E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా, చక్రీ ప్రేమలో పడతారా..? కన్నీళ్లు పెట్టుకున్న మాధవ్.. గాయత్రి, మాధవ్ ఒక్కటవుతారా..?

Podarillu Today Episode : మహా, చక్రీ ప్రేమలో పడతారా..? కన్నీళ్లు పెట్టుకున్న మాధవ్.. గాయత్రి, మాధవ్ ఒక్కటవుతారా..?
Advertisement

Podarillu Today Episode April 25th : మాధవ్ కేశవ గాయత్రి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళుతూ ఉండగా అక్కడ డెకరేషన్ చేస్తూ పురుషోత్తం ఇంకాస్త రెచ్చగొట్టేలా.. బాధ పెట్టేలా మాట్లాడతాడు.. తన కూతురు పెళ్లి జరగాలంటే ఒక రేంజ్ ఉండాలి అని వేరే వాళ్ళ ముందు గొప్పలు చెప్పుకుంటూ మాధవ్ ని దారుణంగా అవమానిస్తాడు. కేశవ చాలా కోపంగా ఉంటాడు. నువ్వు ఒక్క మాట చెప్పు వాడి సంగతి నేను చూస్తాను అని కేశవ కోపంగా ఉంటాడు కానీ మాధవ్ మాత్రం మనకు దక్కని వాటి గురించి ఆలోచించడం వేస్ట్ అని అంటాడు. గాయత్రి మాత్రం తన బావని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మాధవ్ కావాలనే పురుషోత్తం రెచ్చగొడుతున్నాడని అక్కడి నుంచి వెళ్ళిపోతారు..

నారాయణ దెబ్బ అదుర్స్..

మాధవ్ గాయత్రి పెళ్లి రేపు అవడంతో బాధపడిపోతూ ఉంటాడు. తను ప్రేమించే అమ్మాయి దూరమైపోతుంది అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. పురుషోత్తం మాట్లాడిన మాటల గురించి కేశవ ఇంట్లోని వాళ్ళ అందరితో చెప్తాడు. ఒంటరిగా కూర్చుని మాధవ్ బాధపడిపోతూ ఉంటాడు.. నారాయణ ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి తాయారు ఇంటికి ఎలా వెళ్లాలి అని అడుగుతాడు. ఇంతకీ నువ్వెవరు అని నారాయణ అడుగుతాడు.. తాయారు వాళ్ళ అమ్మాయిని చేసుకోబోతున్నాడు కదా ఆ అబ్బాయి వాళ్ళ తరపు బంధువుని అని అనగానే మీకు ఈ విషయం తెలియదా పెళ్లికూతురు తల్లి చచ్చిపోయింది అని అంటాడు.. ఏంటండీ ఏం మాట్లాడుతున్నారు పెళ్లికూతురు వాళ్ళ అమ్మ చచ్చిపోయిందా మాకు చెప్పనేలేదు అని అతను టెన్షన్ పడతాడు.. అక్కడికొచ్చిన మాధవ్ ఎవరి ఇంటికి వెళ్లాలి అని అడుగుతాడు.

మాధవ్ ను తిట్టిన నారాయణ..

Advertisement

ఏంటండీ ఈయన మాట్లాడేది నిజంగానే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ చచ్చిపోయిందా అని ఆ వ్యక్తి అడుగుతాడు. పెళ్లికూతురు వాళ్ళ అమ్మ ఏమి చచ్చిపోలేదండి ఆయన వేరే వాళ్ల గురించి అనుకున్నాడు లేండి అని అంటాడు. ఇంతకీ పెళ్లికూతురు వాళ్ళ ఇంటికి ఎలా వెళ్లాలో చెప్పండి అని మాధవ్ ని అడుగుతారు. ఇక మాధవ్ మీరు ఇలా స్ట్రైట్ గా వెళ్తే వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది అని చెప్పగానే నారాయణ ఎందుకురా.. నువ్వు చెప్పావు వాళ్ళింటికి మంది రాకుండా ఉంటే అప్పుడు తెలిసేది కదా అని అరుస్తాడు. నువ్వు ఇలా మంచితనంగా ఉంటేనే వాళ్ళందరూ ఇలా ఏదేదో అనుకుంటారు. మన చేతిలో ఏమీ లేనప్పుడు దేని గురించి ఆలోచించకూడదు నాన్న అని మాధవ్ అంటాడు. పెళ్లి పత్రికను తీసుకొని వెళ్తాడు మాధవ్..

