// // Podarillu Today Episode : నారాయణకు నిజం చెప్పిన మాధవ్.. ప్రతాప్ ఇంట్లో బాంబ్ -->
E-Paper
Advertisement

Podarillu Today Episode : నారాయణకు నిజం చెప్పిన మాధవ్.. ప్రతాప్ ఇంట్లో బాంబ్ పేల్చిన భూషణ్..చక్రీని రౌడీలు చంపేస్తారా..?

Podarillu Today Episode : నారాయణకు నిజం చెప్పిన మాధవ్.. ప్రతాప్ ఇంట్లో బాంబ్ పేల్చిన భూషణ్..చక్రీని రౌడీలు చంపేస్తారా..?
Advertisement

Podarillu Today Episode January 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. మహా ఇంట్లో నుంచి అయితే వచ్చేసాను కానీ ఎటువంటి ఐడి ప్రూఫ్ లు తీసుకురాకుండా వచ్చాను.. నేనిప్పుడూ బయటకి వెళ్తే ఎక్కడ ఉండాలి అని మహా తెగ బాధ పడిపోతూ ఉంటుంది.. అయితే చక్రి మాత్రం మహాని ఎలాగైనా సరే తన ఇంటికి తీసుకుని వెళ్లాలని అనుకుంటాడు.. చక్రి దగ్గర ఆధార్ కార్డు ఉండడం చూసి ఇది నేను ఇస్తే నాతో పాటు మహాలక్ష్మి రాదు అని అనుకుంటాడు.. ఇక ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మహాలక్ష్మిని మా ఇంటికి తీసుకుని వెళ్లాలి అని చక్రి ఫిక్స్ అవుతాడు.. మీరు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. మా ఇంటికి వెళ్దాం ఒకవేళ పోలీసులు మనకు పెళ్లయిందని అనుకుంటున్నారు కదా.. అక్కడికి వచ్చి వెతికితే బాగోదు కదా అని అంటాడు. ఇక మహా చక్రితో వెళ్లడానికి ఒప్పుకుంటుంది..

కన్నా చక్రీ పెళ్లి చేసుకున్నాడానికి చాలా సంతోషంగా ఉంటాడు. ఎలాగైనా సరే అన్నయ్యకి పెళ్లి అయిపోయింది కాబట్టి ఇంటికి వదినమ్మ వస్తుంది అని చాలా సంతోషంగా ఉంటాడు.. వదిన రాబోతుంది అని కేశవ కూడా చాలా సంతోషంగా ఉంటాడు.. వీరిద్దరూ కలిసి ఎలాగైనా సరే వదిన వస్తుంది కదా ఇంటిని మొత్తం మార్చేయాలి అని అనుకుంటారు. అయితే మాధవ్ కూడా షాక్ అయ్యేలా ఇంటిని మొత్తాన్ని మారుస్తారు.. మన పాత ఇంటిని కొత్తగా కనిపించేలా చేయాలని అంతా సిద్ధం చేస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇంటికి మొత్తం లైట్లు వేసి సెటప్ ని పూర్తిగా మార్చేస్తారు. అంతే కాదు డీజే కూడా పెట్టి మా ఇంటికి ఆడ దిక్కు వచ్చింది అని చెప్పాలని అనుకుంటారు.. ఇక అది చూసిన మాధవ్ ఏంట్రా ఇదంతా ఏంటి మీ హంగామా అని అంటాడు.. వదిన వస్తుంది కదా అన్నయ్య ఈ మాత్రం చేయకపోతే భయపడిపోతుంది కదా అందుకే ఇలాంటివి చేస్తున్నాము అని అంటారు.. ఇక అక్కడున్న మందు బాటిల్ అన్ని తీసేయాలని కన్నా అనుకుంటారు.. అయితే బషీర్ భాయ్ నేను ఆ వాటిని తీసేస్తాను అని అంటాడు.. అప్పుడే బయటి నుంచి వచ్చిన నారాయణ నేనేంటి పొరపాటున తాగకుండానే పక్కింటికి వచ్చేసానా ఏంటి అని అనుకుంటారు. బషీర్ మాత్రం ఇది మీ ఇళ్లే ఒకసారి చూడండి అని అంటాడు.. అవును మా ఇళ్లే అయితే ఏంటి ఇలా మారిపోయింది అని నారాయణ అడుగుతాడు..

