E-Paper
Advertisement

Podarillu Today Episode : కేశవను కొట్టిన మహా.. శైలును కాపాడిన కేశవ.. మాధవ్ కు నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode : కేశవను కొట్టిన మహా.. శైలును కాపాడిన కేశవ.. మాధవ్ కు నిజం తెలుస్తుందా..?
Advertisement

Podarillu Today Episode April 21st : కన్నా పెళ్లి సంబంధం అమ్మాయి ఏం చెప్పిందో చెప్పండి. ఎన్నిసార్లు అడిగినా సరే.. మహాలక్ష్మి చెప్పడానికి కాస్త మొహమాటపడుతుంది.. కానీ చక్రి మాత్రం నిజం చెప్తాడు. కేశవ కూడా కన్నాతో నిజం చెప్పడంతో తను అన్నయ్య లేకుండా ఎలా ఉండాలి.. అని ఊహించుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు. తను ఏం చేసినా కూడా నాకు గుర్తుండిపోతుంది అన్నట్టుగా బాధపడిపోతూ ఏడుస్తూ బయటికి వెళ్లిపోతాడు.. కానీ నవ్వించేందుకు చక్రిమహా కేశవ ముగ్గురు కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు..

కన్నా ఎమోషనల్…

మాధవ్ పెళ్లి సంబంధం కోసం వెళ్లిన మహా, చక్రిలు కన్నాకు చెప్పగానే దిమ్మతిరిగే షాక్ అవుతాడు. నాకు తల్లి ఎలా ఉంటుందో తెలియదు. తండ్రి బాధ్యత గా లేడు కాబట్టి అన్నయ్య నాకు అమ్మ నాన్న ఈ పెంచాడు అని అంటాడు.. కానీ అన్నయ్య దూరమవుతాడు అంటే నేను చాలా బాధపడుతున్నాను తట్టుకోలేకపోతున్నాను అని కన్న కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎప్పుడు ఇలానే ఉండడం నీకు చూడాలనిపిస్తుందా? సంతోషంగా ఉండాలని నువ్వు ఎప్పుడూ అనుకోవడం లేదా అని కేశవ అన్న సరే కన్నా మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. కన్నా బాధపడుతున్నాడు అని చక్రి మహాలక్ష్మి కేశవ ముగ్గురు కూడా చిన్న ప్రయత్నం చేయాలని అనుకుంటారు.

కేశవను కొట్టిన మహా.. 

Advertisement

కన్నా కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన కేశవ బాధ పడిపోతాడు. ఇవన్నీ ఎలాగైనా నవ్వించాలి అంటే మీరు నన్ను కొట్టండి అని అంటాడు. విన్నను కొడితే వాడు చాలా బాగా సంతోషంగా ఫీల్ అవుతాడు అని కేశవ అంటాడు.. అయితే కేశవ నువ్వు మహాలక్ష్మి కొట్టగానే కన్నా నవ్వుతాడు మొత్తానికి వాడి ఏడుపుని ఆపేస్తారు. నాకు ఈ పెళ్లంటే చాలా ఇష్టం.. అన్నయ్య సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను అని కన్నా అంటాడు.. ఇక పెళ్లికూతురు వాళ్ళకి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పాలని చక్రి ఫోన్ చేసి నిజాన్ని చెప్తాడు. అయితే వాళ్ళు ఒప్పుకోగానే అన్నయ్యని ఒప్పించాలి అని మిగతా ముగ్గురు అనుకుంటారు..

నారాయణను ఒప్పించిన మహా..

మహాలక్ష్మి పెద్దికొచ్చిన సంబంధం గురించి నారాయణతో చెప్పాలని అనుకుంటుంది. ఎప్పుడు ఈ పాటలేనా ఇంట్లో బాధ్యత అనేది మీకు లేదా అని తిడుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి నేను అంత కొంపలు మునిగే పని ఏముంది అని నారాయణ వెటకారంగా మాట్లాడతాడు. అయితే మాధవ్ కి వచ్చిన సంబంధం గురించి మహాలక్ష్మి చెప్పగానే మొదట నారాయణ ఒప్పుకోకపోయినా సరే వాడు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని అంటాడు. మొత్తానికి మహాలక్ష్మి ఇంట్లో వాళ్ళందరిని ఒప్పిస్తుంది.

కేశవను కొట్టిన శైలు..

Advertisement

కేశవను డబ్బులు ఇస్తాను రమ్మని శైలు ఫోన్ చేసి పిలిపిస్తుంది. కేశవ ఇంకా శైలు రాలేదని వెయిట్ చేస్తూ ఉంటాడు. నా ఫోన్ కోసం అంతగా నన్ను తిప్పించుకున్నావు కదా ఇప్పుడు నేను వస్తున్నాను వెయిట్ చేయి నాకు పైడ్ ప్రమోషన్స్ వచ్చింది దానికి వచ్చిన డబ్బుల్ని నీకు అక్కడే నీ మొహాన్ని కొట్టేస్తానని శైలు అనగానే కేశవ వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కని వేరే వాళ్ళందరూ సిగరెట్లు తాగుతూ కనిపిస్తారు.. వాళ్లు శైలు గురించి తప్పుగా మాట్లాడటం చూసిన కేశవ వాళ్ళని కొడతాడు. ఇక శైలు కేశవ అని వాళ్ళని కొడుతూ ఉండడం చూసి కేశవాణి కొడుతుంది. ఎంత చెప్పినా సరే శైలు మాత్రం వినదు. ఇక కేశవా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు.

మాధవ్ కు నిజం చెప్పిన మహా..

మాధవ్ ఇంటికి రాగానే ఆ విషయం గురించి చెప్పాలని అందరూ అనుకుంటారు. అయితే మహాలక్ష్మి తనని ఏమీ అనుకోనంటే చెప్తాను అని అంటుంది.. మాధవ్ కి గారెల సమ్మాయికి మీరు బాగా నచ్చారు అంట.. పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను అని అంటుంది అని అనగానే మొదట ఒప్పుకోకపోయినా సరే.. అందరూ ఒప్పించగానే మాధవ్ ఒప్పుకుంటాడు.. ఇక అన్నయ్య పెళ్లి ఫిక్స్ అయింది అని అందరూ చాలా సంతోషంగా ఉంటారు.

చక్రీకి మహా క్లాస్..

మహాలక్ష్మి చక్రి కోసం దోమల ఆయింట్మెంట్ ని తెచ్చి ఇస్తుంది. వీళ్ళిద్దరి కన్వర్జేషన్ కాస్త ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు అయితే మీరు ఎందుకు పెద్దికి నిజం చెప్పలేదు అని అడుగుతుంది. ఆ మాట చెప్పగానే అన్నయ్య మన అందరిని కొట్టేసి అక్కడికి వెళ్ళిపోతాడు. మనం నిజం చెప్పకుండా పెళ్లి చేసి ఆ తర్వాత నిజం చెప్పడం మేలు అని చక్రి అంటాడు. అందరూ మీ అంత గంప గయాలి లాగా ఉండరు కదా అని చక్రీ మహాను కన్విన్స్ చేస్తాడు. మాధవ్ మాత్రం పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితిలో నేను లేను అని అంటాడు. మహాలక్ష్మి దానికి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మాధవ్ దగ్గర మహాలక్ష్మి కూడా నిజం దాస్తుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి దిమ్మతిరిగే షాక్.. మనోజ్ కోసం గ్రీన్ సిగ్నల్.. మీనాకు దొరికిన మాణిక్యం..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×