E-Paper
Advertisement

Podarillu Today Episode : మహాకు షాకిచ్చిన పెళ్ళికొడుకు.. పెళ్లిచూపుల్లో గారెలు వేసిన మాధవ్..ఈ పెళ్లి క్యాన్సిలా..?

Podarillu Today Episode : మహాకు షాకిచ్చిన పెళ్ళికొడుకు.. పెళ్లిచూపుల్లో గారెలు వేసిన మాధవ్..ఈ పెళ్లి క్యాన్సిలా..?
Advertisement

Podarillu Today Episode December 12th: ఉదయం మహా లేచి కిందికి వచ్చేలోగా హారిక వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉండడంతో ఏం జరుగుతుందని అయోమయంలో ఉంటుంది. మహా కి పెళ్లి చూపులు మరి కాసేపట్లో వాళ్ళు వస్తారు అని అనడంతో షాక్ అవుతుంది. పెళ్లిచూపులు కి ఎట్టి పరిస్థితులను కూర్చోవాల్సిందే అని ప్రతాప్ చెప్పడంతో మహా ఎమోషనల్ అవుతుంది… ఇప్పుడు నాకు అర్జెంట్గా పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేయాలని మీరు అనుకుంటున్నారా నాన్న.. నేను మీకు అంత భారం అయిపోయాను అని మహా ప్రతాప్ ని అడుగుతుంది. గదిలోకి వెళ్లి తాను సాధించిన మెడల్స్ అన్నిటిని తీసుకొని వస్తుంది..

మెడల్స్ సాధించాను.. నీ కూతురుగా నేను నా కాళ్ళ మీద నేను నిలబడడం నీకు ఇష్టం లేదా అని మహా అడుగుతుంది.. పెళ్లయిన తర్వాత కూడా నువ్వు జాబ్ చేయొచ్చు అని అనడంతో మహా షాక్ అవుతుంది.. ఎంత చెప్పినా ఎందుకు మీరు వినట్లేదు అని మహా బాధపడుతుంది.. ప్రతాప్ మాత్రం మహాకు ఛాన్స్ ఇవ్వడు.. పెళ్లి చూపులకు కాదనలేక ఇష్టం లేకపోయిన కూడా కూర్చుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..మహని హారిక రెడీ అవమని చెప్తుంది.. ఎందుకు వదిన వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని మహా అంటుంది.. దానికి హారిక నేను బయటి నుంచి వచ్చాను ఇంట్లో పుట్టి పెరిగింది. నువ్వు మీ వాళ్ల గురించి నువ్వు అర్థం చేసుకోవాలి అని అంటుంది.  మహా వాళ్ళ అమ్మ ఎరుపు రంగు చీర కాకుండా ఏదైనా కట్టండి.. ఆ రంగు అంటే అబ్బాయికి అస్సలు ఇష్టం లేదంట అబ్బాయి చాలా బాగున్నాడు సినిమా హీరో లాగా ఉన్నాడు అని అంటుంది.. ఇక మహా అయిష్టంగానే పెళ్లి చూపులకి కూర్చుంటుంది.. పెళ్ళికొడుకు జడను చూసి మహా షాక్ అవుతుంది. వీడు వీడు డిపో మొహమో అని మహా తిట్టుకుంటూ ఉంటుంది. పెళ్ళికొడుకు మాత్రం మహాకి ఒక బొకే ఇచ్చి తనని ఇంప్రెస్ చేయడానికి చూస్తాడు.. నాకు పువ్వులు అంటే ఎలర్జీ అని మహా అనగానే షాక్ అవుతాడు.

