E-Paper
Advertisement

Podarillu Today Episode : భూషణ్ కు సారీ చెప్పిన మహా.. కన్నీళ్లు పెట్టుకున్న మహా.. పెళ్లి ఆగిపోతుందా..?

Podarillu Today Episode : భూషణ్ కు సారీ చెప్పిన మహా.. కన్నీళ్లు పెట్టుకున్న మహా.. పెళ్లి ఆగిపోతుందా..?
Advertisement

Podarillu Today Episode January 3rd: చక్రి కి ఫోన్ చేస్తే చక్రి ఆ పెళ్లి ఎవరు ఆపుతున్నారు అని తెలుసుకొని పెళ్లి చేసేస్తున్నారు అని అంటాడు. పెళ్ళికొడుకు కిడ్నాప్ అయినట్టు పెళ్లికూతురు కూడా వెళ్ళిపోతే బాగుంటుంది అని వాళ్ళు అంటారు. ఇక రాత్రి చక్రికి భోజనం పెట్టడానికి మహా వస్తుంది. మహా బాధపడుతూ ఉంటే చక్రి చూడలేక పోతాడు.. మీరు ధైర్యం చేసే ఇంట్లోంచి వెళ్లిపోవాలి. మీ డ్రీమ్ ని మీరు సాధించాలి అంటే కచ్చితంగా ఇలా చేయాల్సిందే అని అంటాడు.. ఆ మాటను మహా ఆలోచిస్తుంది… అయినా అతని చెప్పింది ఏం బాగోలేదు నా పెళ్లి ని తప్పించుకోవడం కోసం నేను వెళ్ళిపోతే మా నాన్న పరువు ఏమైపోతుంది అని ఆలోచిస్తుంది.. ఇక ఈ పెళ్లి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని అనుకుంటుంది. మహా భూషణ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా పడుకుంటుంది.. రాత్రంతా మహా కి ఫోన్ చేస్తూనే ఉంటాడు. నా ఫోను నువ్వు తీయ్యవా అని భూషణ్ సీరియస్ అవుతాడు. మహా కోసం ఇంటికి వచ్చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవ్వాలి ఎపిసోడ్ విషయానికి వస్తే.. మహా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని రాత్రంతా కాల్స్ చేసిన భూషణ్ ఉదయం మహని చూడాలి ఖచ్చితంగా మాట్లాడాలి అని హైదరాబాద్ నుంచి యాదగిరి కి వచ్చేస్తాడు. అది చూసిన ప్రతాప్ లలిత ఇద్దరు కూడా అల్లుడు గారికి అమ్మాయి అంటే ఎంత ప్రేమ అని మురిసిపోతుంటారు. మహా మాత్రం ఇలాంటి సైకో గాడిని నేను పెళ్లి చేసుకుంటే జీవితాంతం వాడు చెప్పినట్టు వినాలి అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి భూషణ్ వస్తాడు. నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు. రాత్రి అంత ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని సీరియస్ అవుతాడు..

Advertisement

మహా మాత్రం భూషణ్ పై సీరియస్ అయ్యి నువ్వు ఇక నుంచి వెళ్ళు నాపై నీ అధికారం ఏంటి అని అంటుంది.. ఆ మాట వినగానే భూషణ్ షాక్ అయిపోతాడు.. పైన ఏదో గొడవ జరుగుతుందని అక్కడికి వచ్చిన ప్రతాప్ లలిత ఇద్దరు కూడా మహా ప్రవర్తనతో సీరియస్ అవుతారు. మహాని ఒక్కసారిగా కోపంగా చూసిన భూషణ్ మౌనం గా ఉండిపోతాడు. ఏం మాట్లాడుతున్నావ్ కొంచమైనా నీకు తెలుస్తుందా అని భూషణ్ మహా పై కోప్పడతాడు. మా బెడ్ రూమ్ కి వచ్చినా లలిత ప్రతాప్ ఇద్దరు కూడా మహాది తప్పు అంటూ మాట్లాడుతారు..

అసలు నిజాలు ఏంటో తెలియకుండా మాట్లాడొద్దు నాన్న నన్ను నమ్మట్లేదు అన్న మీరు అని మహా బాధపడుతుంది. ఏది ఏమైనా సరే నువ్వు అల్లుడుతో ప్రవర్తించిన తీరు మాత్రం అస్సలు బాగోలేదు. నిన్ను నేను ఇలానే పెంచనా అని ప్రతాప్ అంటాడు. అల్లుడుగారు మీరు మమ్మల్ని క్షమించండి. నన్ను కిడ్నాప్ చేసినట్లే మీ అమ్మాయిని కూడా కిడ్నాప్ చేసి ఉంటారని నేను చాలా టెన్షన్ పడ్డాను. తనమీద అన్ని హక్కులు నాకు ఉన్నాయి. తనని ఎలాగైనా ఒక్కసారి చూడాలని అంత దూరం ఇక్కడికి వచ్చాను.

Advertisement

కనీసం కాబోయే భర్త అని మర్యాద కూడా లేకుండా మీ అమ్మ ఈ నన్ను గదిలోకి ఎందుకు వచ్చావు బయటికి వెళ్ళు అని అంటుందని భూషణ్ అంటాడు. ప్రతాప్ మహాదే తప్పు అని అతనికి క్షమాపణ చెప్పిస్తుంది. మహా సారీ చెప్పడంతో భూషణ్ ఈగో చల్లబడుతుంది. ఆ తర్వాత మహా వాడి ముందర నన్ను కొట్టాడు అని బాధపడుతుంది. నిన్నకాక మొన్న వచ్చిన వాడి కోసం మా నాన్న నన్ను నమ్మలేదు నన్ను కొట్టాడు నాకు బాధగా ఉంది వదిన అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీ అమ్మాయికి కొంచెం భర్తతో ఎలా ఉండాలో నేర్పించండి. పెళ్లి కాకుండానే నన్ను ఎదిరిస్తుంది పెళ్లయిన తర్వాత నా మాట లెక్క చేస్తుందని భూషణ్ అంటాడు..

Also Read: అవనికి సపోర్ట్ గా అక్షయ్.. ఏకలింగంకు షాకిచ్చిన అక్షయ్.. డ్యూయేట్ సాంగ్ కు అవని, అక్షయ్ డ్యాన్స్..

ఆ తర్వాత మహాని ఎంతగా పిలిచినా సరే మాట్లాడదు. తన భవిష్యత్తు కోసం ఈ పెళ్లి చేస్తున్నాం కానీ ఇలా చేస్తే ఏం చేయాలి అని ప్రతాప్ కూడా అంటాడు. ఇక నిన్న మొన్నటి వరకు ఒకరంటే ఒకరికి ప్రాణం. అలాంటి తండ్రి కూతుళ్ళ మధ్య భూషణ్ చిచ్చుపెట్టేసాడు. అదే తట్టుకోలేక పోతుంది మహా. హారిక మహాని ఎంతగా ఓదార్చాలని చూసిన సరే తను మాత్రం ఎప్పుడు కొట్టని మా నాన్న నన్ను కొట్టాడు అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×