E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా పై పెళ్లి కొడుకు సీరియస్.. ప్రతాప్ ఫుల్ హ్యాపీ.. మాధవ్ పెళ్లి కోసం టెన్షన్..

Podarillu Today Episode : మహా పై పెళ్లి కొడుకు సీరియస్.. ప్రతాప్ ఫుల్ హ్యాపీ.. మాధవ్ పెళ్లి కోసం టెన్షన్..
Advertisement

Podarillu Today Episode December 13th: మహని హారిక రెడీ అవమని చెప్తుంది.. ఎందుకు వదిన వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని మహా అంటుంది.. దానికి హారిక నేను బయటి నుంచి వచ్చాను ఇంట్లో పుట్టి పెరిగింది. నువ్వు మీ వాళ్ల గురించి నువ్వు అర్థం చేసుకోవాలి అని అంటుంది.  మహా వాళ్ళ అమ్మ ఎరుపు రంగు చీర కాకుండా ఏదైనా కట్టండి.. ఆ రంగు అంటే అబ్బాయికి అస్సలు ఇష్టం లేదంట అబ్బాయి చాలా బాగున్నాడు సినిమా హీరో లాగా ఉన్నాడు అని అంటుంది.. ఇక మహా అయిష్టంగానే పెళ్లి చూపులకి కూర్చుంటుంది..

పెళ్ళికొడుకు జడను చూసి మహా షాక్ అవుతుంది. వీడు వీడు డిపో మొహమో అని మహా తిట్టుకుంటూ ఉంటుంది. పెళ్ళికొడుకు మాత్రం మహాకి ఒక బొకే ఇచ్చి తనని ఇంప్రెస్ చేయడానికి చూస్తాడు.. నాకు పువ్వులు అంటే ఎలర్జీ అని మహా అనగానే షాక్ అవుతాడు. ప్రతాప్ తన కూతురు గురించి ఎంతో గొప్పగా చెప్తాడు మాధవ్ తన తమ్ముళ్లు అందరితో కలిసి పెళ్లి చూపులకు వెళ్తాడు అక్కడ పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూపించమని అడిగితే వాళ్లందరూ మీరందరూ మగవాళ్ళే వచ్చారా? ఏం పనులు చేస్తారు ఎలా ఉంటారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ఆపేసి అమ్మాయిని చూపిస్తారా అని నారాయణ అడుగుతాడు… పెళ్లి సంబంధం కు వెళ్ళిన మాధవ్ గారెలు వేయడంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఎన్నో ఆశలతో పెళ్లి చూపులకు వెళ్లిన మాధవ్ కు పెళ్లికూతురు తండ్రి నిరాశన మిగిల్చేలా కనిపిస్తున్నాడు.. మహా మాత్రం ఆ పెళ్ళికొడుకు నచ్చలేదు అని ఎన్నిసార్లు మనసులో అనుకొని అతన్ని ఎలాగైనా సరే వదిలించుకోవాలని అనుకుంటుంది. అతను మహా తో మాట్లాడిన తీరు చూసి మహా పెళ్ళికొడుకు నేను నచ్చలేదు చాలా సంతోషమని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత అతను చెప్పే సోది వినాలా అని అనుకుంటూ ఉంటుంది. అయితే అమ్మాయి తో మాట్లాడిన అబ్బాయి మీరు ఇలాంటి డొక్కు కాలేజీలోనూ, ఈ ప్రపంచంలోనే బ్రతికేలా చేశారు. నేను పెళ్లి చేసుకొని కెనడాకు వెళ్లి మార్చుకుంటాను అని అనగానే ప్రతాప్ తో సహా ఇంట్లోని వాళ్ళందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. మహా మాత్రం చచ్చానురా అని ఆలోచిస్తూ ఉంటుంది.. పెళ్లిచూపులు కొచ్చిన వ్యక్తి అన్న మాటతో మహా ఆశలన్నీ ఆవిరైపోయాయి..

మీరు ఏమీ బాధపడకండి ఈ అమ్మాయిని నాకు నచ్చినట్లు నేను మార్చుకుంటాను అని అంటాడు.. దాంతో అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. మొత్తానికి మహా పెళ్లి ఫిక్స్ అయిందని ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. కానీ మహాలక్ష్మి మాత్రం వీడు నాకు ఏ మాత్రం నచ్చలేదు అని బాధపడుతూ ఉంటుంది.. త్వరలోనే మంచి ముహూర్తాలు చూసి ఎంగేజ్మెంట్ చేద్దాం అని ప్రతాప్ అంటాడు. దాంతో మహా షాక్ అవుతుంది..

Advertisement

కన్నా ఈ పెళ్లి సంబంధం ఫిక్స్ అవుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు.. ఈ సంబంధం కచ్చితంగా ఓకే అవుతుందని అనుకున్నాను. అవుతుందా అని అనగానే నారాయణ పెళ్లి సంబంధం చూడటానికి వెళ్లినోడు అమ్మాయిని చూశామా వచ్చామా అని ఉండకుండా.. అక్కడికి వెళ్లి ఆ అమ్మాయికి గారెలు ఎలా వేయాలో వేసి చూపించాడు.. గారెలు వేయడం నేర్పించాడు ఇంకో పెళ్లి సంబంధానికి వెళ్తే పూరీలు వేయడం నేర్పిస్తాడు ఏమో అని వెటకారంగా మాట్లాడతాడు.. ఆ మాట వినగానే చక్రి నారాయణ నారాయణ అంటాడు.. మాధవ్ మాత్రం ఈ సంబంధం ఎలా ఉన్న పర్లేదు అని మౌనంగా ఉంటాడు.

ఈ పెళ్లి సంబంధం ఏమైందో తెలుసుకోవాలని గాయత్రీ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. తన బావను ఎలాగైనా తానే సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. అటు తాయారు తన కూతురికి పెళ్లి కావడం లేదని గుడిలో ముడుపులు కడుతూ దేవుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది.. చక్రి మాత్రం తన కలల రాణి మళ్లీ కనిపిస్తే బాగుంటుంది అని అనుకుంటాడు.. పెళ్లి సంబంధం గురించి పక్కన పెట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ బిజీగా ఉంటారు.. చక్రి అన్నయ్యకు పెళ్లి సంబంధం ఫిక్స్ అయిపోతే తాను కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందామని అనుకున్నాను అని బాధపడుతూ ఉంటాడు.

Also Read : శ్రీవల్లి పై అనుమానం.. చందును అడ్డుకున్న శ్రీవల్లి.. రామారాజుకు నిజం తెలిసిపోతుందా..?

ఇక మహా ఈ పెళ్లి కొడుకు నాకు నచ్చలేదు అయినా కానీ మీరు ఎవరు వినట్లేదు ఏంటి అని హారికతో చెప్తుంది.. అబ్బాయికి ఏం తక్కువయింది నువ్వు పెళ్లి చేసుకొని కెనడాకు వెళ్ళిపోతావు.. ఈ సంబంధం గురించి నువ్వే ఆలోచించు ఎందుకంటే ఇది నీ జీవితం కాబట్టి నువ్వు ఆలోచించుకొని ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో అదే తీసుకో అని సలహా ఇస్తుంది.. మహా మాత్రం తన ప్రాజెక్టు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×