E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీని తిట్టిన మహా.. గాయత్రి పెళ్లికి మహా ప్లాన్..మాధవ్ కు పెళ్లి.. చివరిలో ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీని తిట్టిన మహా.. గాయత్రి పెళ్లికి మహా ప్లాన్..మాధవ్ కు పెళ్లి.. చివరిలో ట్విస్ట్..
Advertisement

Podarillu Today Episode April 9th : రాత్రి వంట చేసేందుకు మాధవికి సాయం చేయాలని మహాలక్ష్మి అనుకుంటుంది.. అయితే మహాలక్ష్మి ఉల్లిపాయలు వేయడంతో కన్నీళ్లు రావడంతో అందరూ కూడా మహాలక్ష్మి ఏడుస్తుంది ఏంటి? అని అనుకుంటారు. ఇక వీళ్ళందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగానే వెనుక గుమ్మం నుంచి గాయత్రి లోపలికి వస్తుంది. నేను నీతో మాట్లాడాలి అని అంటుంది. కానీ అక్కడున్న వాళ్ళందరూ కూడా మళ్లీ ఎందుకు వచ్చావు అని గాయత్రిని బాధపడేలా తిడతారు. అయితే నారాయణ వచ్చి నువ్వు మా ఇంటికి వస్తే మీ అమ్మ ఎలా మాట్లాడుతుందో నాకు బాగా తెలుసు అని అక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తాడు. ఇక తర్వాత మా గాయత్రి అక్కడినుంచి వెళ్ళిపోతుంది మాధవ్ బాధపడతాడు.

చక్రీని తిట్టేసిన మహా..

గాయత్రి ఎంత బాధ పడుతుందో మనం చూశాం కదా.. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని మహాలక్ష్మి చక్రి తో అంటుంది. కానీ చక్రి మాత్రం అలా చేయడం కొత్త కాదండి మనం మాట్లాడడానికి వెళ్తేనే మా అత్త ఎంత పెద్ద రచ్చ చేసిందో మీరు చూశారు. కదా ఇప్పుడు మళ్ళీ సాహసం చేయడం అవసరమా అని చక్రి అంటాడు. మీ వాళ్ళ కన్నా మాత చాలా డేంజర్ మీరు ఇలాంటి ఆలోచన పెట్టుకోకండి అని చక్రి అంటాడు. అయితే మా వాళ్ళు దుర్మార్గులు మీ అత్త చాలా మంచిది. నాకు చాలా భయమేస్తుంది అండి ని చక్రి ఎంత చెప్తున్నా సరే మహా మాత్రం అవన్నీ నేను చూసుకుంటాను అని అంటుంది. గాయత్రి కలవడానికి గుడికి వెళుతున్నాను ఆ దేవుడు ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడు అని అంటుంది.

గాయత్రిని పెళ్లికి ఒప్పించిన మహా…

Advertisement

ఉదయం లేవగానే మహాలక్ష్మి గుడికి వెళుతుంది అయితే గాయత్రి కూడా అక్కడికి వస్తుంది. ఏంటి గుడికి రమ్మన్నావు మహాలక్ష్మి ఏమైంది అని అడుగుతుంది.. మాధవ్ నీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటావా..? ధైర్యం చేస్తానంటే చెప్పు నేను మీ పెళ్లి చేస్తాను అని మహాలక్ష్మి అంటుంది.. మా అమ్మ సంగతి నీకు తెలియదు మహాలక్ష్మి బావ కోసం నేను ఎంత గుండెను రాయి చేసుకోవాలని అనుకున్న సరే నావల్ల కావడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది గాయత్రి. ఇవాళ సాయంత్రం మీ పెళ్లి చేస్తాను నువ్వు ధైర్యం చేసి ఇంట్లోంచి బయటికి రా ఆ తర్వాత సంగతి మేము చూసుకుంటాము అని మహాలక్ష్మి అనగానే గాయత్రి వస్తానని మాట ఇస్తుంది.

మహా మాటతో అంతా షాక్..

