E-Paper
Advertisement

Podarillu Today Episode : కన్నీళ్లు పెట్టుకున్న గాయత్రి.. బాధపడ్డ మాధవ్.. మహా మాటతో కన్నీళ్లు పెట్టుకున్న కన్నా..

Podarillu Today Episode : కన్నీళ్లు పెట్టుకున్న గాయత్రి.. బాధపడ్డ మాధవ్.. మహా మాటతో కన్నీళ్లు పెట్టుకున్న కన్నా..
Advertisement

Podarillu Today Episode April 13th : వాళ్లందరూ వెళ్లగానే లోపలికి వెళ్లి తలిపేసుకున్న గాయత్రి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నాకోసం వాళ్ళు వచ్చారు నేను వెళ్తాను అని గాయత్రి చెప్పగానే తాయారు నేను చచ్చిన తర్వాతే వెళ్ళు అని అనగానే భయపడిపోతుంది.. నేను చస్తాను అని బెదిరించడంతోనే తను చెప్పాలనుకున్నది చెప్పకుండా ఆగిపోతుంది.. అటు మాధవ్ గాయత్రి ఇంకా రాలేదు ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటాడు.. కన్నా మాత్రం మీ ఇద్దరికీ పెళ్లి అయిపోతే నేను భరత్ లో ఎలాంటి డాన్స్ వేయాలి అని ఆలోచిస్తున్నానని అంటాడు. మీరిద్దరూ సంతోషంగా ఉంటే నాకు కావాల్సింది ఇంకేముంది అన్నయ్య అని కన్నా అనగానే ఇంకా రాలేదు ఏంటి అని నేను కంగారు పడుతున్నాను అని మాధవ్ అంటాడు..

మాధవ్ కు నిజం చెప్పిన మహా..

గాయత్రి ఎక్కడ ఇంకా రాలేదా గుడి మూసే టైం కూడా అయింది అని మాధవ్ కంగారు పడిపోతూ ఉంటాడు. తను వస్తాను అంటేనే నేను ఇన్ని ఏర్పాట్లు చేశాను మిమ్మల్ని కూడా ఒప్పించాను.. ఇప్పుడు తను రాను అని చెప్తుంది అని అనగానే మాధవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. నువ్వు చెప్తుంది ఏంటమ్మా మహాలక్ష్మి నాకు అర్థం కావడం లేదు అని అనగానే.. గాయత్రి పెళ్లికూతురు గారు రెడీ అయింది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ లాస్ట్ మినిట్ లో నేను రాను అనింది. నాకు తెలుసమ్మా మేమిద్దరం ఎప్పటికీ కలవము అని మాధవ్ చాలా బాధపడిపోతాడు. గాయత్రి ఇలా అనింది అంటే నేను నమ్మలేకపోతున్నానని మాధవ అంటాడు. హరి వీర భయంకరంగా చూసి అందరూ బాధపడతారు..

పంతులు మాటకు ఎమోషనల్..

Advertisement

పెళ్లికూతురు ఇంకా రాలేదు అని పంతులు మళ్లీ అడుగుతాడు.. ఎంత చెప్పినా సరే వినకుండా మాధవ్ మాత్రం బాధ పడిపోతూనే ఉంటాడు. మరి ఎంత చెప్పినా సరే మాధవ్ మాత్రం నా రాత ఇంతే నాకు ఇది అలవాటేలేమ్మా అని మహాలక్ష్మితో అంటాడు మహాలక్ష్మి ఎంత చెప్తున్నా సరే మాధవ్ మాత్రం అందరికీ కనిపించకుండా కన్నీళ్లు పెట్టుకుంటాడు. గుడి మూసే టైం అయింది ఇంకా పెళ్లికూతురు రాలేదా అని పంతులు వచ్చి అడుగుతాడు. అయితే ఈ తాళిబొట్టు నీకు అమ్మాయి మెడలో కట్టే భాగ్యం లేదు కాబట్టి ఇది తీసుకో బాబు అని పంతులు అనగానే అందరూ ఎమోషనల్ అయిపోతారు.

కన్నీళ్లు పెట్టుకున్న మహా..

గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మహాలక్ష్మి ఎక్కిళ్ళు పట్టి ఏడుస్తూ ఉంటుంది.. ఇదంతా నా వల్లే జరిగింది పెద్దిని నేనే అనవసరంగా బాధపెట్టాను అని అనుకుంటుంది.. ఎంత చెప్పిన సరే మహాలక్ష్మి మాత్రం తనని తాను కంట్రోల్ చేసుకోలేక పోతుంది. కేశవ కన్నా ఇద్దరూ కలిసి మాధవ్ చక్రి కి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్తారు. వాళ్లు వచ్చి తలుపు కొట్టి రమ్మని పిలిచిన సరే మహారాదు కానీ పెద్ది రమ్మని పిలిచిన తర్వాత బయటకు వస్తుంది. మీరు బాధపడడానికి నేనే కారణం అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు ఈ విషయం గురించి ఏం బాధపడద్దమ్మా నాకు అలవాటే అని మాధవ్ చెప్పి మహాలక్ష్మిని ఓదారుస్తాడు.

మహా పై చక్రీ సీరియస్…

Advertisement

మహాలక్ష్మి అంతగా బాధపడుతుంటే నువ్వు ఇలానే చూస్తావ్ ఏంట్రా బయటికి చల్లగాలికి తీసుకొని వెళ్ళు అని చక్రికి మాధవ్ చెప్తాడు. వాళ్ళిద్దరు బయటికి వెళ్ళగానే మా అన్నయ్య పెళ్లి జరుగుతుందని నేను చాలా కష్టపడి అప్పు చేశాను.. ఇప్పుడు మా అన్నయ్యకి పెళ్లి కాలేదు కానీ నేనే ఆ డబ్బులు ఇవ్వాలి కదా అని అనుకుంటాడు.. అయితే ఆ డబ్బులు కూడా నేనే ఇస్తాను అని మహాలక్ష్మి అనగానే చక్రి మీరేమీ ఇవ్వద్దు అని వాళ్లిద్దరు కాసేపు గొడవపడతారు.

అందరిని తిట్టినా మహా..

ఉదయం లేవగానే చక్రి కన్నా ఇంకా మాధవ్ కాఫీ ఇవ్వలేదని ఆలోచిస్తూ ఉంటారు.. మాధవ్ రాగానే అందరూ కాఫీ కావాలని అడుగుతారు.. మాధవ్ అలా కాఫీ తీసుకొని వస్తానని వెళ్ళగానే మహాలక్ష్మి మాత్రం ఆయన బాధలో ఉంటే ఆయనను ఇంకా బాధ పెడతారా? దున్నపోతుల్లాగా ఉన్నారు మీరు ఒక పూట కాఫీ తాగకపోతే ఏమౌతుంది అని అరుస్తుంది.. అయితే మాధవ్ ఎంత చెప్పినా సరే మహాలక్ష్మి మాత్రం వాళ్ళని తిట్టకుండా వదలదు.. ఇక అందరూ కలిసి ఎవరి పనులకు వాళ్ళు వెళ్లిపోతారు..

నారాయణ కు మాధవ్ షాక్..

నారాయణ గాయత్రి కి పెళ్లి సంబంధం కోసం వచ్చిన వాళ్ళని శాఖ ఎలా చేస్తాడు. ఆ తాయారు కూతురుతో సంబంధం కలుపుకోవడానికి వచ్చారా వాళ్ల గురించి ఈ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు.. దుబాయ్ లో వాడు ఇంకొక దాన్ని ఉంచుకొని దానికి మొత్తం తగలేశాడు మీకు ఆ విషయం తెలియదా అని ఆ సంబంధం చెడగొట్టేలా మాట్లాడుతాడు. మాధవ్ వచ్చి ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు ఒక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించరా అని అడుగుతాడు.. మాధవ్ గాయత్రి గురించి చాలా గొప్పగా చెప్తాడు. పెళ్లి వాళ్ళు గాయత్రి లాంటి అమ్మాయి మా ఇంటి కోడలు కూడా మా సంతోషమని మా అదృష్టం అంటూ సంతోషంగా ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episode: ప్రేమ, ధీరజ్ ప్రేమకు రేవతి ఫిదా.. నర్మద మాస్టర్ ప్లాన్.. సాగర్ ను ఇరికించిన భాగ్యం..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×