E-Paper
Advertisement

Podarillu Today Episode : సర్టిఫికెట్స్ కోసం ఇంట్లోకి అడుగుపెట్టిన మహా.. ప్రతాప్ మాటతో షాక్..చక్రీ షాక్..

Podarillu Today Episode : సర్టిఫికెట్స్ కోసం ఇంట్లోకి అడుగుపెట్టిన మహా.. ప్రతాప్ మాటతో షాక్..చక్రీ షాక్..
Advertisement

Podarillu Today Episode February 22nd: నిన్నటి ఎపిసోడ్ లో.. కన్నా ని తీసుకొని మహాలక్ష్మి తన పుట్టింటికి వెళ్తుంది.. అయితే అక్కడ కన్నా ని లలిత దారుణంగా అవమానిస్తుంది. కానీ కన్న మాత్రం ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు. లోపలికి వెళ్ళిన మహాలక్ష్మి అక్కడ ప్రతాప్ ఆది కూడా ఉండడంతో షాక్ అవుతుంది.. మహాలక్ష్మి తన తండ్రికి తన గురించి చెప్పాలని అనుకుంటుంది.. కానీ వాళ్లు మాత్రం అసలు మాట్లాడకుండా మౌనంగా ఉంటారు.. నేను ఏ తప్పు చేయలేదు నాన్న ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను.. నాకు జాబ్ చేయాలని ఉంది. కానీ మీరు సడన్ గా పెళ్లి అనే లోపల నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే ఇంట్లోంచి వెళ్లిపోయాను అని మహాలక్ష్మి అంటుంది.

చక్రి మాత్రం మహాలక్ష్మి తిరిగి వస్తుందా లేదా అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. కేశవ దగ్గరికి వెళ్లి టెన్షన్ పడిపోతూ ఉండగా కేశవా సెటర్లు వేయడంతో అక్కడి నుంచి వచ్చేస్తాడు.. మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా మళ్లీ తిరిగి వస్తుందా లేదా అని నాకు టెన్షన్ గా ఉంది అన్నయ్య అని చక్రి బాధపడిపోతూ ఉంటాడు. రావాలి అని దేవుడు రాసిపెట్టి ఉంటే కచ్చితంగా వస్తుంది అని మాధవ్ అంటాడు. ఆ మాట వినగానే చక్రీ బాధ పడిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. కన్నా మహాలక్ష్మి ఇద్దరు కూడా తన పుట్టింటికి వెళ్తారు.. ముందుగా కన్నా ఆ ఇంటిని చూసి షాక్ అవుతాడు.. ఇంత పెద్ద ఇంట్లో ఉన్న మీరు మా ఇంటికి వచ్చారా? చాలా ఆశ్చర్యంగా ఉంది వదిన అని కర్ణ అంటాడు. నేను ఇంట్లోకి తీసుకెళ్లడానికి కూడా ఇబ్బంది పడవచ్చు నువ్వైతే ఏమి ఫీల్ అవ్వద్దు అని మహా కన్నాతో అంటుంది. పర్లేదు వదిన నేను ఏమి ఫీల్ అవ్వనులెండి మీరు వెళ్లి ని సర్టిఫికెట్లు తెచ్చుకోండి అని కన్నా కూడా మా మహాతో అంటాడు. ఇతరు లోపలికి వెళ్ళగానే లలిత అతన్ని బయటకు వెళ్ళమని చెప్పు అని అంటుంది.. ఇక హారికను వెళ్లి హగ్ చేసుకున్న మహా బాధపడుతూ ఉంటుంది..

ఇక లలిత మహాలక్ష్మిని లోపలికి రమ్మని తీసుకుని వెళుతుంది.. లోపలికి వెళ్లగానే అక్కడ ప్రతాప్ ఆది ఉండటం చూసి షాక్ అవుతుంది.. నాన్న నేను ఏ తప్పు చేయలేదు నాన్న మీకు ఎంతగా చెప్పాలని చూసినా మీరు నా మాట వినడం లేదు.. ఎవరో ఏదో అన్నారని మీరు నన్ను దూరం పెట్టేస్తున్నారు అని మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అనుకుని పరిస్థితిలో ఆ పెళ్లి చేసుకున్నాను తప్ప నేను ఇష్టపడి చేసుకోలేదని మహా నిజం చెప్పేస్తుంది.. ఆ మాట వినగానే ప్రతాప్ కాస్త కరిగినట్లు కనిపిస్తాడు.. నువ్వు ఇప్పటికే నా పరువు తీసేసావు నన్ను దాదాపు చంపేసావు అని కఠినంగా మాట్లాడతాడు ప్రతాప్..

Advertisement

ఆది కూడా మహాలక్ష్మిని బాధపెట్టేలా మాట్లాడుతాడు.. కానీ మహాలక్ష్మి మాత్రం నన్ను అర్థం చేసుకుంటే చాలు అని అంటుంది.. నేను ఇప్పుడు వచ్చింది కేవలం సర్టిఫికెట్ల కోసమే.. నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఎన్నిసార్లు చెప్పినా.. మీరు వినకుండా మీ ఇష్టం వచ్చినట్లు పెళ్లి సంబంధాన్ని ఫిక్స్ చేశారు.. అతను నాకు కరెక్ట్ కాదని ఎంత చెప్పినా నా మీద లేనిపోని నిందలు వేసి నన్ను చాలా అవమానించారు. చిన్నప్పుడు నుంచి నేను చూసింది వీళ్ళనేనా అన్న ఫీలింగ్ కూడా నాకు కలిగింది. మీరు నన్ను అంతగా అవమానించడంతో నేను ఇంట్లోంచి వెళ్లిపోయాను తప్ప ఎవరిని ప్రేమించలేదు అని మహాలక్ష్మి నిజం చెప్తుంది. ఆ మాట విన్నా ప్రతాప్ ఇదిగో సర్టిఫికెట్లు ఉండాలనుకుంటే ఉండు లేదంటే వెళ్ళిపో అని అంటాడు.

Also Read : పల్లవి గుట్టు రట్టు..రాజేశ్వరికి అక్షయ్ వార్నింగ్.. జైలు నుంచి చక్రధర్ రిలీజ్..

ఏంటి నాన్న మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారా..? మీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు అలాంటిది మీరు నన్ను ఇలా మాట్లాడటం నేను అసలు ఊహించలేకపోతున్నాను అని మహాలక్ష్మి అంటుంది. ఆ పెళ్లి క్యాన్సిల్ చేసి నీకు వేరే పెళ్లి చేస్తాము నువ్వు మా మాట విని ఇక్కడే ఉండాలి. లేదంటే మాత్రం సర్టిఫికెట్లు కూడా నీకు దక్కవు అని మా ప్రతాప్ డెడ్లైన్ విధిస్తాడు. అంతేకాదు బయట ఉన్న కన్నా ని కట్టేసి అతని కొట్టడానికి ప్రయత్నిస్తారు. నీకు ఈ సర్టిఫికెట్లు కావాలి అంటే ఇక్కడే నువ్వు ఉండాలి. లేదంటే మాత్రం నువ్వు వెళ్ళిపో అని నిర్మొహమాటంగా ప్రతాప్ చెప్పేస్తాడు.. అక్కడితో ప్రోమో ఎండ్అవుతుంది. మరి మహాలక్ష్మి సర్టిఫికెట్ల కోసం అక్కడే ఉండి పోతుందా? కన్నా ని తీసుకొని మళ్ళీ చక్రీ దగ్గరికి వచ్చేస్తుందా అన్నది సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×