E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా కోసం మాధవ్ కీలక నిర్ణయం.. ఇంటికొచ్చిన నారాయణ.. కేశవ దెబ్బకు మహా ఫీల్..

Podarillu Today Episode : మహా కోసం మాధవ్ కీలక నిర్ణయం.. ఇంటికొచ్చిన నారాయణ.. కేశవ దెబ్బకు మహా ఫీల్..
Advertisement

Podarillu Today Episode February 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. మహాలక్ష్మి మాత్రం హాస్టల్లో ఉండడానికి హాస్టల్ కోసం వెతుకుతూ ఉంటుంది.. ఎన్ని హాస్టల్ కి వెళ్ళినా కూడా ఐడి ప్రూఫ్ లేదా జాబ్ గురించి ఆఫర్ లెటర్ కావాలని అడుగుతారు. చక్రి ఎలాగైనా సరే ఈమకి హాస్టల్ దొరకకూడదు మా ఇంట్లోనే ఉండేలా ప్లాన్ చేయాలి అని అనుకుంటాడు. మహాలక్ష్మి ఎక్కడైనా రూమ్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటుంది. అయితే తనకు డబ్బులు అవసరం అవుతుందని చేయనమ్మాలని మార్వాడి షాప్ కి వెళ్తుంది.. మహాలక్ష్మి ఎంత వద్దని చెప్తున్న సరే చేయను అమ్మేసి చక్రికి డబ్బులు ఇస్తుంది.

ఇవాళ ఉదయం ప్రతాప్ బయటకు రాను అన్ని పనులు నువ్వే చూసుకోవాలని ఆదికి చెప్తాడు.. ఎలాంటి వాడిని ఎలా మార్చేసింది మహాలక్ష్మి అని లలిత బాధపడిపోతూ ఉంటుంది. ఏంటి పరువు ని తీసేసి వెళ్ళిపోయింది. అందుకే నాకు మొహం చల్లడం లేదు అని ప్రతాప్ అనగానే హారిక.. మీరు ఆలోచించేది తప్పు మావయ్య అసలు ఏం జరిగిందో మీకు తెలియలేదు అని హారిక ఎంతో చెప్పడానికి ప్రయత్నిస్తుంది.. రమణయ్య నారాయణ మధ్య జరిగిన గొడవకి పోలీసులు వచ్చి నారాయణను అరెస్ట్ చేస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..ఇంట్లోని వాళ్ళందరూ కూడా మహాలక్ష్మిని గెస్ట్ గా చూస్తూ సేవలు చేస్తారు.. మీరు ఎక్కడ కూర్చుంటారో నేను అక్కడే కూర్చుంటాను. మీరు ఏది తింటే నేను అదే తింటాను అని మహా అనడంతో అందరూ సంతోషంగా ఉంటారు.. ఆ తర్వాత మీ ఇంట్లో ఒకరు లేరు కానీ మీరు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు అని మహాలక్ష్మి అంటుంది. మీ నాన్న ఇంట్లో లేరన్న విషయాన్ని మీరు ఎవరు గుర్తించట్లేదు ఎందుకని అని మహా అంటుంది.. ఇక భోజనం చేసిన తర్వాత మహాలక్ష్మి ని మాధవ్ఏమీ ఇబ్బందిగా లేదు కదమ్మా అని అడుగుతాడు.. నాకు ఏమీ ఇబ్బందిగా లేదు కానీ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని మాధవతో మహాలక్ష్మి అంటుంది.. అయితే నాకు వెంటనే ఒక రూమ్ చూసి పెట్టండి నేను వెళ్ళిపోతాను అని మహాలక్ష్మి..

ఇవాళ మీరు హాస్టల్ చూడ్డానికి వెళ్ళారా అని నాకు అర్థం అయిపోయింది అని అనగానే.. చక్రి మీతో చెప్పాడా అని మహాలక్ష్మి అడుగుతుంది. లేదు మీరు మాట్లాడుకుంటూ ఉండగా నేను విన్నాను అని మాధవ్ అడుగుతాడు.. కానీ ఎక్కడ కూడా హాస్టల్ దొరకడం లేదు అని చెప్పగానే.. మాధవ్ ఎక్కడో చోట దొరుకుతుంది అని అంటాడు. అయితే నాకు హాస్టల్ ఇప్పట్లో దొరికేల్లలేదు పెద్ది. ఎక్కడికైనా రూమ్ ఉంటే చూసి పెట్టవా అని మాధవ్ ను మహా అడుగుతుంది.. నీకు ఇక్కడ ఇబ్బందిగా ఉంటే చెప్పమ్మా నేను ఎక్కడైనా ఒక మంచి రూమ్ ని చూసి పెడతాను అని మాధవ్ మాటిస్తాడు.. అయితే నాకు వెంటనే రూమ్ చూసి పెట్టండి నాకు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు అని మహా అంటుంది.