నారాయణ ఏంటి ఇదంతా నేను పోయిన తర్వాత చేయాల్సింది బతికుండగలే చేస్తున్నారేంటి అని అడుగుతాడు. అయితే ఈ విశేషం ముందు నాన్న చిన్నోడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది అని మాధవ్ ని నారాయణ అడుగుతాడు. అవునన్నా నువ్వు విన్నది నిజమే వాడు ఒక గొప్ప అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాడు ఈ ఊర్లో ఉన్న అమ్మాయినైతే కచ్చితంగా చేసుకొని ఉండడు పక్కూర్లో అమ్మాయినే చేసుకుని ఉంటాడు అని నారాయణ అనుకుంటాడు.. చక్రి మహనీ తన ఇంటి గురించి గొప్పగా చెప్పినట్లు ఊహించుకుంటాడు. మా ఇంటి గురించి ఎన్నెన్నో గొప్పలు చెప్పాను. ఇంటిని చూస్తే ఖచ్చితంగా భయపడుతుందేమో అని చక్రి అనుకుంటాడు. మీ ఇల్లు కాశీలో ఉందా ఏంటి ఇంకా రాలేదు అని అడుగుతుంది.

Advertisement

భూషణ్ ప్రతాప్ ఇంటికి రాగానే ఇంట్లోని వాళ్ళందరూ కూడా మహా రాలేదేంటి అని అడుగుతారు. మహా రాలేదు ఎందుకండి వేరే కార్లో వస్తుందా ఏంటి అని లలిత అడుగుతుంది. బయట ఉన్న నీళ్ళని తన మీద పోసుకున్న ప్రతాప్ నా ఇంట్లో ఒకరు చనిపోతే నేను దర్పణం వదలాలి కదా అందుకే స్నానం చేసి వచ్చాను అని అంటాడు. ఏం మాట్లాడుతున్నారండి అమ్మ ఎక్కడ పెళ్లి వదిలేసి వెళ్లిపోయింది అంటే మాకు ఎంత అవమానం అని భూషణ్ వాళ్ళ తల్లిదండ్రులు అవమానించేలా మాట్లాడుతారు. దారుణంగా అవమానించేలా మహనీ ప్రతాప్ ని మాట్లాడతారు. అయితే భూషణ్ మహా డ్రైవర్ ని పెళ్లి చేసుకున్న విషయాన్ని అందరికీ చూపిస్తాడు. అది చూసిన హారిక ఎమోషనల్ అవుతుంది.

ఇక భూషణ్ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత దారుణంగా మాట్లాడతారో అన్నది చెప్పనక్కర్లేదు. హారిక వల్ల తల్లిదండ్రులు మధ్యలో కలగజేసుకొని ఎంతగా మాట్లాడుతున్న సరే భూషణ్ వాళ్ళ పేరెంట్స్ మాత్రం అసలు ఆగకుండా దారుణంగా అవమానిస్తారు. హారిక మాత్రం మీకు నష్టం జరిగిందో కష్టం జరిగిందో కానీ ఇకనుంచి మీరు వెళ్లిపోండి అని అంటుంది. ఇక కన్నా వాళ్ళందరూ డాన్స్ వేయడం చూసిన తాయారు వీళ్ళు ఏంటి ఏం ఫంక్షన్ జరుగుతుంది.? దెయ్యాలు తిరిగే కొంపలో ఫంక్షన్లు ఏముంటాయి అని తాయారు అనుకుంటుంది.. పక్కనే ఉన్న గాయత్రిని వెళ్లి కనుక్కో రమ్మని చెప్పగానే కన్నా మాధవ్ పెళ్లయినట్లు చెప్తాడు. అది విన్న గాయత్రి ఎమోషనల్ అవుతుంది.

Also Read :పల్లవి పై అవనికి అవమానం..పల్లవి ప్లాన్ సక్సెస్.. నడుం విరగొట్టిన భానుమతి..

అయితే ఆ తర్వాత నిజం తెలుసుకొని సంతోషపడుతుంది. చక్రీకి హారతి ఇవ్వడానికి ఒక ఆడ మనిషి కావాలని మాధవ అనగానే ఆ హారతేదో నేనిస్తానని అంటుంది.. ఇక లలిత మాత్రం బాధపడిపోతూ ఉంటుంది. తన కూతురు తనని మోసం చేసింది అని అనుకుంటూ ప్రతాప్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆది ఇంకా రాలేదని హారిక టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక మహా చక్రి ఇద్దరు కూడా బృందావనంలోకి అడుగుపెట్టడానికి వచ్చేస్తారు.. కార్ లోంచి బయటకు రాగానే అందరూ కూడా మహాని చూస్తూ ఉండిపోతారు. తాయారు ఇంత గొప్పింటి అమ్మాయి ఇంటిని చూస్తే లోపలికి రాదు అని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో మహా చక్రిని చూసి మాధవ్ వాళ్లు చాలా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×