E-Paper
Advertisement

Podarillu Today Episode : మహాను నమ్మించి మోసం చేసిన చక్రీ.. చక్రీ, మహా రిసెప్షన్ కు ఏర్పాట్లు..షాక్ లో మహా..

Podarillu Today Episode : మహాను నమ్మించి మోసం చేసిన చక్రీ.. చక్రీ, మహా రిసెప్షన్ కు ఏర్పాట్లు..షాక్ లో మహా..
Advertisement

Podarillu Today Episode February 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. చక్రి మీకు ఏదో సాయం చేయాలనిపించింది చేశాను అని అంటాడు. మహా చక్రిని పొగడ్తలతో ముంచేత్తుతుంది. మీలాంటి మంచి మనిషి నాకు దొరకడం చాలా అదృష్టం అని అంటుంది. అది సరే కానీ మీరు ఎవరిని ప్రేమించలేదా అని మహా అడుగుతుంది. నేను ఎవరిని ప్రేమించలేదండి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న షాక్ ఇచ్చాడు అని చక్రి అంటాడు.. మీకు ఇప్పుడు లవ్ స్టోరీలు ఏమీ లేవా అని అడిగితే ఒక అమ్మాయితో మొదలైంది అని అనగానే ఆ అమ్మాయి మీకు కచ్చితంగా దక్కుతుంది అని మహా అంటుంది. ఇక ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. పోలీసులు మహని వివరాలు అడిగి తెలుసుకుంటారు.. కానిస్టేబుల్ చక్రిని మహాని బాగా చూసుకోవట్లేదా ఏంటి అమ్మాయి ఎలా ఉంది అని అడుగుతారు. నేను చాలా బాగా అమ్మాయిని చూసుకుంటున్నానండి. మా ఇంట్లో ఎలా ఉన్నానో అక్కడ అలా ఉన్నాను నన్ను ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు అని మహా కూడా అంటుంది. ఆ తర్వాత మహా మీరు మీ ఇంట్లో వాళ్లకి భయపడి ఎక్కడికో పారిపోయి ఉంటారు అని అనుకున్నాను కానీ ఇక్కడే ఉన్నారు ఎవరు ఏమి చేయలేదు కదా అని పోలీసులు అడుగుతారు.. మా నాన్నకి సీరియస్ గా ఉంది అందుకే వచ్చాము అని మహా అంటుంది.. పోలీసులు మ్యారేజ్ సర్టిఫికెట్ గురించి చెప్పగానే మహా షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే…మ్యారేజ్ సర్టిఫికెట్ అంటే మనల్ని ఇంకా పెళ్లయినట్లే కదా అర్థం అని మహా అంటుంది. మీరు నన్ను అనుమానిస్తున్నారు నాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదు అని చక్రి అంటాడు. ఇప్పుడు మనం ఇక్కడ గొడవ పడితే పోలీసులు అనుమానం వచ్చి మీ నాన్న వాళ్ళని పిలిచి మళ్లీ నిన్ను తీసుకెళ్లిపోతారని చక్రి అంటాడు.. సర్టిఫికెట్ ఏదో తీసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని చక్రి అనగానే మహా సరే అంటుంది.. ఇక పోలీసులకు ఏదో ఒకటి చెప్పి మహా చక్రి ఇద్దరు కూడా బయటకు వెళ్లాలని అనుకుంటారు.. అక్కడ సర్టిఫికెట్ తీసుకున్న వాళ్లు బయటకి రాగానే మహా నాకు మీ మీద చాలా అనుమానంగా ఉంది అని అడుగుతుంది..

Advertisement

నాకు తెలిసి నేనెప్పుడూ సంతకాలు పెట్టలేదు కానీ మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలి అంటే సంతకాలు పెట్టాలి కదా మరి ఎలా పెట్టానో అని అడుగుతుంది మహా.. పోలీసులు మనకి మ్యారేజ్ అయినట్లు సంతకం పెట్టమని అడిగారు అప్పుడు మీరు సంతకం పెట్టారు నేను కూడా అప్పుడే సంతకం పెట్టాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని చక్రి అంటాడు.. ఇక చక్రి మహా ఇప్పుడు మనకి సర్టిఫికెట్ మాత్రమే వచ్చింది మనం నిజంగానే మొగుడు పెళ్ళాం కాదు కదా అని ఫిక్స్ అయ్యి అక్కడ నుంచి వచ్చేస్తారు.

ఆ తర్వాత బయటికి రాగానే మహా మనం ఇప్పుడు ఇంటికి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒకటి అనుకుంటారేమో అని భయపడుతూ ఉంటుంది. ఇందాకే కదా మా అన్నయ్య చూస్తే మీ నాన్న లాగా అనిపిస్తున్నారు అని అన్నారు.. అక్కడే ఉంటూ మీ గోళ్లు మీరు రీచ్ ఎలా చేసుకోండి అని చక్రి సలహా ఇస్తాడు. మీరు ఎంత మంచి వారు తెలుసా అండి మీకు తెలియట్లేదు కానీ మీరు చాలా మంచి వాళ్ళు అని చక్రితో మహా అంటుంది.. అసలు ఇదంతా నిజమే అని తెలిస్తే చచ్చిపోతుందేమో అని కంగారు పడిపోతూ ఉంటాడు చక్రి.. ఆ తర్వాత ఇంటికి వెళ్దామని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు.. అయితే రోడ్లో మహా చక్రిల రిసెప్షన్ అని బ్యానర్ కట్టి ఉండటం చూసి షాక్ అవుతారు. ఏంటండీ మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు మనిద్దరికీ పెళ్లి అయిందని ఊరంతా చెప్పాలనుకుంటున్నారా ఏంటి అని మహా చక్రిపై సీరియస్ అవుతుంది.. నేను మా వాళ్ళకి ఇలా చేయమని చెప్పానా ఏంటి? నేను కూడా మీతోనే ఉన్నాను కదా అని చక్రి అంటాడు.. కానీ మీ వాళ్ళకి నిజం చెప్పండి లేకపోతే ఈ ఊర్లో వాళ్ళందరూ కూడా మనిద్దరికీ పెళ్లి అయిందని అనుకుంటారు అని మహా అంటుంది..

Advertisement

Also Read :రాజేంద్రను తోసేసిన పల్లవి..పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్..రాజేంద్ర పరిస్థితి ఎలా ఉందంటే..?

మహా కి ఏదో ఒకటి చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు చక్రి.. అయితే అక్కడికి వెళ్ళగానే నారాయణ చాలా సంతోషంగా పెళ్లి కొడుకు గెటప్ లో బట్టలు వేసుకొని తీన్మార్ డాన్స్ వేస్తాడు. కానీ మహా మాత్రం ఇదంతా చూసి ఏదో అని కొత్తగా ఉంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మహా చక్రిలకు మాధవ్ బట్టలు ఇచ్చి వెళ్లి కట్టుకొని రమ్మని చెప్తాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×