E-Paper
Advertisement

Podarillu Weekly Episode : ఒంటరిగా మిగిలిన మాధవ్.. గాయత్రి ఎంట్రీతో మహా షాక్.. మాధవ్, గాయత్రిల పెళ్లి?

Podarillu Weekly Episode : ఒంటరిగా మిగిలిన మాధవ్.. గాయత్రి ఎంట్రీతో మహా షాక్.. మాధవ్, గాయత్రిల పెళ్లి?
Advertisement

Podarillu Today Episode April 26th : గాయత్రిని భోజనం చెయ్యమని తాయారు బలవంతం చేస్తుంది. నువ్వు ఏదైనా పిచ్చి పిచ్చి పనులు చేసావంటే నేను చచ్చిపోతాను అని వార్నింగ్ ఇస్తుంది. ఆ మాట వినగానే గాయత్రి ఒక్కసారిగా రెచ్చిపోతుంది. చచ్చిపోతాను అని బెదిరిస్తావు కదా నా గుండెల్లో మాధవ్ భావే ఉన్నాడు. సడన్గా ఇప్పుడు కొత్తవాడి రూపాన్ని దాంట్లో పెట్టుకోవాలంటే కష్టంగా ఉంది నేనే చచ్చిపోతాను అని గాయత్రి కన్నీళ్లు పెట్టుకుంటుంది. చిన్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంటేనే విలవిలలాడిపోతారు. కానీ ఇప్పుడు ప్రేమించిన వాడిని దూరం చేసి మమ్మల్ని ఇంత బాధ పెడతారా అని గాయత్రి అడుగుతుంది. ఇక తర్వాత గాయత్రి ఒంటరిగా వదిలేసిన తాయారు తన కూతురు బాధ పడుతుందని బాధపడుతుంది.. అటు మాధవ్ కూడా గదిలోకి వెళ్లి ఒంటరిగా కింద పడుకొని బాధపడిపోతూ ఉంటాడు..

గాయత్రి దెబ్బ అదుర్స్.. 

రేపు ఉదయం నీ పెళ్లి అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఆ ఎదవ ఇంటికి నువ్వు వెళ్ళావు అంటే నా శవాన్ని చూస్తావు అని గాయత్రిని బెదిరిస్తుంది తాయారు.. అయితే నువ్వు చచ్చిపోవాలనుకుంటే చచ్చిపో నన్ను చంపుతున్న సరిపోవట్లేదా? ఇంకా ఎందుకు ఇది చేసి చంపుతున్నావు అని గాయత్రి బాధ పడిపోతుంది.. భోజనం ప్లేట్ ని పడేసి బావకి దూరమవుతున్నాను. నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను అని గాయత్రీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా జీవితంలో సంతోషం అనేది లేకుండా పోయింది.. ఇక నా బావకి దూరం అవ్వాల్సిన అవసరం లేదు.. ఇప్పుడే వెళ్లి నా బావని పెళ్లి చేసుకుంటాను అని గాయత్రి అనుకుంటుంది.

గాయత్రిని చూసి మహా షాక్..

Advertisement

పెద్దిని ఒంటరిగా వదిలేయండి ఇవాళ ఒక్కరోజు అయిపోతే ఆయన మళ్ళి సెట్ అవుతాడు అని మహాలక్ష్మి అందరితో చెప్తుంది.. ఆ తర్వాత అతని ఒంటరిగా పడుకోనివ్వండి నేను వెళ్లి తలుపు వేసేస్తాను అని అక్కడికి వెళ్ళగానే ఎదురుగా ఒక మనిషి వస్తున్నట్టు కనిపిస్తుంది. అది చూసిన మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. గాయత్రి అక్కడికి రాగానే మహాలక్ష్మి అని అంటుంది. గాయత్రీ నువ్వేంటి ఈ టైం లో వచ్చావు అని మహాలక్ష్మి అడుగుతుంది. మర్చిపోలేక చచ్చిపోలేక ఇలా వచ్చాను అని గాయత్రి అంటుంది. నేను లోపలికి రావచ్చా అని మహాలక్ష్మిని అడగగానే నువ్వెందుకు రాకూడదు లోపలికి వచ్చేసి అని అంటుంది.

