E-Paper
Advertisement

Podarillu Today Episode : భూషణ్ కు క్షమాపణ చెప్పిన ప్రతాప్.. మహా పై అనుమానం.. చక్రితో మహా వెళ్ళిపోతుందా..?

Podarillu Today Episode : భూషణ్ కు క్షమాపణ చెప్పిన ప్రతాప్.. మహా పై అనుమానం.. చక్రితో మహా వెళ్ళిపోతుందా..?
Advertisement

Podarillu Today Episode January 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. మహా ను టార్చర్ చేసిన భూషణ్ ఇంటికి రావడంతో కోపంతో తిడుతుంది. మహా నిజాలు ఏంటో తెలియకుండా మాట్లాడొద్దు నాన్న నన్ను నమ్మట్లేదు అన్న మీరు అని మహా బాధపడుతుంది. ఏది ఏమైనా సరే నువ్వు అల్లుడుతో ప్రవర్తించిన తీరు మాత్రం అస్సలు బాగోలేదు. నిన్ను నేను ఇలానే పెంచనా అని ప్రతాప్ అంటాడు. అల్లుడుగారు మీరు మమ్మల్ని క్షమించండి. నన్ను కిడ్నాప్ చేసినట్లే మీ అమ్మాయిని కూడా కిడ్నాప్ చేసి ఉంటారని నేను చాలా టెన్షన్ పడ్డాను. తనమీద అన్ని హక్కులు నాకు ఉన్నాయి. తనని ఎలాగైనా ఒక్కసారి చూడాలని అంత దూరం ఇక్కడికి వచ్చాను. కనీసం కాబోయే భర్త అని మర్యాద కూడా లేకుండా మీ అమ్మ ఈ నన్ను గదిలోకి ఎందుకు వచ్చావు బయటికి వెళ్ళు అని అంటుందని భూషణ్ అంటాడు. ప్రతాప్ మహాదే తప్పు అని అతనికి క్షమాపణ చెప్పిస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మహా సారి చెప్పడంతో భూషణ్ కూల్ అవుతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహా అన్నది మనసులో పెట్టుకోవద్దు బాబుకు చిన్నపిల్ల కదా నేను సాటి చెప్తాను అని భూషణ్తో ప్రతాప్ అంటాడు. మహా మాత్రం ఎప్పుడూ కొట్టని నాన్న వాడి కోసం నన్ను కొట్టాడు అని తెగ బాధ పడిపోతుంది. హారిక ఎంతగా ఓదార్చిన మహా మాత్రం ఫీల్ అవుతూ ఉంటుంది. నన్ను నాకంత తండ్రి చేత కొట్టిచ్చాడు అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని బాధపడుతూ ఉంటుంది. నాకు అసలు వాడు వద్దు. వాడిని నేను పెళ్లి చేసుకోను అని మహా ఫిక్స్ అవుతుంది. ఇది విషయన్ని వెళ్లి ప్రతాప్ తో మాట్లాడాలని అనుకుంటుంది. ప్రతాప్ మహాతో మాట్లాడి సద్ది చెప్పాలని అనుకుంటాడు.. కానీ ఎంత చెప్పినా కూడా మహా మాట వినదు.. ఇక దానికి మహా ఫీల్ అవుతుంది…

Advertisement

నువ్వు ఎంత చెప్పినా సరే వినేది లేదు అతనితోనే నీ పెళ్లి.. ఈ విషయాన్ని మర్చిపోవద్దు మనిషి లాగా కనిపించలేదని ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు.. తీసుకున్న నిర్ణయం నీకు నచ్చడం లేదు అని ప్రతాప్ మహా పై సీరియస్ అవుతాడు. అయితే నీ మనసులో ఎవరైనా ఉన్నారా ఏంటి అని అడుగుతాడు. మాట్లాడుతున్నారు నాన్న నా గురించి మీకు తెలిసే ఇలా మాట్లాడుతున్నారని మహా అంటుంది. ఏం మాట్లాడుతున్నారు మహా గురించి మనమే ఇలా అనుమానం పడతామా అని అంటారు.. ఈ పెళ్లి కచ్చితంగా జరుగుతుంది. ఈ విషయంలో నా నిర్ణయమే ఫైనలని ప్రతాప్ అంటాడు..

ఇక మహా ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఫిక్స్ అవుతుంది. నేను ఈ రాత్రికే ఇంట్లోంచి వెళ్లిపోవాలని చక్రితో అంటుంది.. చక్రి ఆమెకు సాయం చేస్తానని అంటాడు.. మీరు నిజంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా అని చక్రి పదేపదే అడుగుతాడు.. నేను ఫిక్స్ అయిపోయాను నన్ను నేను కాపాడుకోవడానికి ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చాను. నాకు ఒకరు సాయం కావాలి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను మీరు చేస్తారా లేదా అని మహా అడుగుతుంది.. తర్వాత రోజు కులదైవం గుడిలో పూజ చేయించాలని అందరూ వెళ్తారు. చక్రి తో మాట్లాడిన మహా ఎలాగైనా సరే ఇవాళ ఇంట్లోంచి బయటికి వెళ్లి పోవాలని ఫిక్స్ అవుతుంది.

Advertisement

Also Read:శ్రీవల్లి ఎంటర్టైన్మెంట్ మాములుగా లేదు.. విశ్వం దెబ్బకు మైండ్ బ్లాక్..రామారాజుకు టెన్షన్..

అందరూ గుడికి వెళ్లిన తర్వాత అలసిపోయి ఇంటికి వస్తారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత నేను కార్ తో రెడీగా ఉంటాను అని మహాకు ప్లాన్ చెప్తాడు.. ఇవాల్టితో నాకు ఈ బాధ నుంచి విముక్తి కలగాలి అని మహా కూడా అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మహా తన బట్టల్ని సర్దుకొని ఇంట్లోంచి వెళ్లిపోవడానికి రెడీగా ఉంటుంది. బ్యాగ్ సర్దుకొని ఇంట్లోంచి బయటికి వచ్చేస్తుంది.. మహా ఎవరికైనా దొరికిపోతుందా..? లేదా చక్రితో బయటకు వెళ్ళిపోతుందా..? ప్రతాప్ ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×