ఇక ప్రతాప్ తన కూతురు గురించి ఎంతో గొప్పగా చెప్తాడు మాధవ్ తన తమ్ముళ్లు అందరితో కలిసి పెళ్లి చూపులకు వెళ్తాడు అక్కడ పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూపించమని అడిగితే వాళ్లందరూ మీరందరూ మగవాళ్ళే వచ్చారా? ఏం పనులు చేస్తారు ఎలా ఉంటారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ఆపేసి అమ్మాయిని చూపిస్తారా అని నారాయణ అడుగుతాడు. పెళ్లిచూపులు అప్పుడే అన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది కదా అని పెళ్లికూతురు బామ్మ అంటుంది. పెళ్లి కూతుర్ని తీసుకురాగానే ఆమెను చూసి మాధవ్ తెగ సిగ్గు పడిపోతాడు. పెళ్లికూతురు బాగుంది అని అందరూ అనుకుంటారు. ఇక అక్కడున్న గారెలను ఆమె ఇవ్వగానే మాధవ్ ఈ గారెలు వేసింది ఎవరు సరిగ్గా వేయలేదు నేను గారెలు వేయడం నేర్పిస్తాను అని అంటాడు.

Advertisement

ఒకపక్క చక్రి ఇప్పుడు గారెలు గురించి ఎందుకు అన్నయ్య పెళ్లిచూపులు కదా మీరు ఒకసారి అమ్మాయిని చూడండి అని అంటాడు. అని మాధవ్ మాత్రం ఒకసారి నేర్పిస్తే ఇంకొకసారి తప్పు చేయరు కదా.. అని వంటగదిలోకి తీసుకెళ్లి మరి ఆ అమ్మాయికి గారెలు వేయడం నేర్పిస్తాడు. ఎపిసోడ్కు ఈ సీను హైలెట్ గా నిలుస్తుంది. ఆ తర్వాత మీరు వంట చేయడం ఎందుకు ఇష్టంగా నేర్చుకున్నారు అని అమ్మాయి అడుగుతుంది.. మీకు వంట చేయడం అంత ఇష్టమా అని అడుగుతారు. వంట చేయడం ఇష్టం కాదు అవసరం నా తమ్ముళ్ళకి నేనే చూసుకోవాలి కదా అని మాధవ్ ఎమోషనల్ అవుతాడు. ఇక ఆ సంబంధం ఓకే అవుతుందని అందరూ అనుకుంటారు..కానీ పెళ్లికూతురు తండ్రి మాత్రం ఆలోచించి చెప్తామని అంటాడు.

Also Read:ప్రేమ, ధీరజ్ మధ్య మళ్ళీ గొడవ.. తల మీద గుడ్డవేసుకున్న శ్రీవల్లి.. గెలిచిన వేదవతి..

మహాలక్ష్మితో అతను మాట్లాడాలని అనుకుంటాడు. ఎంత చెప్తున్నా సరే అతను మాత్రం మహాతో ఎప్పుడు మాట్లాడదామని అనుకుంటాడు. మీరిద్దరూ మాట్లాడుకోవాలి అనుకుంటే మాట్లాడుకోండి అని అనగానే నేను అప్పటినుంచి వెయిట్ చేసేది దానికోసమే అని పెళ్ళికొడుకు అంటాడు. మహాతో మాట్లాడిన పెళ్ళికొడుకు పూర్తిగా తన అభిప్రాయాలు వేరు అని చెప్తాడు. ఆ మాట విన్న మహా పెళ్ళికొడుకు నేను నచ్చలేదు చాలా సంతోషమని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత అతను చెప్పే సోది వినాలా అని అనుకుంటూ ఉంటుంది. అయితే అమ్మాయి తో మాట్లాడిన అబ్బాయి మీరు ఇలాంటి డొక్కు కాలేజీలోనూ, ఈ ప్రపంచంలోనే బ్రతికేలా చేశారు నేను పెళ్లి చేసుకొని కెనడాకు వెళ్లి మార్చుకుంటాను అని అనగానే ప్రతాప్ తో సహా ఇంట్లోని వాళ్ళందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. మహా మాత్రం చచ్చానురా అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో చక్రితో మహా మాట్లాడుతుందా లేదా చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×