Advertisement

నీకు ఇక్కడ ఇబ్బంది ఏమైనా కలుగుతుంది అమ్మ మా ఇల్లు పాతదే గాని మనుషులు మాత్రం చాలా మంచి వాళ్ళు నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు.. నీకు రూమ్ దొరికేంతవరకు నువ్వు ఇక్కడ ఉండొచ్చు అని మాధవ్ అనగానే మహాలక్ష్మి అలాగే అని లోపలికి వెళ్తుంది.. అయితే అక్కడ గదికి గడియ లేకపోవడంతో భయపడిపోతూ ఉంటుంది.. అది చూసిన మాధవ్ రూమ్ కి గడియ పెట్టమని చక్రి కి చెప్తాడు.. ఇక తర్వాత అందరూ కలిసి పడుకుంటారు.. ఉదయం లేవగానే మాధవ్ వంట చేస్తూ ఉండడం చూసిన మహాలక్ష్మి అక్కడికి వెళ్తుంది.. అప్పుడే ఇంటికి నారాయణ వస్తాడు.. మా నాన్నకి ఇది కొత్తవి కాదు లేమ్మా రావడం పోవడం ఆయనకి కామనే అని మాధవ్ అంటాడు..

అయితే నారాయణ రావడం చూసిన మాధవ్ అక్కడికి వెళ్లి ఏంటి..? ఇంత లేటుగా వచ్చావు అని అడిగితే ఇవాళ కాస్త లేట్ అయింది లేరా ఇంకొకసారి తొందరగా వస్తాను అని సరదాగా చెప్తాడు.. అయితే మాధవ్ దగ్గర ఉన్న మహాలక్ష్మి మీ నాన్నగారు సరదాగా ఉంటారు కదా మరి ఇవాళ ఎందుకు లేట్ వచ్చారు అన్నది చెప్పాడు కదా మీరు ఏమి అనలేదు ఏంటి అని అంటుంది. అయితే మా నాన్నకి చిన్నప్పటి నుంచి ఇలాంటివి అలవాటే.. నువ్వేం పట్టించుకోవద్దు అంటాడు. ఇక తర్వాత మీరు అందరికీ ఇప్పుడే వంట చేస్తారా అని మాధవుని అడుగుతుంది.. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వస్తారు కదా చేయడం కుదరదు కదా అందుకే ఇప్పుడే వంట చేసి పెడతాను అని మాధవ్ అంటాడు..

Also Read : రాజేష్ ఇంటికి వెళ్లిన బాలు, మీనా.. బాలుకు క్లాస్ పీకిన మీనా.. రోహిణిని టార్గెట్ చేసిన దినేష్..

అయితే మహాలక్ష్మి పెద్ది అన్న పదం గురించి మాధవ్ అడుగుతాడు.. అసలు నన్ను ఈ పెద్ది అని ఎందుకంటున్నావు? నాకు తెలుసుకోవాలని ఉంది ఎందుకు చెప్తావని అడుగుతాడు.. మామయ్య చనిపోయారు ఆయనలాగా మీరు నాకు కనిపిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని పెద్ది అని పిలుస్తాను అని మహా అంటుంది.. చక్రీ గురక పెట్టడం విన్న మహాలక్ష్మి ఎలాగైనా సరే చక్రీని లేపి పనులు చేయించాలని అనుకుంటుంది.. అయితే చక్రి మొహం మీద నీళ్లు కొట్టడానికి వెళ్లిన మహాలక్ష్మి కాలు జారీ కేశవ మీద ఆ నీళ్లు పడతాయి. ఇక ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. భయపడిపోయిన మహాలక్ష్మిని చక్రి ఓదారుస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మొత్తానికి కాస్త ఫన్నీగా, ఇంకాస్త గొడవగా ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×