E-Paper
Advertisement

Podarillu Today Episode : మాధవ్ పై మహా కు అనుమానం.. కొత్త ఫ్యామిలీతో ట్విస్ట్.. చక్రీకి షాక్..

Podarillu Today Episode : మాధవ్ పై మహా కు అనుమానం.. కొత్త ఫ్యామిలీతో ట్విస్ట్.. చక్రీకి షాక్..
Advertisement

Podarillu Today Episode February 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా మహాలక్ష్మిని గెస్ట్ గా చూస్తూ సేవలు చేస్తారు.. మీరు ఎక్కడ కూర్చుంటారో నేను అక్కడే కూర్చుంటాను. మీరు ఏది తింటే నేను అదే తింటాను అని మహా అనడంతో అందరూ సంతోషంగా ఉంటారు.. ఆ తర్వాత మీ ఇంట్లో ఒకరు లేరు కానీ మీరు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు అని మహాలక్ష్మి అంటుంది. మీ నాన్న ఇంట్లో లేరన్న విషయాన్ని మీరు ఎవరు గుర్తించట్లేదు ఎందుకని అని మహా అంటుంది.. ఇక భోజనం చేసిన తర్వాత మహాలక్ష్మి ని మాధవ్ఏమీ ఇబ్బందిగా లేదు కదమ్మా అని అడుగుతాడు..

నాకు ఏమీ ఇబ్బందిగా లేదు కానీ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని మాధవతో మహాలక్ష్మి అంటుంది.. అయితే నాకు వెంటనే ఒక రూమ్ చూసి పెట్టండి నేను వెళ్ళిపోతాను అని మహాలక్ష్మి.. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నారాయణ నువ్వు పోలీసులు అరెస్ట్ చేయడంతో షాక్ అవుతుంది. నారాయణ కోసం బాధపడుతుంది కానీ బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి మాధవ్ కి షాక్ ఇస్తుంది మహాలక్ష్మి అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చక్రీ గురక పెట్టడం విన్న మహాలక్ష్మి ఎలాగైనా సరే చక్రీని లేపి పనులు చేయించాలని అనుకుంటుంది.. అయితే చక్రి మొహం మీద నీళ్లు కొట్టడానికి వెళ్లిన మహాలక్ష్మి కాలు జారీ కేశవ మీద ఆ నీళ్లు పడతాయి. ఇక ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. భయపడిపోయిన మహాలక్ష్మిని చక్రి ఓదారుస్తాడు. మొత్తానికి కాస్త ఫన్నీగా, ఇంకాస్త గొడవగా జరుగుతుంది. మహాలక్ష్మి బాధపడుతుంది అని కేశవ కూడా ఫీల్ అవుతాడు. తన అసిస్టెంట్ ఏమైందన్నా అలా ఉన్నావ్ అని ఎంతగా అడిగినా సరే కేశవ మాత్రం ఏం జరగలేదు అని అంటాడు. సడన్ గా అలా జరగడంతో నేను చాలా కోపంగా ఫీల్ అయ్యాను. అరిచాను కూడా.. బాధపడిపోయి ఉంటుందనుకుంటాను అదే నాకు చాలా బాధగా ఉంది అని కేశవ అంటాడు.

మరి మా మీద అరిచినట్టు అలా అరిస్తే బాధపడి పోకుండా ఏం చేస్తుంది? ఎంత పని చేసావ్ అన్న నిజంగానే వదినమ్మ బాధపడి పోయి ఉంటుంది అని అతను అంటాడు. ఇక తర్వాత మాధవ్ సైట్ కి వెళ్లడానికి తన పనిముట్లన్నీ సంచిలో పెట్టుకొని వెళ్తూ ఉంటాడు.. అయినా పెద్ది ఒక పెద్ద ఆర్కిటెక్ కదా మరి ఇలా తాపీ మేస్త్రి లాగా అన్ని సంచిలో పెట్టుకొని వెళ్తున్నాడు ఏంటి అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది.. ఇక మాధవ్ వెళ్ళిన తర్వాత చక్రీ దగ్గరికి వచ్చి మహాలక్ష్మి మీ అన్నయ్య ఆర్కిటెక్ కదా మరి తాపీ మేస్త్రి లాగా అన్ని సంచిలో పెట్టుకుని వెళ్తున్నాడు ఏంటి అని అడుగుతుంది.. ఆ తర్వాత చక్రి అయ్యో అడ్డంగా ఇరుక్కున్నానే ఏం చెప్పాలి ఇప్పుడు అని అనుకుంటాడు.

Advertisement

నేను మా అన్నయ్య ఆర్కిటెక్ అన్నాను కదా మీరు కూడా ఆర్కిటెక్ అవ్వాలని అనుకుంటున్నారు కదా.. మా అన్నయ్యని చూసి నేర్చుకోండి. మా అన్నయ్య ఎంత పెద్దగా ఉన్నా సరే చాలా సింపుల్ గా ఉండాలని అనుకుంటాడు. నేను ఆర్కిటెక్ అయితే మాత్రం ఇలా మీ అన్నయ్య లాగా సంచిలో పెట్టుకొని వెళ్ళను అని చక్రితో మహా అంటుంది.. ఇక తర్వాత ఇక్కడే ఉంటే నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపేస్తుంది.. నేను ఇకనుంచి వెళ్ళిపోవాలి అని చక్రి అనుకుంటాడు..

Also Read :అయ్యో బాలు అడ్డంగా ఇరుక్కున్నాడే.. మనోజ్ పరువు పోయింది.. తాగొచ్చిన శివ..

అయితే ఈ సీరియల్ లోకి కొత్తగా కొత్త ఫ్యామిలీ ఎంట్రీ ఇస్తుంది. అమ్మ నాన్న అన్నయ్య చెల్లి ఈ ఫ్యామిలీ కాస్త సరదాగా ఉంటుంది. కూతురి కోరికను తీర్చాలని నాన్న కష్టపడుతూ ఉంటాడు.. అయితే కొడుకు ఇబ్బంది మాత్రం గుర్తించకపోవడంతో అతను బాధపడిపోతూ ఉంటాడు. మధ్యతరగతి కుటుంబంలో పుడితే ఆ బాధలు ఇలానే ఉంటాయి అని వాళ్లంతా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక తర్వాత చక్రి కారేశ్వర్ దగ్గరికి వెళ్లి తన జాబ్ గురించి మాట్లాడుతాడు.. అతను మాత్రం నీకు జాబ్ లేదు ఏమీ లేదు వెళ్లిపో అని అంటాడు. చక్రి ఎంతగా బ్రతిమలాడినా సరే నీకు జాబ్ ఇవ్వను ఇకనుంచి వెళ్ళిపో అని అంటాడు. దాంతో చక్రి షాక్ అవుతాడు. అతని ఎంతగా కన్వెజ్ చేయాలని చూసినా కూడా నీకు జాబ్ ఇవ్వను అని గట్టిగా తేల్చి చెప్పేస్తాడు. ఆ మాట వినగానే చక్రి బాధ పడిపోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో సోమవారం ఎపిసోడ్లో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×