E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మహాకు అండగా నిలిచిన చక్రీ.. శోభనానికి గ్రాండ్ గా ఏర్పాట్లు..

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మహాకు అండగా నిలిచిన చక్రీ.. శోభనానికి గ్రాండ్ గా ఏర్పాట్లు..
Advertisement

Podarillu Today Episode January 17th: నిన్నటి ఎపిసోడ్ లో..  పెళ్లి జరిగిందో లేదో చూడాలని లోపలికి వస్తాడు భూషణ్. ఆ తర్వాత చక్రి మహా ఒకచోట కూర్చుని ఉంటారు. మహా తో పెళ్లయిందని చక్రి చాలా సంతోషంగా ఉంటాడు. అయితే పోలీసులు మ్యారేజ్ సర్టిఫికెట్ దగ్గర సంతకం కావాలని మహా దగ్గరికి చక్రీన్ పంపిస్తాడు. మనకు మ్యారేజ్ అయినట్టు సర్టిఫికెట్ మీద సంతకం పెట్టాలంట అండి లేకపోతే  నేను మిమ్మల్ని కిడ్నాప్ చేశారని అనుకుంటారు. ఆ మాట చెప్పగానే మహా సంతకం పెడుతుంది. ఇక ఆ తర్వాత ఫోటో దిగాలని చక్రి చెప్పగానే మహా ఇష్టం లేకపోయినా సరే ఫోటో దిగుతుంది..

మాధవ్ కన్నా  చక్రి ఫోన్ కలవట్లేదని టెన్షన్ పడిపోతూ ఉంటారు.. చక్రి మహాను తీసుకొని తన ఇంటికి వెళ్ళబోతాడు. మాదవ్ చక్రి ఎక్కడున్నాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. వీడు ఫోన్ ఎత్తలేదు ఎవరో అమ్మాయిని లేపుకొని వెళ్ళాడంట వాళ్ళు ఏం చేస్తారో ఏంటో నాకు కంగారుగా ఉందిరా అని భయపడిపోతూ ఉంటాడు.. కానీ మాధవ్ కన్నా ఇద్దరూ చక్రికి ఫోన్ చేసి ఎక్కడున్నారో తెలుసుకోవాలని అనుకుంటారు..

Advertisement

కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదు అని ఇద్దరు కూడా ఏం జరిగిందని కంగారు పడిపోతుంటారు. అయితే కేశవ మాత్రం మీరు ఎందుకు కంగారు పడిపోతున్నారు అమ్మాయినే కదా తీసుకెళ్లింది పెళ్లయిందని చెప్పారు కదా ఇంకెందుకు మీరు కంగారు పడిపోతున్నారు అని అంటాడు.. పోలీసులకు ఫోన్ చేసి పెళ్లయిందని చెప్పగానే మాధవ్ భయపడిపోతూ ఉంటాడు… వీడు ఎక్కడున్నాడు అని వీళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చక్రి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని చాలా సంతోషంగా ఉంటాడు.. ఎక్కడ అమ్మాయి ఎక్కడ నేను కానీ ఒక్కసారి నా కారులో ఎక్కింది. ఆ తర్వాత నా జీవితంలోకి అడుగు పెట్టింది. నేను ఈ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటాడు. మహా ఇకనుంచి బయటపడి ఎలాగైనా సరే తను అనుకున్న ప్రాజెక్ట్ నీ పూర్తి చేయాలని అనుకుంటుంది. అయితే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి మహా ఎక్కడున్నావని అడుగుతుంది.. అతను నేను బెంగళూరుకి షిఫ్ట్ అయిపోతున్నాను ఇక్కడ ఉండట్లేదు అని చెప్పగానే మహా షాక్ అవుతుంది..

Advertisement

అదేంట్రా సడన్ గా ఇలా చేశావు అని మహా అడుగుతుంది.. అయితే నాకు కాబోయే భార్య బెంగుళూరులోనే ఉంది అందుకే నేను కూడా అక్కడికి షిఫ్ట్ అయిపోతున్నాను అని అతను అంటాడు.. నీకు పెళ్లి అయిపోతుంది కదా నువ్వు కూడా ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వచ్చు లే అని అతను అంటాడు. కానీ మహా మాత్రం తన ఇంట్లో ఉంచి వచ్చేసిన విషయాన్ని అతనితో చెప్తుంది.. నేను ఎక్కడైనా హాస్టల్లో ఉండి నా ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నాను.. నాకు నీ హెల్ప్ కావాలి ఎక్కడైనా ఉండడానికి పీజీ చూసి పెట్టవా అని అడుగుతుంది..

నీకు ఫీజులో ఉండాల్సిన అవసరం ఏంటి మీ నాన్న అడిగితే నీకోసం ఒక బిల్డింగ్ ని కట్టిస్తాడు కదా అని మహాతో తన ఫ్రెండ్ అంటాడు.. కానీ మహా మాత్రం లేదురా కొన్ని పరిస్థితుల వల్ల నేను బయటకు వచ్చాను అని అంటుంది.. ఎలాగైనా సరే పీజీలో వేకెన్సీ చూపించవా అని అడుగుతుంది. అతను ఐడి ప్రూఫ్ కావాలని అడగ్గానే నేను ఏ ఐడి ప్రూఫ్ తీసుకురాలేదు అని మహా అంటుంది.. ఇలాగైతే కష్టమని అతను అనగానే చక్రితో ఆ విషయాన్ని మహా చెప్తుంది.. ఎక్కడైనా పీజీలో ఉండాలంటే ఐడి ప్రూఫ్ కచ్చితంగా ఉండాలట కానీ నేను నాతో ఎటువంటి ఐడి లను తీసుకురాలేదు అని అంటుంది.

Also Read : రోహిణికి కొత్త టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన సుమతి.. ప్రభావతికి దిమ్మతిరిగే కౌంటర్..

చక్రి దగ్గర ఆధార్ కార్డు ఉండడం చూసి ఇది నేను ఇస్తే నాతో పాటు మహాలక్ష్మి రాదు అని అనుకుంటాడు.. ఇక ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మహాలక్ష్మిని మా ఇంటికి తీసుకుని వెళ్లాలి అని చక్రి ఫిక్స్ అవుతాడు.. మీరు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. మా ఇంటికి వెళ్దాం ఒకవేళ పోలీసులు మనకు పెళ్లయిందని అనుకుంటున్నారు కదా.. అక్కడికి వచ్చి వెతికితే బాగోదు కదా అని అంటాడు. ఇక మహా చక్రితో వెళ్లడానికి ఒప్పుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×