E-Paper
Advertisement

Podarillu Today Episode : భూషణ్ కోసం ప్రతాప్ వేట.. మాధవ్ కు కొత్త టెన్షన్.. చక్రికి మహా సర్ప్రైజ్..

Podarillu Today Episode : భూషణ్ కోసం ప్రతాప్ వేట.. మాధవ్ కు కొత్త టెన్షన్.. చక్రికి మహా సర్ప్రైజ్..
Advertisement

Podarillu Today Episode December 28th : చక్రి మహా గురించి మాధవ్ కి చెప్తాడు.. చక్రి మహని ఎలాగైనా సరే మెప్పించి తన మనసులో చోటు సంపాదించుకోవాలని అనుకుంటాడు. ఒకవైపు మాధవ్ పెద్దవాళ్లతో వ్యవహారం వద్దురా మనకి సమస్యలు లేనిపోనివి వచ్చి పడతాయి అని ఎంత చెబుతున్న సరే చక్రి మాత్రం వినడు. ఆ అమ్మాయిని ఎలాగైనా సరే కాపాడాలి నాపై ప్రేమను పుట్టేలా చేయాలి అని అనుకుంటాడు. తను ఇష్టపడిన అమ్మాయి కావడంతో ఇంట్లోని వాళ్ళు కూడా ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోతారు.

కన్నా ఈ అమ్మాయి చాలా బాగుంది అన్నయ్య నువ్వు పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని అంటాడు. మాధవ్ ఒకవైపు భయపడుతూనే తమ్ముడు సంతోషాన్ని కాదనలేక ఒప్పేసుకుంటాడు.. మహా పెళ్లి జరుగుతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది. నా బ్రతుకు ఆశలు అన్ని ఆవిరి అయిపోయాయి ఒక మూర్ఖుడి చేతిలో నన్ను పెడుతున్నారు నేను అందరికీ అంత భారం అయిపోయాను అని బాధపడుతూ ఉంటుంది. హారిక మాత్రం తనని ఎంతగా ఓదార్చాలని ప్రయత్నించినా కూడా మహా మాత్రం బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మొత్తానికి మహా పెళ్లికూతురు గెటప్ లో రెడీ అయ్యి కిందకొస్తుంది. మహని చూసిన ఇంట్లోని వాళ్ళందరూ కూడా పెళ్లికూతురుగా చాలా బాగున్నావు అని సంతోష్ పడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. మనం తొందరగా అక్కడికి వెళ్లాలి లేదంటే టైం అయిపోతుంది రిజిస్టర్ ఆఫీసర్ గారు వెళ్ళిపోతారు అని ప్రతాప్ అంటాడు. అల్లుడుగారు ఇంకా ఫోన్ చేయలేదు కదా అయిన పర్లేదు మనం అక్కడికి వెళ్లి వెయిట్ చేద్దామని ప్రతాప్ ఆది అనుకుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన భూషణ్ తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని చెప్తారు. పూల దండల కోసం వెళ్ళిన భూషణ్ ని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్తారు.. ఏం మాట్లాడుతున్నారు మీ అబ్బాయికి ఇక్కడ ఏమైనా శత్రువులు ఉన్నారా ఏంటి అని ప్రతాప్ అడుగుతాడు. లేరు అన్నయ్యగారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని ఆమె అంటుంది.

భూషణ్ ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది. వాడు అసలు ఇండియాకు రావడం కొత్త ఎవరూ వాడిని కావాలనే తీసుకెళ్లారు అని వాళ్ళు అనుమాన పడతారు. ఆ తర్వాత ఏం చేస్తారో అని కంగారుగా ఉంది అని వాళ్ళు భయపడుతూ ఉంటారు.. అందరూ భూషణ్ కి ఏమైంది అనే టెన్షన్ పడుతూ ఉంటే మహా మాత్రం ఈ పెళ్లి చెడిపోయింది దరిద్రం పోయింది అని నవ్వుకుంటూ ఉంటుంది.. హారిక నీకు కొంచెం కూడా భయం లేదా ఎందుకు అలా చేస్తున్నావు అని అంటుంది.. మనం వెళ్లి అల్లుడుగారు ఎక్కడున్నారు వెతుకుదాం పద అని ప్రతాప్ ఆది బయలుదేరుతారు..

Advertisement

మహాను హారిక పైకి తీసుకుని వెళుతుంది. గదిలోకి వెళ్లిన హారిక చాలా సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ దేవుడు ఉన్నాడు వదినా నన్ను అర్థం చేసుకున్నాడు అని గంతులు వేస్తుంది.. మెల్లగా మహా ఈ విషయం గనుక మీ అమ్మ వింటే మనిద్దరికీ ఇక అంతే అని అంటుంది. ఆ జుట్టు పోలిగాడు ఇక బయటికి రాకుండా ఉంటే బాగుంటుంది నా లైఫ్ హ్యాపీ గా ఉంటుంది అని మహా ఫుల్ ఖుషి అవుతుంది. ఇది కచ్చితంగా అతని పని అని అనగానే హారిక ఎవరి పని అని అడుగుతుంది. ఎవరూ లేరు దేవుడు పనే అంటున్నానని మహా అంటుంది.

మాధవ్ భూషణ్ ను తీసుకొని వెళ్ళిన తర్వాత టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. భూషణ్ ని ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో కట్టి పడేస్తారు. అరే చక్రి నువ్వేం చేస్తున్నావ్ రా ఎందుకురా ఇలాంటి పని చేశావు అని మాధవ్ కంగారుపడుతూ చక్రి కి ఫోన్ చేసి మాట్లాడుతాడు. నువ్వు ఇలాంటి వాటికి తమ్ముళ్లను ఎందుకురా తీసుకొచ్చావు అని భయపడతాడు.. నువ్వేం భయపడకు అన్నయ్య ఏం కాదు అని చక్రి అంటాడు. అది సేఫ్ ప్లేస్ వాడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు నువ్వు కంగారుపడి తమ్ముళ్ళని భయపడేలా చేయకు అని మాధవ్ కు చక్రి చెప్తాడు..

Also Read : ఆస్తులను కొట్టేసిన ఏకలింగం.. ఆస్తి కోసం పల్లవి ప్లాన్.. అవనిని చంపేందుకు కుట్ర..

అయినా ఇది సేఫ్ ప్లేస్ ఏంటి రా ఇది ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది. కచ్చితంగా మనం అంతా దొరికిపోతాము అని మాధవ్ భయపడుతూ ఉంటాడు. చక్రి ఫోన్ పెట్టేసాడు లేదో అప్పుడే కింద ఆది తన మనుషులతో వస్తాడు. అది చూసిన మాధవ్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. భూషణ్ ను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిపోతుందా లేదా అన్నది చూడాలి. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భూషణ్ గురించి అన్ని నిజాలు బయటపడతాయా..? మహా చక్రికి దగ్గర అవుతుందా..? అసలేం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×