E-Paper
Advertisement

Podarillu Today Episode : ప్రతాప్ నుంచి తప్పించుకున్న భూషణ్.. రౌడీల నుంచి తప్పించుకున్నారు మహా, చక్రి.. నెక్స్ట్ ట్విస్ట్..?

Podarillu Today Episode : ప్రతాప్ నుంచి తప్పించుకున్న భూషణ్.. రౌడీల నుంచి తప్పించుకున్నారు మహా, చక్రి.. నెక్స్ట్ ట్విస్ట్..?
Advertisement

Podarillu Today Episode January 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లోని వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు.. ఆది మహా ఎలా వెళ్ళిందో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. బయటికి వెళ్లి అది ఏం జరిగిందని చూస్తూ ఉంటాడు.. ఇక లలిత హారిక ఏమైనా తెలిసేమో అని అడుగుతుంది. కానీ హారిక మాత్రం అతనంటే ఇష్టం లేదని మాత్రమే చెప్పింది కానీ ఇలా వెళ్ళిపోతుందని నేను అసలు ఊహించలేదు అత్తయ్య అని అంటుంది. చక్రి డ్రైవర్ కూడా లేడు అని ఆది చెప్పడంతో వాళ్లందరూ డ్రైవర్ని వెతకాలని అనుకుంటారు..

మహా అతని హెల్ప్ తీసుకుని వెళ్ళిపోయి ఉంటుందని హారిక అంటుంది. అయితే ఇప్పుడు మనం వాళ్ళని ఎక్కడున్నారో పట్టుకోవాలి అని ఆది అనుకుంటాడు. లెటర్ ని చూసిన భూషణ్ షాక్ అవుతాడు.. ఇకపోతే డ్రైవర్ తో లేచిపోయిందా అని అనగానే హారిక రెచ్చిపోతుంది.. భూషణ్ మహాని దారుణంగా తిడుతూ ఉంటాడు..ప్రతాప్ మాత్రం తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అందరికీ వెతకమని చెప్తాడు.. అయితే ఒకచోట తన మనుషులకు చక్రీ మహా దొరుకుతారు ఈ పెళ్లి కచ్చితంగా జరుగుతుంది అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది…

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… ప్రతాప్ రౌడీలు మహా చక్రిలను చూస్తారు. వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటారు.. అయితే వాళ్ళు తప్పించుకొని వెళ్తారు. ఈ విషయాన్ని వెంటనే ప్రతాప్ కి ఫోన్ చేసి చెప్తారు.. అయితే వాళ్ళని మేము ఫాలో అవుతున్నాము మీరు రండి అని అంటారు.. వాళ్ళు వెళ్తున్న లోకేషన్ ని ప్రతాప్ వాళ్లకి షేర్ చేస్తారు.. ఇక మహా చక్రి ఇద్దరూ కూడా రౌడీల నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు.. అయితే భూషణ్ మాత్రం ఏదో ఒకటి అంటూ ప్రతాప్ ని ఇంకాస్త రెచ్చగొడుతూ ఉంటాడు.. భూషణ్ మాటలకి ప్రతాప్ సీరియస్ అవుతూ ఉంటాడు. అయితే భూషణ్ మాత్రం వీళ్ల దగ్గర ఉంటే ఈ వీళ్ళ కోపానికి నన్ను వేసేసేలా ఎలా ఉన్నారు ఎలాగైనా సరే తప్పించుకోవాలి అని అనుకుంటాడు..

భూషణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి లొకేషన్ పంపిస్తాను నువ్వు నన్ను పిక్ చేసుకో నేను కొంచెం భయంకర పరిస్థితిలో ఉన్నాను అని అంటాడు.. ఇక భూషణ్ ఫ్రెండు అక్కడికి రాగానే అక్కడినుంచి వెళ్ళిపోతాడు.. ఒక దరిద్రం పోయింది వీడిని నేను కచ్చితంగా చంపేసేవాన్ని అని ప్రతాప్ అంటాడు. అయితే ఆది మాత్రం ఇంత జరిగిన తర్వాత కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కదా నాన్న అని అంటాడు.. అందుకే వాడిని ఊరికే వదిలేస్తున్నాను లేకున్నా అంటే ఈపాటికి ముక్కలు చేసే వాడిని అని ప్రతాప్ అంటాడు.. వాళ్లని ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలని చక్రి అనుకుంటాడు.. రౌడీలు నన్ను ఎలాగైనా సరే తీసుకెళ్లిపోతారు అని మహా అనుకుంటుంది.. నా ప్రాణాలను అడ్డువేసైనా మిమ్మల్ని కాపాడుతానని చక్రి అంటాడు..

Advertisement

Also Read : కామాక్షికి షాకిచ్చిన పెళ్లికొడుకు.. పెళ్లి సంబంధం క్యాన్సిల్.. మూడు జంటల రొమాన్స్..

నీకో విషయం తెలియట్లేదు నీ ప్రాణాలని తీయడానికే వాళ్ళు మీ వెనకాల ఫాలో అవుతున్నారు అని మహా అంటుంది. ఇక రౌడీలను దారి తప్పించడానికి చక్రి వేరే రూట్ నా వెళతాడు. అక్కడ వెళ్ళగానే అంత చీకటిగా ఉండడంతో మహా భయపడుతుంది.. నన్ను ఏదో చేయడానికి కదా ఇక్కడికి తీసుకొచ్చారు అని అంటుంది.. చి చి నేను అలాంటి వాడిని కాదండి మీరు ఆలోచించండి అని చక్రి అంటాడు.. నేను వెళ్లి వాష్ రూమ్ కి వెళ్లి వస్తాను అని అనగానే మహా నాకు భయమేస్తుంది మీరు రండి తొందరగానేసి అంటుంది.

ఇక తర్వాత మాధవ్ చక్రి ఏమైపోయాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. మరి ఎంత ఫోన్ చేయాలని చూసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాడు ఏం జరిగిందన్న కంగారుగా ఉందని అంటాడు.. నారాయణ మాత్రం మందు గురించి మాట్లాడుతూ అందరికి కోపాన్ని తెప్పిస్తాడు.. చక్రి కనిపించలేదని మేము టెన్షన్ పడుతుంటే నువ్వేంటి అని అందరూ అంటారు.. మహా నిద్రలేచి చక్రి ఎక్కడికో వెళ్లిపోయాడేమో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. అతని కోసం వెతుకుతూ కారు దగ్గరికి వెళ్ళిపోతుంది మహా.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో  మహా చక్రి రౌడీలకు దొరుకుతారా? మహాతో భూషణ్ పెళ్లి చేస్తారా? ఏం జరుగుతుందో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. మరి ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×