E-Paper
Advertisement

Podarillu Today Episode : కొత్త హీరోయిన్ వచ్చేసిందోచ్.. బాధపడ్డ చక్రీ.. ప్రతాప్ మాటతో మహా కన్నీళ్లు..

Podarillu Today Episode : కొత్త హీరోయిన్ వచ్చేసిందోచ్.. బాధపడ్డ చక్రీ.. ప్రతాప్ మాటతో మహా కన్నీళ్లు..
Advertisement

Podarillu Today Episode February 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. చక్రి కారేశ్వర్ దగ్గరికి వెళ్లి తన జాబ్ గురించి మాట్లాడుతాడు.. అతను మాత్రం నీకు జాబ్ లేదు ఏమీ లేదు వెళ్లిపో అని అంటాడు. చక్రి ఎంతగా బ్రతిమలాడినా సరే నీకు జాబ్ ఇవ్వను ఇకనుంచి వెళ్ళిపో అని అంటాడు. దాంతో చక్రి షాక్ అవుతాడు. అతని ఎంతగా కన్వెజ్ చేయాలని చూసినా కూడా నీకు జాబ్ ఇవ్వను అని గట్టిగా తేల్చి చెప్పేస్తాడు. ఆ మాట వినగానే చక్రి బాధ పడిపోతాడు. నువ్వు బాగానే చేస్తావు ఒక అమ్మాయిని లేపుకొచ్చావు వాళ్లు నా తాట తీసి చేతిలో పెట్టారు. నువ్వు అమ్మాయి బాగానే ఉన్నారు కానీ నాకు మాత్రం ఇక్కడ పగిలిపోయింది అని కాలేశ్వరరావు అంటాడు. ఒక అమ్మాయిని లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాను కానీ ఇక మళ్ళీ మళ్ళీ చేసుకొని ఓపిక నాకు లేదు అని చక్రి ఎంత చెప్పినా సరే అతను మాత్రం నీకు ఇక్కడ ఉద్యోగం లేదు వెళ్ళిపో అని గట్టిగా చెప్తాడు.. కారేశ్వర రావు మాత్రం కాస్త కరిగినట్లు అనిపిస్తాడు. చక్రి ఎవరినైనా మాయ చేసి తన బుట్టలో వేసుకోగలడు. అయితే అక్కడున్న పని వాళ్ళందరూ కూడా చక్రి బాధను చూసి అతని మల్లి పనిలో పెట్టుకోని బ్రతిమిలాడుతారు. మరి అతను చక్రిని జాబ్ లో పెట్టుకుంటాడా? లేదంటే ఉద్యోగం నుంచి తీసేస్తాడా అన్నది తెలియాలంటే మరికొన్ని ఎపిసోడ్లు చూడాల్సిందే. మహా దెబ్బతో కేశవ ఇంట్లోంచి పారిపోతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. మహాలక్ష్మికి కన్నా బాగా దగ్గరవుతాడు.. నిజంగానే తను చక్రికి భార్యని ఫీల్ అవుతాడు.. ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ అయిపోతారు కూడా.. అయితే భోజనం చేద్దామని చెప్పగానే కేశవ ఇంటికొచ్చి మహాని అరిచిన విషయాని గుర్తు చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మహాలక్ష్మి కన్నాతో కూర్చుని మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంటుంది.. నారాయణ మాత్రం వీరిద్దరిని చూసి సంతోషంగా ఉంటాడు. ఇక నీ దగ్గర గంప కొడుతుంది నువ్వు ఏమి మాట్లాడద్దు అని కన్నా అంటాడు. అయితే నారాయణ మీ అన్నయ్యకి చికెన్ షాప్ లో మటన్ షాపులు బంద్ అయ్యాయని ఎవరైనా చెప్పారా? తోటకూర బచ్చలు కూర అంటూ ఆకుకూరలు మేకలకు పెట్టినట్లు పెట్టాడు అని నారాయణ అంటాడు.