గాయత్రికి నారాయణ క్లాస్..

గాయత్రి ఇంట్లోకి రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నువ్వెందుకు వచ్చావు. రానంటావు ప్రేమిస్తున్నానంటావు పెళ్లి చేసుకోవాలి అంటావు. ధైర్యం చేసి రావాలి అంటే రాలేను అంటావు అలాంటి దాన్ని నువ్వు ఎప్పుడూ మళ్ళీ ఎందుకు వచ్చావు అని చక్రి కేశవ ఇద్దరు కూడా గాయత్రిని చెడ మాడా తిట్టేస్తారు. రాకూడదు అని ఉన్నాను కానీ బావని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను అని గాయత్రీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. గాయత్రి మాటలు విన్న మాధవ్ రూమ్ లో నుంచి బయటికి వస్తాడు. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు. మీ అమ్మ చూస్తే మమ్మల్ని చంపేస్తుంది వెళ్ళిపో అని మాధవ్ అంటాడు. ఇక నారాయణ చక్రి ఇద్దరూ కూడా వెనుక గుమ్మం మూసేశాము. ముళ్ళ కంప కూడా పెట్టాము అందుకని నువ్వు ముందు డోర్ నుంచి వచ్చావా? అసలు ఎందుకు వచ్చావే నువ్వు అని నారాయణ గాయత్రి ని అరుస్తాడు. మీరు నన్ను తిట్టినా కొట్టిన నేను బావని మర్చిపోలేక పోతున్నాను అని నిజం చెప్పేస్తుంది.

బావను పెళ్లి చేసుకుంటాను..

Advertisement

రేపు తెల్లారితే నా పెళ్లి. ఆలోపే నేను బావని పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను అని గాయత్రి చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇప్పుడు ఇలా మాట్లాడతావు రేపు ఎవరైనా వచ్చి అడిగితే మూగదాని లాగా ఉంటావు ఏదో ఒకటి నిర్ణయించుకొని చెప్పు.. నా కొడుకుతో నీ మెడలో తాళి కట్టిస్తాను అని నారాయణ అంటాడు. బావని విడిచిపెట్టి నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను ఎలాగైనా సరే నేను బావని పెళ్లి చేసుకోవాలి. బావ దూరమైతే నేను చచ్చిపోతాను అని గాయత్రి అనడంతో ఇక అందరూ కలిసి మాధవ్ కి పెళ్లి చేయాలని అనుకుంటారు. పెళ్ళికొడుకుగా మాధవ్ నీ రెడీ చేసి తీసుకొని వస్తారు. మొన్న నీ మెడలో కట్టాల్సిన తాళి ఇప్పుడు మా అన్నయ్య మళ్లీ నీ మెడలోనే కడుతున్నాడు అని అందరూ చాలా సంతోషంగా ఉంటారు.

తాయారు, పురుషోత్తం ఎంట్రీ..

మాధవ్ గాయత్రి మెడలో తాళి కడుతున్న సమయంలో సడన్గా డోరు తేల్చిన సౌండ్ వినిపిస్తుంది. గాయత్రి మెడలో తాళి కడుతున్న సమయం డోర్ లోంచి తాయారు పురుషోత్తం ఇద్దరు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నువ్వు తాళికట్రా ఎవరి అడ్డు వస్తారో నేను చూస్తాను చంపి జైలుకైనా వెళ్తాను అని నారాయణ అంటాడు.. అక్కడితో ప్రోమో ఎండ్ అయిపోతుంది. మరి. గాయత్రి మాధవుల పెళ్లి జరుగుతుందా?లేదంటే తయారు అడ్డుపడుతుందా? అన్నది తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Also Read :Intinti Ramayanam Weekly Episode: భరత్ కు అవని స్ట్రాంగ్ వార్నింగ్.. రాజేశ్వరి నెక్స్ట్ ప్లాన్?.. తిరిగొచ్చిన శ్రీకర్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×