కన్నీళ్లు పెట్టుకున్న పెద్దోడు..

పెళ్లి పత్రికను చూసి గాయత్రి రేపటితో వేరొకరి సొంతం అయిపోతుంది అని చాలా బాధపడిపోతాడు మాధవ్. ఎందుకు నువ్వు అంతగా బాధ పడిపోతున్నావు అని అడుగుతున్న సరే తాను మాత్రం ఒంటరిగా కూర్చుని బాధపడతాడు. మాధవ్ అలా బాధపడడం చూసిన నారాయణ ఏమీ చేయలేక తాను కూడా బాధపడిపోతూ ఉంటాడు. ఇటువైపు మాధవ్ తను ప్రేమించిన అమ్మాయి దూరమవుతుందని కన్నీళ్లు పెట్టుకుంటాడు అటు గాయత్రి కూడా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన బావ దూరం అవుతున్నాడని ఏడుస్తూ ఉంటుంది.

తాయారును చచ్చిపోమ్మన్న గాయత్రి..

Advertisement

గదిలో ఒంటరిగా కూర్చుని బాధపడుతున్న గాయత్రి దగ్గరికి తాయారు భోజనం తీసుకుని వస్తుంది. ఇంకా భోజనం చేయలేదేంటి అని అడిగితే నాకు ఆకలిగా లేదు అని గాయత్రి సమాధానం చెప్తుంది. తింటే ఆకలేస్తుంది నువ్వు ముందు రా రెండుమూతలు తిను అని తాయారు ఎంత బ్రతిమలాడిన కూడా గాయత్రి నేను తినకపోతే చచ్చిపోతానా? ఏంటి నాకు ఇష్టమైన నా బావని కాదన్నావు అప్పుడే చచ్చిపోలేదు.. ఒక పూట భోజనం తినకపోతే నేనేమీ చచ్చిపోనులే అని గాయత్రి అంటుంది. సడన్ గా నీకేమైందే నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా రేపు పెళ్లి పెట్టుకొని నువ్వు ఇలా బాధపడుతూ ఉంటావా అని తాయారు అంటుంది. బాధపడి ఏదైనా పిచ్చిపిచ్చిగా చేసుకోవాలని చూస్తే నేను చచ్చిపోతాను అని తాయారు బెదిరిస్తుంది. అయితే చచ్చిపో అని గాయత్రి అంటుంది.

గాయత్రి పై అనుమానం..

చచ్చిపోతాను అని బెదిరిస్తావు కదా నా గుండెల్లో మాధవ్ భావే ఉన్నాడు. సడన్గా ఇప్పుడు కొత్తవాడి రూపాన్ని దాంట్లో పెట్టుకోవాలంటే కష్టంగా ఉంది నేనే చచ్చిపోతాను అని గాయత్రి కన్నీళ్లు పెట్టుకుంటుంది. చిన్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంటేనే విలవిలలాడిపోతారు. కానీ ఇప్పుడు ప్రేమించిన వాడిని దూరం చేసి మమ్మల్ని ఇంత బాధ పెడతారా అని గాయత్రి అడుగుతుంది. ఇక తర్వాత గాయత్రి ఒంటరిగా వదిలేసిన తాయారు తన కూతురు బాధ పడుతుందని బాధపడుతుంది.. అటు మాధవ్ కూడా గదిలోకి వెళ్లి ఒంటరిగా కింద పడుకొని బాధపడిపోతూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: కొడుకుకు దగ్గరైన రాజేశ్వరి..ఇంట్లో బాంబ్ పేల్చిన పల్లవి.. అవనికి దిమ్మతిరిగే షాక్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×