// // Podarillu Today Episode : మాధవ్ నవ్వుకు శైలు ఫిదా.. ప్రేమలో -->
E-Paper
Advertisement

Podarillu Today Episode : మాధవ్ నవ్వుకు శైలు ఫిదా.. ప్రేమలో పడుతుందా..? మహా ప్లాన్ వర్కౌట్ అవుద్దా..?

Podarillu Today Episode : మాధవ్ నవ్వుకు శైలు ఫిదా.. ప్రేమలో పడుతుందా..? మహా ప్లాన్ వర్కౌట్ అవుద్దా..?
Advertisement

Podarillu Today Episode April 5th : టీ తాగండి మీకు డ్రెస్సింగ్ చేయాలి అని మహాలక్ష్మి అనగానే.. ఏంది నువ్వా అయితే నేను పారిపోతాను అని నారాయణ అంటాడు.. ఆయనకు నువ్వు చేయాలంటే సిగ్గేస్తుందేమో.. మీరు చేయండి రా నీకేమైంది అని నారాయణ అంటాడు. అందరూ కలిసి నారాయణకు డ్రెస్సింగ్ చేస్తారు అయితే ఈ క్రమంలో తండ్రికి చక్కలిగింతలు పెట్టగానే అందరూ సరదాగా నవ్వుకుంటారు.. అంతా ఒక్కసారిగా తన తండ్రితో కలిసి నవ్వుకోవడంతో మహాలక్ష్మి ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటుంది.. ఇక అందరూ కొడుకులు కలిసి డ్రెస్సింగ్ చేసి నారాయణతో కాసేపు ఆడుకుంటారు. అది కాస్త ఎపిసోడ్ కు హైలెట్ గా నిలుస్తుంది.

కేశవ నువ్వుకు శైలు ఫిదా.. 

కేశవ మెకానిక్ షాప్ కి వెళ్ళిన తర్వాత ఒక్కడే కూర్చొని నవ్వుకుంటూ ఉంటాడు.. నారాయణతో కలిసి చేసిన చిన్న మూమెంట్ కి తలుచుకొని నవ్వుకుంటూ ఉంటాడు.. పదేపదే మహాలక్ష్మి అలా చేయడం వల్ల నవ్వుకున్నాను అని కేశవ ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉంటాడు.. అలా నవ్వుకుంటూ ఉండగా వచ్చిన శైలు ఏంటి ముంగిస నువ్వు నవ్వుతావు కూడా నా అని అడుగుతుంది.. అదేంటి అలా అన్నావ్ నేను నవ్వకూడదా ఏంటి అని కేశవ అడుగుతాడు.. నువ్వు నవ్వచ్చులే నీ నవ్వుకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు అని కావాలని శైలు అంటుంది.. నువ్వు నవ్వితే చాలా బాగుంటావ్ తెలుసా అని శైలు కాంప్లిమెంట్ ఇవ్వగానే.. అది సరే కానీ నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు.

ఫోన్ ఇవ్వకున్నా ఒక్క రీల్ చేస్తాను..

Advertisement

నా ఫోన్ తీసుకొని ఒక రీల్ చేసి పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను అసలే 10k ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు.. ఒక్కసారి నా ఫోన్ ఇవ్వవా? నేను రియల్ చేసుకొని పోస్ట్ చేసి వెళ్ళిపోతాను అని అంటుంది. ముందు 20,000 ఇవ్వు ఆ తర్వాత నీకు ఫోన్ ఇస్తాను అని కేశవ ఎంత చెప్తున్నా సరే.. శైలు మాత్రం ఇప్పుడు నా దగ్గర అంత లేవు ఒక్కసారి ఫోన్ ఇస్తే రీల్స్ చేసుకుంటాను అని రిక్వెస్ట్ చేస్తుంది.. సరే ఇస్తాను కానీ నిన్ను నమ్మడానికి లేదు అని శైలుని చేయంతో కట్టేసి మరి ఆ ఫోన్లో రిలీజ్ చేసుకునేలా చేస్తాడు.. ఆమె ఒక్కటి అని దాదాపు 5 రీల్స్ చేసేస్తుంది..

కేశవ, శైలు ప్రేమలో పడతాడా..? 

రీల్స్ చేస్తున్న సమయంలో కేశవను కావాలనే లాగేస్తుంది.. అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా అని కేశవ కంగారు పడిపోతూ ఉంటాడు. ఈడు ఎలా చేస్తుంది ఏంటి? ఎలా భరించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.. ఇక రిలీజ్ చేసుకోవడం అయిపోయింది కదా నా ఫోన్ ఇచ్చేసి డబ్బులు తీసుకొచ్చి ఆ తర్వాత తీసుకెళ్ళు అని కేశవా అంటాడు. డబ్బులు కాకుండా వేరే ఆప్షన్ ఏదీ లేదా అని శైలు అడుగుతుంది. నువ్వు దొంగతనం చేస్తావని నేను నిన్ను ఇలా కట్టేసాను అయినా నీకు బుద్ధి రావట్లేదా అని కేశవ అంటాడు.. ఇక ఈ ముంగిస మొహానికి ఏదైనా జరగలేదని అనుకుంటూ శైలు అక్కడినుంచి వెళ్ళిపోతుంది..

మాధవ్ కు పెళ్లి సంబంధం.. 

Advertisement

గాయత్రి వాళ్ళని అడగడం ఇక వేస్ట్.. వాళ్ళు అడిగిన కూడా తనను ఇస్తామని చెప్పరు. ఎందుకు వాళ్ళని అడగడం. ఒకవేళ మనం అడగడానికి వెళ్లినా కూడా పెద్ది అస్సలు ఒప్పుకోడు అని చెక్కిరితో పాటు మిగిలిన అన్నదమ్ములు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు.. నేను ఇక వేరేది డిసైడ్ అయ్యాను. పెద్ది కి వేరే సంబంధం చూసి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను అని మహాలక్ష్మి అంటుంది. ఆయన కోసం మాట్రిమోనీ సైట్లలో అమ్మాయిలను వెతుకుతాను అని మహాలక్ష్మి అనుకుంటుంది. అయితే మహాలక్ష్మి అలా అనుకుందో లేదో చక్రీ కూడా తనకి సపోర్ట్ చేస్తాడు.

మాధవ్ కు అనుమానం…

మ్యాట్రిమోనీ సైట్ లో మాధవ్ గురించి డీటెయిల్స్ ని అప్లోడ్ చేస్తుంది . మహాలక్ష్మి. మీ నలుగురు కలిసి కూర్చున్నారు అంటే ఏదో ప్లాన్ చేస్తున్నారు అని అనగానే.. మాకు అదే పని ఇంకేం పని లేదు అని మహా అంటుంది.. సరే ఇక ఎందుకు ? నేను సైట్ కి వెళ్ళొస్తాను అని మాధవ్ వెళ్తాడు. వాళ్ళందరూ ఏదో చేస్తున్నారు అని అనుకుంటాడు. కానీ ఇక మీదట గాయత్రి వాళ్ళ ఇంటికి వెళ్లరులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మొత్తానికి మహాలక్ష్మి మాధవ్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేస్తుంది. అక్కడితో ప్రోమో కూడా ఎండ్ అయిపోతుంది.. మరి సోమవారం ఎపిసోడ్లో మాధవ్ కోసం సంబంధాలు వస్తాయా? మనసు మార్చుకుని ధైర్యం చేసి గాయత్రీ నే ఇంట్లోంచి బయటకు వస్తుందా అన్నది తెలియాలంటే మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×