// // Podarillu Today Episode : మహాను ఇంప్రెస్ చేస్తున్న చక్రి.. మాధవ్ పెళ్లి క్యాన్సిల్.. -->
E-Paper
Advertisement

Podarillu Today Episode : మహాను ఇంప్రెస్ చేస్తున్న చక్రి.. మాధవ్ పెళ్లి క్యాన్సిల్.. భూషణ్ కు మహా షాక్..

Podarillu Today Episode : మహాను ఇంప్రెస్ చేస్తున్న చక్రి.. మాధవ్ పెళ్లి క్యాన్సిల్.. భూషణ్ కు మహా షాక్..
Advertisement

Podarillu Today Episode December 20th:  పెళ్లి వాళ్ళు వస్తున్నారు కదా ఇంటిని కాస్త శుభ్రంగా ఉంచితే బాగుంటుంది అని అనుకుంటారు.. కేశవ వెళ్లి కుర్చీలను పట్టుకుని వస్తాడు.. అంత సిద్ధం చేయగానే పెళ్లి వాళ్ళు ఇంట్లోకి వస్తారు.. ఇంటిని చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత నారాయణ చెప్పింది విని కాస్త కన్విన్స్ అవుతారు. మాధవ్ మాత్రం అంత నిజమే చెప్పాలి అని అనుకుంటారు. పెళ్లి వాళ్ళని చూసినా గాయత్రి పెళ్లి ఓకే అయిపోతుంది ఏమో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.

కన్నా గాయత్రి తో మాట్లాడతాడు.. సెలెక్ట్ చేసుకోవడానికి గాయత్రి బాధపడి అతనికి వెళ్ళిపోతుంది.. అయితే కన్నా మాత్రం ఏంటి ఇది ఇలా వెళ్ళిపోతుంది అని అనుకుంటాడు.. ఇక గదిలోకి వెళ్లి పెద్ద రచ్చ చేస్తూ ఉంటుంది.. ఆ జుట్టు పోలిగాడు నన్ను ఎన్ని మాటలు అంటున్నాడో వింటున్నావా అని హారికపై మహా సీరియస్ అవుతూ రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.. మహా కొంచెం కూలవు ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావ్ అని హారిక ఎంత చెప్తున్నా సరే మహా మాత్రం తిడుతూనే ఉంటుంది.. మాధవ్ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవుతుంది. నారాయణ గురించి నిజం తెలిసిపోతుంది.. మహా కోసం చక్రి జాబ్ లో జాయిన్ అవుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పెళ్లి చీరల కోసం భూషణ్ తల్లితో కలిసి మహా కుటుంబం షాపింగ్ కు వెళ్తుంది.. ఎలాగైనా సరే వీళ్ళతో పాటే నేను షాప్ లోకి వెళ్లి పోవాలని చక్రి కూడా అనుకుంటాడు. మహా ఏ చీర తీసుకున్న అది బాగోలేదని చెప్తూ ఉంటాడు. నాకు కాస్త తలనొప్పిగా ఉంది నువ్వే చూడు వదినా అని మహా పక్కకు వెళ్ళిపోతుంది.. చక్రి వీళ్లు నన్ను ఏమనకుండా ఇక్కడే ఉండాలంటే నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తూ ఉండాలని అనుకుంటాడు. అక్కడ తాను కూడా బట్టలు కొనాలని అనుకున్నట్లు నటిస్తూ ఉంటాడు. అక్కడే ఉన్నా షర్ట్లు కౌంటర్ దగ్గరికి వెళ్లి ఓ మంచి షర్టు చూపించండి అని అడుగుతాడు.

అక్కడ ఉన్న షాప్ కీపర్ చక్రి మధ్య కన్వర్జేషన్ కాస్త కామెడీగా ఉంటుంది. చక్రి కామెడీ అతనికి వరుసగా షాక్ లిస్తూ ఉంటుంది.. మొత్తానికైతే చక్రి మొహాని ఎలాగైనా సరే తన లైన్లో పెట్టుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. తను వేసుకున్న షర్ట్ టైల్స్ ని మహా కి చూపించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మహా మాత్రం భూషణ్ నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది.. పెళ్లి చీరలను చూడమని హారిక ఎంత చెప్పిన సరే మహా మాత్రం అసలు ఈ పెళ్లి నాకొద్దు కానీ ఈ చీరలు గోలేంటి నువ్వే చూడు వదినా అని చెప్తుంది. నువ్వు ఇలాంటి వాళ్ళకి అనుమానం వస్తుంది మన ఇంటి పరువు పోతుంది మహా వచ్చి చూడు అని అంటుంది.