మహాలక్ష్మి గాయత్రి తో మాట్లాడిన విషయాన్ని ఇంట్లో చక్రి కన్నా కేశవ తో చెప్తే వాళ్ళు అస్సలు నమ్మడం లేదు. గాయత్రి అంత ధైర్యం చేసి ఇంటికి వస్తుందంటే అస్సలు నమ్మలేకపోతున్నాము మీరు కూడా అసలు నమ్మకండి అని లేదు అంటారు.. అయితే మహా మాత్రం గాయత్రి నాకొస్తానని మాట ఇచ్చిందని ఎంత చెప్తున్నా సరే.. వాళ్ళు మాత్రం తనకి ధైర్యం లేదని అంటారు.. ఎలాగో తన నమ్మకం తనది కదరా మనం సపోర్ట్ చేద్దాం ఏం జరిగితే అది జరుగుతుంది అని అందరూ అనుకుంటారు.. అన్నయ్యని ఎవరు ఒప్పిస్తారు అంటే మహాలక్ష్మి అది నేను చూసుకుంటాను అని అంటుంది..

మాధవ్ ను బెదిరించిన మహా..

Advertisement

మహాలక్ష్మి మాధవ్ తో మాట్లాడుతానని బయటకు వెళ్తుంది. కానీ మాధవ్ మాత్రం మహాలక్ష్మి నిర్ణయాన్ని విని షాక్ అవుతాడు. గాయత్రి ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే కానీ వాళ్ళందరి గురించి ఆలోచిస్తేనే నాకు చాలా భయంగా ఉంది అని అంటారు.. అయితే మాధవ్ మాత్రం ఈ పెళ్లయ్యేంత వరకు నేను వెళ్ళిపోతాను అని అంటాడు. ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు ఎప్పుడూ ఈ దున్నపోతులకి చేసి పెడుతూనే ఉంటారా..? తాటి చెట్టు లాగా ఒక్కొక్కరు పెరిగారు మీ గురించి మీరు ఆలోచించరా అని తిడుతుంది.. మాధవ్ ఎంత చెప్తున్నా సరే మహాలక్ష్మి మాత్రం అస్సలు విననే వినదు.. నేను వెళ్ళిపోతాను నా మాట వినకుంటే అని అంటుంది.. అని చివరికి మహాలక్ష్మి మాట వింటాడు మాధవ్.

పెళ్లికి ఏర్పాటు చేసిన అన్నదమ్ములు..

గాయత్రి వస్తుందా లేదా అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఈ టైంలో చక్రి పంతులు లేడు అని చెప్పడంతో మహాలక్ష్మి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఊరికే జోక్ చేశానండి అని చెప్పగానే చక్రిపై మహాలక్ష్మి సీరియస్ అవుతుంది. ఇక పెద్ది రెడీ అవ్వడం చూసి మీరు చాలా అందంగా ఉన్నారు పెద్ది అని అంటుంది. ఇక మహాలక్ష్మి గాయత్రీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.. గాయత్రి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని మహాలక్ష్మి చక్రి ఇద్దరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు.. ఇక మహాలక్ష్మి గాయత్రి కి మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి వస్తాను అని అంటుంది. గాయత్రి బావ వచ్చాడు అని తెలుసుకుని చాలా సంతోషంగా ఉంటుంది..

అడ్డంగా ఇరుక్కున్న గాయత్రి..

గాయత్రి ఎలాగైనా సరే గుడికి వెళ్లాలని అనుకుంటుంది. తాయారు బయటికి వెళ్తే కాళ్లు విరగగొడతాను అని వార్నింగ్ ఇస్తుంది.. అయితే దీన్ని ఈ టైంలో బయట వదిలేయడం మంచిది కాదు అత్తయ్యని తోడు పెట్టి వెళ్లాలని గాయత్రీ కి తోడుగా తాయారు వాళ్ళ అత్తయ్యని అక్కడ పెట్టేసి వెళ్తుంది.. గాయత్రి పెళ్లికూతురుగా రెడీ అయ్యి బయటకు రాగానే ఆ ముసలి దానికి దొరికిపోతుంది.. ఆ ముసలి నుంచి తప్పించుకొని బయటికి వెళ్లాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. మహా వాళ్లు గుడిలో ఇంకా గాయత్రి రాలేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. గాయత్రి ఎలాగైనా సరే ఇక్కడనుంచి తప్పించుకోవాలని అనుకుంటుంది.. అయితే గాయత్రి టీవీ పెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో గాయత్రీ మాధవ్ పెళ్లి జరుగుతుందా లేదా అన్నది చూడాలి..

Also Read:Illu Illalu Pillalu Today Episode: ప్రేమ కోసం కన్నీళ్లు పెట్టుకున్న ధీరజ్.. నిజం చెప్పిన చందు..కుప్పకూలిపోయిన సేనా..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×