E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ లవ్ స్టోరికి ఫిదా..చక్రిని ఆడుకున్న కన్నా.. మహా కోసం చక్రీ షాకింగ్ నిర్ణయం..? 

Podarillu Today Episode : చక్రీ లవ్ స్టోరికి ఫిదా..చక్రిని ఆడుకున్న కన్నా.. మహా కోసం చక్రీ షాకింగ్ నిర్ణయం..? 
Advertisement

Podarillu Today Episode January 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. మహా రెడీ అయ్యి భోజనం చేసి తర్వాత పడుకోడానికి గది ఉందా అని చక్రి అడుగుతాడు. అయితే చక్రీకి అగది చూపిద్దామని అనుకుంటారు మాధవ్ కేశవ. ఇప్పటికైనా గదిని చూపించరా అని మాధవ్ అడగ్గానే వెళ్లి లోపలికి వెళ్లి చూపిద్దామని అంటాడు.. చక్రిని గదిలోకి వెళ్లి చూపించగానే షాక్ అవుతాడు.. ఆ గదిని చూసి ఏంటి ఇదంతా వామ్మో అని కేకలు పెట్టేస్తాడు. అమ్మాయి అరవాల్సింది.. నువ్వు అరుస్తున్నావ్ ఏంటి రా అని మాధవ అడగ్గానే.. వాళ్ళ నాన్న నువ్వు నా కూతురువే కాదు అని పంపించేశారు.. పుట్టింటి వాళ్ళు దూరమయ్యారని చాలా బాధపడుతుంది. ఇలాంటి టైం లో మనం ఇలాంటివి ఏర్పాటు చేస్తే బాధపడుతుంది.అన్నయ్య అని చక్రి అనగానే నువ్వు చెప్పింది కూడా నిజమేరా అని మాధవ్ అంటాడు.. ఇప్పుడు ముందు ఈ డెకరేషన్ అంతా తీసేద్దాం అమ్మాయి చూస్తే బాధపడుతుంది అని అనగానే చక్రి మాట విని కేశవ మాధవ కలిసి ఆ డెకరేషన్ ని తీసేస్తారు. మొహానికి గదిలో పెట్టి చక్రి కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి పడుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. చక్రి తన లవ్ స్టోరీని ఉన్నదానికన్నా ఎక్కువగానే చెప్తాడు. అందరూ కలిసి నీ లవ్ స్టోరీ లో ఇన్ని ట్విస్టు లు ఉన్నాయా అని అనుకుంటారు.. అయితే అందరూ కలిసి పడుకుందామని అనుకుంటారు. మహా మాత్రం ఈ రూమ్ కి గడియ లేదు అని ఏదైనా జరుగుతుందేమో అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే ఈ గదిలో పడుకోవడం ఎలానో అని భయపడిపోతూ ఉంటుంది. చక్రి సడన్గా తలుపు తీసుకుని లోపలికి రావడంతో మహా షాక్ అవుతుంది..ఇంట్లో నలుగురు మగాళ్లు ఉన్నారు కదా నేను ఎలా ఉంటాను అని మీరు భయపడిపోతున్నారు కదూ అని చక్రి అంటాడు. అదేం లేదండి మీరు ఏమి భయపడకండి మేము మీకు సైనికులు లాగా ఉంటాము అని చక్రి మహాకే ధైర్యం చెప్తాడు. పడుకోగానే ప్రతాప్ అరిచినట్లు వినిపిస్తుంది. మహా ఉలిక్కిపడి లేచి తండ్రి కోసం బాధపడిపోతూ ఉంటుంది.

Advertisement

ఉదయం కన్నా బాత్రూమ్ అర్జెంట్ అని వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ మాధవ్ మాత్రం కన్నని బాత్రూం లోపలికి రానివ్వడు.. ఏమైందన్నా ఎందుకు ఇలా చేస్తున్నావు అని కేశవ అడుగుతాడు.. అప్పుడే అక్కడికి వచ్చినా చక్రి వాడిని వెళ్ళనివ్వచ్చు కదా అన్నయ్య పాపమని అనగానే ఉన్నది ఒకటే వర్షం రా నీటుగా చేశాను ఇప్పుడు వాడిని పంపిస్తే అంత గలీజ్ చేస్తాడు మళ్లీ కడుక్కోవాలి అందుకే వాడిని వెళ్ళనివ్వట్లేదు అని అంటారు.. నా ఎంత నీటుగా ఉందో ఒకసారి వెళ్లి చూసొస్తాను అని చక్రి లోపలికి వెళ్ళిపోతాడు.. వాడు మోసం చేశాడు వాడిని అసలు నమ్మకూడదు అని కేశవ అంటాడు..

ఇక బయటకొచ్చిన తర్వాత కన్నా లోపలికి వెళ్ళిపోతాడు.. ఇంతకీ అమ్మాయి కాఫీ తాగుతుందా టీ తాగుతుందా అని మాధవ్ అడుగుతాడు.. రెండు చేసి పెడతాను ఏది నచ్చితే అది తాగమని చెప్పరా అని అంటాడు. కానీ చక్రి మాత్రం బయటికి వచ్చిన తర్వాత అడిగి ఇవ్వచ్చు లేండి అని అంటాడు. ఇకపోతే మహా స్నానానికనే వస్తుంది.. కేశవ మాత్రం మహాను చూసి సిగ్గు పడిపోతూ ఉంటాడు. మహా స్నానానికి వెళుతుంటే చెప్పలేక చక్రి ఎక్కడున్నాడో వెతుకొని చెప్పాలనుకుంటాడు.. అరేయ్ బాత్రూంలో కన్నా ఉన్నాడు కదా ఆ అమ్మాయి స్నానానికి వెళుతుంది అని అంటాడు..

Advertisement

Also Read :శ్రీవల్లిని ఇరికించిన విశ్వం.. అమూల్య మాటతో విశ్వం కన్నీళ్లు.. ఫన్నీగా ప్రేమ, ధీరజ్ ఫైట్..

ఆ విషయం చెప్పడానికి చక్రి పరిగెత్తుకుంటూ వెళ్తాడు.. ఏమైందండీ అని మహా అడుగుతుంది లోపల కన్నా స్నానం చేస్తున్నట్లు ఉన్నాడు కాసేపు ఆగండి వస్తాడు అని చక్రి అంటాడు.. వాడు అలా వెళ్తాడనే రా నేను వద్దని చెప్పాను ఇప్పుడు చూడరా ఏమైందో అని అంటాడు.. అరె కన్నా మహాలక్ష్మి స్నానం చేయాలంట లోపలికి రారా అనేసి అనగానే.. కన్నా స్నానం చేసేవాడు కూడా సగంలో బయటకు వచ్చేస్తాడు. ఏం పర్లేదు స్నానం చేసి రా అని అన్న కూడా పర్లేదు వదిన నేను పెరట్లో చేస్తాను మీరు లోపల చేయండి అని అంటాడు.. మహా స్నానానికి వెళుతుంది. నారాయణ తన ఇంటికి గొప్పింటి కోడలు వచ్చిందంటూ చంకల గుద్దుకుంటూ అందరితో చెబుతూ ఉంటాడు. అది చూసిన రమణయ్య ఓర్వలేక మాటకు మాట సమాధానం చెప్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×