Advertisement

ఆ మాట వినగానే కన్నా కాస్త కోపంతో ఉంటాడు. మహాలక్ష్మి మాత్రం ఏంటి మీ నాన్న అలా మాట్లాడుతున్నాడు. పెద్ది అందరికోసం ఎంతో కష్టపడుతున్నాడు కదా మీరు ఆయన్ని కనీసం గుర్తించడం లేదు అని ఫీల్ అవుతుంది.. ఆయన పనికి వెళ్లడమే కాదు మీ నలుగురికి కావాల్సిన అవసరాలనే దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. ఆయన ఓపికకి మెచ్చుకోవాల్సిందే అని మహాలక్ష్మి అంటుంది.. అవును వదిన మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు చిన్నప్పుడే చనిపోయింది. అమ్మానాన్న అన్ని అయి చూసుకున్నాడు.. మా అన్నయ్యకి పెళ్లి అవుతుందని అనుకున్నాము. కానీ కొందరు మా ఇంటి గురించి లేనిపోనివి చెప్పి మా అన్నకు పెళ్లిని క్యాన్సిల్ చేస్తూ వస్తున్నారు అని కన్నా అంటాడు.

మీరే ఏమి ఫీల్ అవ్వకండి. పెద్ది చాలా మంచి వ్యక్తి కాబట్టి మంచి అమ్మాయి ఆయనకు భార్యగా వస్తుంది అని మహా అంటుంది.. మరి ఆ గాయత్రీ ని పెళ్లి చేసుకోవచ్చు కదా అని మహాలక్ష్మి అడుగుతుంది.. మా ఇంటికి వాళ్ళింటికి పడదు వాళ్ళమ్మ మమ్మల్ని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. వీళ్లిద్దరూ ధైర్యం చేయరు ఇక ఎన్ని రోజులు ఇలానే పెళ్లి లేకుండా ఉంటారో అర్థం కావడం లేదు అని కన్నా అంటాడు.. వాళ్ళిద్దర్నీ మనమే దగ్గర చేద్దాం.. మీ అన్నయ్య సంతోషంగా ఉంటే అందరం కూడా సంతోషంగా ఉంటాం కదా అని మహాలక్ష్మి అంటుంది.. నువ్వు చెప్పింది కూడా సూపర్ ఐడియా వదిన మనం ఎలాగైనా సరే గాయత్రికి, అన్నయ్యకు పెళ్లి చేద్దాం అని కన్నా అంటాడు.

Advertisement

Also Read :లేడీ యాంకర్స్ తో ఇబ్బంది పడ్డాను..ఆ ఒక్కటే బాధేస్తుంది… రవి ఎమోషనల్..

ఇక సాయంత్రం అయిన తర్వాత చక్రి అక్కడికి వస్తాడు. మీ ఇంట్లో వాళ్ళు నా ఉద్యోగం పోయేలా చేశారు నేను ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని అంటాడు.. నాకు మా నాన్నతో ఒకసారి మాట్లాడాలి అని అనిపిస్తుంది మీరు ఒకసారి ఫోన్ చేస్తారా అని చక్రి తో మహా అంటుంది. అలాగే అండి అని ఫోన్ ఇస్తాడు ఆ ఫోన్ లిఫ్ట్ చేయకనే ప్రతాప్ ని మహాలక్ష్మి నాన్న అని పిలుస్తుంది. తప్పమ్మా మీరు ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని పిలవకూడదు. తల్లి విషయానికొస్తే ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు నాన్న అని ఇలా ఎవరిని పడితే వాళ్ళని అనకూడదమ్మా అని ప్రతాప్ అంటాడు. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు అని మహా అనుకుంటుంది. నేను చెప్పేది వినండి నాన్న అని ఎంత చెప్తున్నా సరే ప్రతాప్ మాత్రం వినకుండా ఫోన్ పెట్టేస్తాడు. వాళ్లు నిజంగానే నేను చచ్చిపోయానని అనుకుంటున్నారేమో అని మహా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×