఎలాగైనా సరే చక్రితో ఈ విషయాన్ని తేల్చుకోవాలి అని అనుకుంటుంది.. ఇక తర్వాత కేశవ గర్ల్ ఫ్రెండ్ శైలు అక్కడికి వస్తుంది. శైలుని చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఆ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది అని సంతోషంగా ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×