Advertisement

చక్రి అక్కడున్న షర్టులను ట్రై చేసి మహా కి చూపిస్తాడు కానీ మహా మాత్రం వీడింటి నన్ను అడుగుతున్నాడు అని అనుకుంటుంది. మేడం చెప్పండి మేడం ఎలా ఉందో మీరు మాకు దేవుళ్లతో సమానం మీ సెలక్షన్ మేము ఓకే చేస్తామని పెద్ద కోతలు కోస్తాడు. కానీ మహా మాత్రం తనకి ఏమీ తెలియనట్టు సైలెంట్ గా ఉండిపోతుంది. అక్కడికి వచ్చినప్పుడు భూషణ్ ఆది ఏంటి అక్కడ చీరలు చూడమంటే ఇక్కడ వీడితో ముచ్చట్లు పెట్టావు అని అడుగుతారు. మీ అమ్మగారికి నచ్చినవే కొనాలి కదా నేనెందుకు ఇంకా అక్కడ మీ అమ్మకు ఉంటేనే సరిపోతుంది కదా అని మహా కౌంటర్ ఇస్తుంది..

మహా ఏంటి అలా మాట్లాడుతున్నావు రా వచ్చి చీరలు చూడు అనేసి అది అడుగుతాడు.. ఇక మహా ఆది బలవంతం చేయడంతో అక్కడికి వచ్చి చీరలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అటు మాధవ్ ఈ పెళ్లి సంబంధం చెడిపోయిందని బాధపడుతూ ఉంటాడు. నువ్వేం బాధపడకు అన్నయ్య నీకు ఇలాంటివి మంచి సంబంధం కూడా వస్తుంది. దానికి మాధవ్ నేనేమీ బాధపడడం లేదు కన్నాకి ఈ విషయం తెలిస్తే వాడు ఎక్కడ బాధపడతాడు అని అనుకుంటున్నాను అని మాధవ్ అంటాడు. అసలు ఆ పెద్ద మనిషిని అనాలి ఎవరైనా పిల్లలకి పెళ్లిళ్లు చేయాలి అనుకుంటారు కానీ ఈ మనిషి ఆస్తి కోసం మన కుటుంబ పరువు తీస్తున్నాడు అని కేశవ సీరియస్ అవుతాడు.

Also Read : ‘గుండెనిండా గంటలు ‘ మనోజ్ షాడ్ స్టోరీ.. ఒక్కపూట తిండి లేక పస్తులు..

ఇళ్లు బాగు అయ్యేది లేదు ఈ పెళ్లిళ్లు జరిగేది లేదు మీరు ఈ పెళ్లి గురించి వదిలేసి మీ పని మీరు చూసుకోండి అని మాధవ్ అంటాడు.. చక్రి మాత్రం ఆ అమ్మాయితో మాట్లాడానని చాలా సంతోషంగా ఇంటికి వస్తాడు. కానీ ఇక్కడ మాధవ సంబంధం చెడిపోయింది అని తెలుసుకుని బాధపడతాడు. మన అమ్మ బ్రతికే ఉంటే ఇలా జరిగేది కాదుగా అని అంటాడు.. ఇక కన్నాతో షాపులో అమ్మాయి ఎలా ఉందో అన్న విషయం గురించి వివరిస్తాడు.. మహా తనకి ఇష్టమైన చీరలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. మీరు ఏ చీరలైనా చూపించండి కానీ రెడ్ కలర్ మాత్రం చూపించకండి అని భూషణ్ తల్లి అంటుంది. దొరికాడు వీడికి కచ్చితంగా కాలేల చేయాలి అని మహా అనుకుంటుంది.. నాకు రెడ్ కలర్ సారీ అంటే చాలా ఇష్టం ఆ కలర్ లోనే కొంచెం చీరలు చూపించండి అని మహా కావాలని అడుగుతుంది.. మహా నిజంగానే కావాలని ఇలా చేస్తుందని హారిక అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×